Dangerous Apps: అలర్ట్.. అలర్ట్.. మీ ఫోన్‌లో ఈ యాప్‌లుంటే.. అంతే సంగతులు.. వెంటనే డిలీట్ చేసేయండి..

మీకు ఏదైనా తెలియని నంబర్ల నుంచి ఆకర్షణీయమైన ఆఫర్ల పేర్లతో లింకులను పంపుతారు. వాటిని ఓపెన్ చేయగానే సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని, వాళ్ల బ్యాంకుల్లో సొమ్ములను కాజేస్తున్నారు. అలాగే మనం వినియోగించే యాప్ ల ద్వారా మన సమాచారాన్ని తస్కరిస్తారు.

Dangerous Apps: అలర్ట్.. అలర్ట్.. మీ ఫోన్‌లో ఈ యాప్‌లుంటే.. అంతే సంగతులు.. వెంటనే డిలీట్ చేసేయండి..
Dangerous Apps
Follow us
Madhu

|

Updated on: Apr 30, 2023 | 7:00 PM

సైబర్ దాడులు.. ఇటీవల కాలంలో జనాలను భయాందోళనకు గురిచేస్తున్న అంశం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న ఏదో ఒక రకంగా సైబరాసురులు వ్యక్తిగత డేటాను తస్కరించడంతో పాటు ఆన్ లైన్ చోరీలకు పాల్పడుతున్నారు. ఏ మాత్రం అవకాశం దొరికినా ప్రజలను నిండాముంచుతున్నారు. అసలు వీరు ఎలా వ్యక్తుల డేటాను సేకరిస్తారు? ఎలా మోసం చేస్తారు? అనే విషయంపై క్లారిటీ ఉంటే ఈ దాడులను నిరోధించే అవకాశం ఉంది. ప్రధాన వీరు మీకు ఏదైనా తెలియని నంబర్ల నుంచి ఆకర్షణీయమైన ఆఫర్ల పేర్లతో లింకులను పంపుతారు. వాటిని ఓపెన్ చేయగానే సదరు వ్యక్తికి సంబంధించిన సమాచారాన్ని, వాళ్ల బ్యాంకుల్లో సొమ్ములను కాజేస్తున్నారు. అలాగే మనం వినియోగించే యాప్ ల ద్వారా మన సమాచారాన్ని తస్కరిస్తారు. మనం ఏవో అవసరం అయ్యి గూగుల్ ప్లే స్టోర్ లో దొరికన యాప్ లను డౌన్ లోడ్ చేసుకుంటాం.. అయితే వాటిల్లో హానికరమైన యాప్స్ కూడా ఉంటాయి. వాటిని గుర్తించకపోతే ఆ యాప్ లకు ఇచ్చే పర్మిషన్ల ద్వారా సైబరాసురులు మీ వ్యక్తిగత డేటాను తస్కరిస్తారు. అలాంటి 19 రకాల ప్రమాదకరమైన యాప్స్‌ను నిపుణులు గుర్తించారు. ఇవి మీ ఫోన్ లో ఉంటే వెంటనే మాల్వేర్ ఫా వెంటనే తమ ఫోన్ల నుంచి డిలీట్‌ చేయాలని సైబర్‌ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అవేంటో చూద్దాం..

కొత్త కొత్త మార్గాల్లో..

సైబర్‌ నేరగాళ్లు స్మార్ట్‌ఫోన్‌ డేటాను యాక్సెస్‌ చేసుకోనేందుకు అనేక కొత్త మార్గాలను అన్వేషిస్తున్నట్లు మాల్వేర్ ఫాక్స్ తన నివేదికలో స్పష్టం చేసింది. గూగుల్‌ ప్లేస్టోర్‌లోని కొన్ని ప్రమాదకర యాప్‌లను వినియోగించి స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంటున్నట్లు వెల్లడించింది. ఆండ్రాయిడ్‌ ఓపెన్‌ సోర్స్ ప్రోగ్రాం కావడంతో.. మాల్‌వేర్‌ ప్రోగ్రాం అయిన ట్రోజన్‌, యాడ్వేర్, స్పైవేర్‌, కీలాగ్గర్‌ లాంటివి వినియోగించి వారి యాజర్ల డేటాను యాక్సెస్‌ చేసేస్తున్నట్లు వివరించింది.

డూప్లికేట్ యాప్ లు..

సైబర్‌ నేరగాళ్లు గూగుల్‌ ప్లే స్టోర్‌లోని కొన్ని ఓరిజినల్ యాప్‌లకు కొన్ని హానికరమైన కోడింగ్‌ చేసి, కొత్త వెర్షన్‌, కొత్త పేర్లతో ప్రవేశపెడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే పలువురి ఫోన్లలో ఈ యాప్ లు ఉండే అవకాశం కూడా ఉంది. వాటిని డిలీట్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ యాప్ లు ఏవంటే..

ఇవి కూడా చదవండి

హార్లీ ట్రోజన్‌ కలిగి ఉన్న యాప్‌లు..  ఫ్రీ గేమ్‌హబ్‌ అండ్‌ బాక్స్‌, హోప్‌ కెమెరా- పిక్సర్‌ రికార్డ్, సేమ్‌ లాంచర్‌ అండ్‌ లైవ్‌ వాల్‌పేపర్‌, అమెజింగ్‌ వాల్‌పేపర్‌, కూల్‌ ఎమోజీ అండ్‌ స్టిక్కర్‌.

జోకర్‌ స్పైవేర్ కలిగి ఉన్న యాప్‌లు..  సింపిల్‌ నోట్‌ స్కానర్‌, యూనివర్సల్‌ పీడీఎఫ్‌ స్కానర్‌, ప్రైవేట్‌ మెసెంజర్‌, ప్రీమియం ఎస్ఎంఎస్, బ్లడ్‌ ప్రెజర్‌ చెక్కర్, కూల్‌ కీబోర్డ్‌, పెయింట్‌ ఆర్ట్‌, కూలర్‌ మెసేజ్‌.

ఆటోలికోస్ మాల్వేర్‌ కలిగి ఉన్న యాప్‌లు..  వ్లాగ్‌ స్టార్‌ వీడియో ఎడిటర్‌, క్రియేటివ్‌ 3డీ లాంచర్‌, వావ్‌ బ్యూటీ కెమెరా, గిఫ్ ఎమోజీ కీబోర్డ్‌, ఇన్‌స్టంట్‌ హార్ట్‌రేట్‌ ఎనీటైం, డెలికేట్‌ మెసేంజర్‌.

ఈ 19 యాప్ లు మీ ఫోన్ లో ఉంటే తక్షణమే వాటిని డిలీట్ చేయాలి.

ఆ జాగ్రత్తలు తప్పనిసరి..

  • ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేసినప్పుడు, దానికి సంబంధించిన కామెంట్స్‌ను చదివితే కొంత ఉపయోగకరంగా ఉంటుంది.
  • స్మార్ట్‌ఫోన్‌లో యాంటీ వైరస్‌, యాంటీ మాల్‌వేర్ సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్‌ చేసుకోవడం మేలు.
  • ఏదైనా యాప్‌ డౌన్‌లోడ్‌ చేయాలనుకున్నప్పుడు ఓసారి రేటింగ్‌ను చూడడం కూడా మంచిది.
  • థర్డ్‌ పార్టీ యాప్‌లు కాకుండా నేరుగా గూగుల్‌ ప్లేస్టోర్ నుంచే డౌన్‌లోడ్‌ చేసుకోవడం మంచిది.
  • యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుంటున్నప్పుడు డెవలపర్‌ ఎవరో చెక్‌ చేయడం వల్ల మాల్‌వేర్‌ బారిన పడకుండా ఉంటాం.
  • యాప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకున్న తర్వాత అనవసరమైన పర్మిషన్లు అడుగుతోందంటే., ఉదాహరణకు ఏదైనా ఫోటో ఎడిటింగ్ యాప్‌ ఇన్‌స్టాల్‌ చేస్తే దానికి సంబందించిన పర్మిషన్లే కాకుండా ఫోన్‌, ఎస్ఎంఎస్ పరిషన్లు కూడా అడుగుతోందంటే ఆ యాప్‌పై కొంచెం అనుమానం వ్యక్తం చేయాల్సిందే.
  • ఫోన్‌కు వచ్చిన లింక్‌లను ఓపెన్ చేయకూడదు. తనిఖీ చేసుకొని ఓపెన్ చేయడం మంచిది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ