Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Prepaid Plans: ఉచితంగా నెట్‍ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్.. రోజూ 3జీబీ డేటా.. ఎయిర్ టెల్, జియోల బెస్ట్ ప్లాన్లు ఇవే..

పైగా ఫోన్లలో కూడా ఈ ఓటీటీ యాప్స్ వినియోగంలో ఉండటంతో వినియోగదారుడికి వినోదం అరచేతిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్, ఆహా, జీ5 వంటి ఓటీటీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఫోన్ రీచార్జ్ చేసుకునే సమయంలోనే చాలా మంది ఓటీటీ ప్లాట్ ఫారంలకు యాక్సెస్ ఉండే వాటి కోసం వెతుకుతున్నారు. దేశంలోని అగ్రశ్రేణి టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఈ తరహా ప్లాన్లను అందిస్తున్నాయి.

Prepaid Plans: ఉచితంగా నెట్‍ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్.. రోజూ 3జీబీ డేటా.. ఎయిర్ టెల్, జియోల బెస్ట్ ప్లాన్లు ఇవే..
Netflix
Follow us
Madhu

| Edited By: Ram Naramaneni

Updated on: Nov 27, 2023 | 7:39 PM

ఓటీటీ ప్లాట్ ఫారంలు జనాలకు బాగా కనెక్ట్ అవుతున్నాయి. కరోనా ప్యాన్ డెమిక్ అనంతర పరిణామాల్లో ఓటీటీ ప్లాట్ ఫారంలు జనాలను ఆకర్షించాయి. కరోనా సమయంలో చాలా వరకూ సినిమాలు ఈ ఓటీటీల్లోనే విడుదలయ్యాయి. ఇప్పటికీ పలు చిన్న సినిమాలు డైరెక్ట్ ఓటీటీల్లో విడుదల అవుతున్నాయి. వీటికి తోడు పలు వెబ్ సిరీస్ లు కూడా అందులో వస్తున్నాయి. వినియోగదారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని వీక్షించే అవకాశం ఉండటంతో ఈ ప్లాట్ ఫారం విజయవంతం అవుతోంది. పైగా ఇప్పుడు అన్నీ స్మార్ట్ టీవీలు కావడం, పైగా ఫోన్లలో కూడా ఈ ఓటీటీ యాప్స్ వినియోగంలో ఉండటంతో వినియోగదారుడికి వినోదం అరచేతిలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, సోనీ లివ్, ఆహా, జీ5 వంటి ఓటీటీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ క్రమంలో ఫోన్ రీచార్జ్ చేసుకునే సమయంలోనే చాలా మంది ఓటీటీ ప్లాట్ ఫారంలకు యాక్సెస్ ఉండే వాటి కోసం వెతుకుతున్నారు. గతంతో వొడాఫోన్ వంటి టెలికాం సంస్థలు పలు ఓటీటీ ప్లాట్ ఫారం లకు ఉచిత యాక్సెస్ అందిచే ప్లాన్లను అందిచేవి. అయితే ఆ తర్వాత వాటిని నిలిపివేశాయి. అయితే దేశంలోని అగ్రశ్రేణి టెలికాం సంస్థలైన ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో ఈ తరహా ప్లాన్లను అందిస్తున్నాయి. మీకు డేటాతో పాటు నెట్ ఫ్లిక్స్ యాప్ నకు ఉచిత సబ్ స్క్రిప్షన్ అందించే రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ప్రీపేయిడ్ ప్లాన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

రిలయన్స్ జియో..

  • ప్రస్తుతం, రిలయన్స్ జియో నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో కేవలం రెండు ప్రీపెయిడ్ ప్లాన్‌లను మాత్రమే కలిగి ఉంది. ఈ రెండింటిలో తక్కువ ధర రూ. 1,099. ఈ ప్యాక్ లో నెట్ ఫ్లిక్స్ ఉచిత సబ్ స్క్రిప్షన్ తో పాటు రోజుకు 2జీబీ మొబైల్ డేటా వస్తుంది. 84 రోజుల చెల్లుబాటు ఉంటుంది. మిగిలిన ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే, ఈ ప్లాన్లో కూడా మీరు అపరిమిత వాయిస్ కాల్‌లు, రోజుకు 100 ఎస్ఎంఎస్ లను ఉచితంగా పొందుతారు.
  • మీకు మరింత మొబైల్ డేటా కావాలంటే రూ. 1,499 ప్లాన్ ఉంది. ఇది అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు వస్తాయి. 84 రోజుల చెల్లుబాటు అవుతుంది. రోజుకు 3జీబీ మొబైల్ డేటాను అందిస్తుంది.
  • జియో నుండి చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌ల మాదిరిగానే, మీరు జియో టీవీ, జియో సినిమా,జియో క్లౌడ్ కి కూడా యాక్సెస్ పొందుతారు.

ఎయిర్‌టెల్ ప్లాన్లు..

ఎయిర్‌టెల్ నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను అందించే ఒక ప్లాన్‌ను మాత్రమే కలిగి ఉంది. 84 రోజుల చెల్లుబాటుతో, ప్రీపెయిడ్ ప్లాన్ రోజుకు 3జీబీ మొబైల్ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు వంటి ఇతర ప్రయోజనాలను అందిస్తుంది. మీరు 3 నెలల అపోల్లో 24|7 సర్కిల్, ఉచిత హెలో ట్యూన్స్, వింక్ మ్యూజిక్ యాక్సెస్ వంటి అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. దీనిని రూ.1,499కి పొందవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
గ్రాండ్‌గా కాజల్ అగర్వాల్ కుమారుడి బర్త్ డే వేడుకలు.. ఫొటోస్
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
పెళ్లి గురించి గిల్ షాకింగ్ సమాధానం.. సిగ్గుపడుతూ!
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
బాలీవుడ్‏లో తోపు హీరోయిన్.. తెలుగు హీరోను ప్రేమించి పెళ్లి ...
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
డ్రెస్సింగ్ రూమ్‌లో హిట్‌మ్యాన్ ఖతర్నాక్ స్పీచ్..
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
సెల్ఫీ సూసైడ్.. కాపాడే ప్రయత్నంలో ముగ్గురు మృతి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
ఈ గుడిలో మొక్కకున్నాకే కోర్టు సినిమా ఛాన్స్ వచ్చింది: శ్రీదేవి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
షార్ట్ సర్క్యూట్‌తో కారులో మంటలు.. నలుగురు మృతి
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
ఆ హీరోతో డేటింగ్ రూమర్స్.. క్లారిటీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే..
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
పరువాల వల విసురుతున్న ముద్దుగుమ్మ.. అందాల డోస్ మరింత పెంచిన దివి
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్
గేట్‌లో ఆపారు.. స్టాండ్‌పై పేరు పెట్టారు! రోహిత్ ఎమోషనల్