Tech Tips: మీ ఫోన్ బ్యాటరీ త్వరగా అయిపోతోందా? అయితే ఈ చిన్న సెట్టింగ్స్ మార్చండి చాలు.. పూర్తి వివరాలు ఇవి..
మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే దానిని పూర్తిగా చార్జ్ చేయవద్దు. అలాగే పూర్తిగా బ్యాటరీ అయిపోనివ్వొద్దు. శామ్సంగ్ గెలాక్సీ ఫోన్ల వినియోగదారులైతే దానిని కేవలం 85శాతం వరకూ మాత్రమే చార్జ్ చేయాలని శామ్సంగ్ సూచిస్తుంది. అయితే ఇది మనం తరచూ మాన్యువల్ గా పర్యవేక్షించడం కష్టతరమవుతుంది. అయితే ఫోన్లలోనే శామ్సంగ్ ఓ ఆప్షన్ ను అందించింది.

స్మార్ట్ ఫోన్లలోని భాగాలలో ముఖ్యమైనది బ్యాటరీ. దాని ఆధారంగానే ఫోన్ మొత్తం పనితీరు ప్రభావితం అవుతుంది. అది సక్రమంగా ఎక్కువసేపు ఉంటేనే ఫోన్ ఆన్ అవుతుంది. అయితే ఫోన్ పాతదయ్యే కొద్దీ బ్యాటరీ బలహీనపడుతుంది. బ్యాకప్ తక్కువగా ఉంటుంది. అయితే స్మార్ట్ ఫోన్ బ్యాటరీ బలహీనపడకుండా కొన్ని సంవత్సరాలపాటు కాపాడుకోవచ్చు. ముఖ్యంగా శామ్సంగ్ గెలాక్సీ వినియోగదారులకు వారి ఫోన్లలోని సెట్టింగ్స్ మార్చుకుంటే చాలు బ్యాటరీ బ్యాకప్ పెరుగుతుంది. అలాంటి కీలకమైన సులభమైన మూడు సెట్టింగ్స్ ను మీకు తెలియజేస్తున్నాం. అవేంటో తెలుసుకోండి..
పూర్తిగా చార్జ్ చేయొద్దు..
మీ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే దానిని పూర్తిగా చార్జ్ చేయవద్దు. అలాగే పూర్తిగా బ్యాటరీ అయిపోనివ్వొద్దు. శామ్సంగ్ గెలాక్సీ ఫోన్ల వినియోగదారులైతే దానిని కేవలం 85శాతం వరకూ మాత్రమే చార్జ్ చేయాలని శామ్సంగ్ సూచిస్తుంది. అయితే ఇది మనం తరచూ మాన్యువల్ గా పర్యవేక్షించడం కష్టతరమవుతుంది. అయితే ఫోన్లలోనే శామ్సంగ్ ఓ ఆప్షన్ ను అందించింది. దీనిని ఎనేబుల్ చేసుకోవడం ద్వారా బ్యాటరీ 85శాతం చార్జింగ్ పూర్తికాగానే ఆటోమేటిక్ గా బ్యాటరీ చార్జింగ్ ఆగిపోతుంది. మీ శామ్సంగ్ గెలాక్సీ స్మార్ట్ ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్లి అందులో బ్యాటరీ ఆప్షన్ ను ఎంపిక చేసుకొని దానిలో ప్రోటెక్ట్ బ్యాటరీని ఎనేబుల్ చేయాలి. ఆ తర్వాత దానిని 85శాతానికి లిమిట్ చేసుకోవాలి.
డిజేబుల్ ఫాస్ట్ చార్జింగ్..
ఫాస్ట్ చార్జింగ్ మోడ్లో ఫోన్ విపరీతంగా వేడిని గ్రహిస్తుంది. ఫోన్ మొత్తం వేడిగా అయిపోతోంది. ఇది దీర్ఘకాలంలో బ్యాటరీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అందువల్ల స్మార్ట్ ఫోన్లో ఫాస్ట్ చార్జింగ్ ను నిలివేయడం ద్వారా ఛార్జింగ్ చేసేటప్పుడు అధిక వేడిని నిరోధించవచ్చు. దీని ఫలితంగా బ్యాటరీ ఆరోగ్యాన్ని పొడిగించవచ్చు. అలాగే మీ ఫోన్ వైర్ లెస్ చార్జింగ్ సపోర్టు చేసినా.. అది కూడా మీ ఫోన్ మరింత వేడిగా అయిపోయేలా చేస్తుంది. దీని కోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్లోకి వెళ్లి ఆ తర్వాత చార్జింగ్ ఆప్షన్ లోకి వెళ్లి ఫాస్ట్ చార్జింగ్ ఆప్షన్ ను నిలిపివేయండి. అయితే ఇలా చేయడం వల్ల ఫోన్ చార్జింగ్ కు ఎక్కువ సమయం తీసుకుంటుందని మాత్రం గుర్తుంచుకోవాలి.
వాడని యాప్ లను నిలిపివేయండి..
మీ ఫోన్లో వినియోగించని చాలా యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ అవుతాయి. మీరు వాటిని ఉపయోగించకపోయినా, అవి శక్తిని వినియోగించుకుంటాయి. ఉపయోగించని యాప్‌లను నిద్రపోయేలా ఎనేబుల్ చేయడం ద్వారా, మీరు దీన్ని జరగకుండా నిరోధించవచ్చు, ఇక్కడ, మీరు కొంతకాలంగా తెరవని యాప్‌లను స్మార్ట్‌ఫోన్ విశ్లేషిస్తుంది. వాటిని స్వయంచాలకంగా నిద్రపోయేలా చేస్తుంది. అందుకోసం సెట్టింగ్స్ లోకి వెళ్లి బ్యాటరీ ఆప్షన్ ను ఎంపిక చేసుకొని బ్యాక్ గ్రౌండ్ యూసేజ్ లిమిట్ పై క్లిక్ చేసి, అన్ యూజ్డ్ యాప్స్ ను స్లీప్ లో పెట్టొచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..