- Telugu News Photo Gallery Technology photos Infinix launches budget smartphone infinix smart 7 hd features and price details Telugu Tech News
Infinix smart 7hd: రూ. 5 వేలకే స్మార్ట్ ఫోన్.. ఫీచర్స్ విషయంలో రాజీ పడాల్సిన సవాలే లేదు.
తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్‌కోసం చూస్తున్నారా.? అయితే ఇన్‌ఫినిక్స్ నుంచి వచ్చిన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ మీ బెస్ట్ ఛాయిస్‌గా చెప్పొచ్చు. అత్యంత తక్కువ ధరలో మంచి ఫీచర్లతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌కు సంబంధించిన ఫీచర్ల వివరాలు, ధర ఎంత లాంటి పూర్తి సమాచారం మీ కోసం..
Updated on: Apr 30, 2023 | 4:03 PM

ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ కొనాలంటే కనీసం రూ. 20 వేలు చెల్లించాల్సిందే. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ కంపెనీల మధ్య పెరుగుతోన్న పోటీ నేపథ్యంలో తక్కువ ధరకే స్మార్ట్ ఫోన్‌లు అందుబాటులోకి వస్తున్నాయి. అత్యంత తక్కువ ధరలో ఫోన్‌లను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

బడా కంపెనీలు సైతం అన్ని ఫీచర్లతో కూడిన ఫోన్స్‌ను తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. తాజాగా ఇన్‌ఫినిక్స్ ఇలాంటి ఓ బడ్జెట్ ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇన్‌ఫినిక్స్ స్మార్ట్ 7హెచ్‌డీ పేరుతో తీసుకొచ్చిన ఈ ఫోన్‌ను బడ్జెట్ ధరలో లాంచ్ చేశారు.

ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 5,399గా ఉంది. ప్రముఖ ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో బ్లాక్, సిల్క్ బ్లూ, జేడ్ వైట్, గ్రీన్ ఆపిల్ కలర్స్‌లలో ఫోన్ అందుబాటులో ఉంది. ధర తక్కువ కదా ఫీచర్లు అస్సలు బాగోవనే ఆలోచనే వద్దు. ఎందుకంటే ఫీచర్ల విషయంలో కూడా ఈ ఫోన్ తగ్గేదేలే అన్నట్లు ఉంది.

ఎన్‌ఫినిక్స్ స్మార్ట్ 7హెచ్‌డీ ఫోన్‌లో 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ+రిజల్యూషన్ స్క్రీన్‌ను అందించారు. 500 NITS దీని సొంతం. కెమెరా విషయానికొస్తే ఇందులో 8 మెగాపిక్సెల్ రెయిర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఆండ్రాయిడ్ 12 గో ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5000mAh బ్యాటరీని అందించారు. 50 గంటల మ్యూజిక్, దాదాపు 39 గంటల కాలింగ్, 30 రోజుల స్టాండ్-బై టైమ్‌ని అందిస్తుంది. ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్లను కూడా అందించారు.





























