Aadhaar Update: మీ పిల్లల ఆధార్ అప్ డేట్ చేయలేదా? అయితే త్వరపడండి.. ఉచితంగా చేసుకొనే అవకాశం మరికొద్ది రోజులే..
2023 మార్చి 15 నుంచి జూన్ 14 వరకూ ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ అవకాశం కల్పించింది. ముఖ్యంగా పదేళ్ల కంటే ఎక్కువ కాలం ఎటువంటి అప్ డేట్లు చేయని వారు కచ్చితంగా తమ బయోమెట్రిక్స్ అప్ డేట్ చేయించుకోవాలని సూచించింది.
ఆధార్ కార్డ్.. మన దేశంలో ప్రతి పౌరుడు కలిగి ఉండాల్సిన ఒక ఐడీ. 12 అంకెలతో ఉండే ఈ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ లేనిదే మన దేశంలో ఏ పనిని చేయించుకోలేం. ప్రతి దానికి ఆధార్ నంబరే ఆధారం. మరి అటువంటి ఆధార్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ గా ఉంచుకోవడం ముఖ్యంగా. కానీ చాలా మంది పదేళ్లకు పైగా ఆధార్ లో ఎటువంటి మార్పులు, చేర్పులు లేకుండా అలా వదిలేశారు. దీని వల్ల బయోమెట్రిక్స్ విషయంలో చాలా మార్పులొచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రభుత్వం గత పదేళ్లుగా కనీసం ఒక్కసారి కూడా ఆధార్ కార్డు అప్ డేట్ చేయని వారు తప్పనిసరిగా తమ బయోమెట్రిక్స్ ని మళ్లీ అప్ డేట్ చేయించుకోవాలని సూచించింది. వ్యక్తుల బయోమెట్రిక్స్, అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నంబర్ వంటి ఇతర వివరాలను సరిచూసుకోవాలని తెలిపింది. ముఖ్యంగ వయస్సు 5 నుంచి 15ఏళ్ల మధ్య పిల్లలు తప్పనిసరిగా తమ బయోమెట్రిక్స్ అప్ డేట్ చేయించుకోవాలని సూచించింది. దీనికి సంబంధించిన చార్జీలు, చివరి తేది, అప్ డేట్ విధానం గురించి ఇప్పుడు చూద్దాం..
జూన్ 14 వరకూ ఉచితంగా..
2023 మార్చి 15 నుంచి జూన్ 14 వరకూ ఉచితంగా ఆధార్ అప్ డేట్ చేసుకునేందుకు యూఐడీఏఐ అవకాశం కల్పించింది. ముఖ్యంగా పదేళ్ల కంటే ఎక్కువ కాలం ఎటువంటి అప్ డేట్లు చేయని వారు కచ్చితంగా తమ బయోమెట్రిక్స్ అప్ డేట్ చేయించుకోవాలని సూచించింది. అందుకోసం తమ అడ్రస్ ప్రూఫ్ ని సమర్పించాలని సూచించింది. అందుకోసం ఆన్‌లైన్‌లో https://myaadhaar.uidai.gov.inను సందర్శించాలని సూచిస్తోంది.
దీనికి మాత్రం రూ. 50 ఫీజు..
వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని అప్ డేట్ చేసుకోవాలనంటే మాత్రం రూ. 50 ఫీజు చెల్లించాలని యూఐడీఏఐ ప్రకటించింది. ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ(పీఓఐ), ప్రూఫ్ ఆఫ్ అడ్రస్(పీఓఏ)వంటి వాటిని అప్ డేట్ చేయాలంటే ఈ రుసుం చెల్లించాలని సూచించింది.
ఎలా అప్ డేట్ చేసుకోవాలంటే..
ఉచితంగా అప్ డేట్ చేసుకోవాలనుకొనే వారు కచ్చితంగా ఆన్ లైన్ లో My Aadhaar పోర్టల్ లోకి మాత్రమే అవకాశం ఉందని గమనించాలి. ఇతర ఆధార్ కేంద్రాలకు వెళ్తే మాత్రం రూ. 50 ఫీజు చెల్లించాల్సిందే. ఉచితంగా ఎలా చేసుకోవాలంటే..
- యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
- ‘మై ఆధార్ మెనూ’ను ఓపెన్ చేయాలి.
- దానిలో ‘అప్ డేట్ యువర్ ఆధార్’ ను ఎంపిక చేసుకోవాలి.
- ఆ తర్వాత ‘అప్ డేట్ డెమోగ్రాఫిక్ డేటా ఆన్ లైన్’ ని సెలెక్ట్ చేసుకోవాలి.
- ‘ప్రోసీడ్ టు అప్ డేట్ ఆధార్’ ను క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి.
- క్యాప్చా వెరిఫికేషన్ పూర్తి చేసి, సెండ్ ఓటీపీ అనే బటన్ పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత అప్ డేట్ డెమోగ్రాఫిక్స్ డేటా ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి.
- డీటైల్ టు అప్ డేట్ అనే ఆప్షన్ ఎంపిక చేసుకోవాలి.
- కొత్వ వివరాలు ఎంటర్ చేయాలి.
- ప్రూఫ్ డాక్యూమెంట్ ను స్కాన్ చేసి అప్ లోడ్ చేయాలి.
- మీరు ఎంటర్ చేసిన సమాచారం సరిగ్గా ఉందో లేదో సరిచూసుకోవాలి. తర్వాత సబ్ మిట్ కొట్టాలి.
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కు వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ చేయాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..