Smartwatch: ఎండైనా.. వానైనా తగ్గేదేలా.. వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్‌లు.. మార్కెట్లో బెస్ట్ ఇవే..

ప్రయాణంలో స్మార్ట్ ఫోన్ తీయకుండానే వాచ్ లో మెసేజ్ లు, కాల్స్ రిసీవ్ చేసుకునే వీలుంది. ఇప్పుడు స్విమ్మర్లకు ఉపయోగపడేలా కొత్త వాటర్ ఫ్రూప్ టెక్నాలజీ కలిగిన వాచ్ లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. నీటి అడుగునా కూడా మీ ఫిట్ నెస్ తో పాటు స్విమ్మింగ్ లక్ష్యాలను ట్రాకింగ్ చేస్తాయి. వాటిలో వివిధ బ్రాండ్ల కు చెందిన ఆరు అత్యుత్తమ స్మార్ట్ వాచ్ లు, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.

Smartwatch: ఎండైనా.. వానైనా తగ్గేదేలా.. వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్‌లు.. మార్కెట్లో బెస్ట్ ఇవే..
Best Waterproof Smartwatch
Follow us

|

Updated on: May 17, 2024 | 6:16 PM

టెక్నాలజీ రోజురోజుకూ మరింత స్మార్ట్ గా మారుతోంది. ప్రజలకు ఉపయోగపడేలా అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్ లోకి విడుదలవుతున్నాయి. సాధారణంగా స్మార్ట్ ఫోన్లు వివిధ ఫీచర్లతో కొత్త లుక్ తో విడుదలవుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వాటితో స్మార్ట్ వాచ్ లు పోటీపడుతున్నాయి. వీటిలో ఫీచర్లను పరిశీలిస్తే ఆశ్యర్చపోవాల్సిందే. మణికట్టుపై కేవలం రెండు అంగుళాల లోపు డిస్ ప్లే తో కనిపించే ఈ వాచ్ లలో స్మార్ట్ ఫోన్ల కు తీసిపోని ప్రత్యేకతలు ఉంటున్నాయి. వీటి ద్వారా మన ఆరోగ్య స్థితిని పరిశీలించుకోవచ్చు. హార్ట్ బీట్, ఆక్సిజన్ స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ప్రయాణంలో స్మార్ట్ ఫోన్ తీయకుండానే వాచ్ లో మెసేజ్ లు, కాల్స్ రిసీవ్ చేసుకునే వీలుంది. ఇప్పుడు స్విమ్మర్లకు ఉపయోగపడేలా కొత్త వాటర్ ఫ్రూప్ టెక్నాలజీ కలిగిన వాచ్ లు మార్కెట్లోకి విడుదలయ్యాయి. నీటి అడుగునా కూడా మీ ఫిట్ నెస్ తో పాటు స్విమ్మింగ్ లక్ష్యాలను ట్రాకింగ్ చేస్తాయి. వాటిలో వివిధ బ్రాండ్ల కు చెందిన ఆరు అత్యుత్తమ స్మార్ట్ వాచ్ లు, వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం.

నాయిస్ వివిడ్ కాల్ 2 స్మార్ట్ వాచ్ (noise vivid call 2 smart watch)..

నాయిస్ నుంచి విడుదలైన ఈ వాటర్‌ప్రూఫ్ స్మార్ట్‌వాచ్‌ 1.85 అంగుళాల డిస్‌ప్లేతో ఆకట్టుకుంటుంది. దీనిని నాయిస్ ఫిట్ ప్రైమ్ యాప్ తో కనెక్ట్ చేయవచ్చు. మీ ఆరోగ్యం, వ్యాయామం రెండింటినీ పర్యవేక్షించవచ్చు. ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏడు రోజుల పాటు పనిచేస్తుంది. వారం పొడవునా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉపయోగించుకోవచ్చు. హృదయ స్పందన రేటు, ఎస్పీఓ2, నిద్ర, ఒత్తిడి స్థాయిలను ట్రాక్ చేస్తుంది.

ఫైర్-బోల్ట్ నింజా 3 ప్లస్ (Fire-boltt ninja 3 plus)..

ఫైర్ బోల్ట్ విడుదల చేసిన ఈ వాచ్ 1.83 అంగుళాల డిస్‌ప్లే, 240*284 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. దీనిలో ఐపీ 68 వాటర్ రెసిస్టెంట్ సామర్థ్యం ఉంది. ఇన్‌బిల్ట్ గేమ్‌లు,118 స్పోర్ట్స్ మోడ్‌లు, ఏడు రోజుల బ్యాటరీ లైఫ్, వందకు పైగా క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లు దీని ప్రత్యేకత. ఈతగాళ్ల కోసం స్మార్ట్ హెల్త్ అసిస్టెంట్‌ ఫీచర్ ఉంది. ఎస్పీO2 స్థాయి, హార్ట్ రేట్ , నిద్ర ను ట్రాకింగ్‌ చేస్తుంది.

ఫాస్ట్రాక్ లిమిట్‌లెస్ గ్లైడ్ అడ్వాన్స్‌డ్(FastTrack limitless)..

స్విమ్మర్లకు ఉపయోగపడేలా రూపొందించిన మరో స్మార్ట్ వాచ్ ఇది. దీనిలోని హెల్త్ సూట్‌లు మీ నిద్ర, ఎస్పీO2 స్థాయిలను ట్రాక్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తాయి. శ్వాస వ్యాయామాలు, హృదయ స్పందన రేటును పరిశీలిస్తాయి. ఈ వాచ్ లో వంద ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు, ఏఐ కోచ్, ఆటో మల్టీస్పోర్ట్ రికగ్నిషన్‌ తదితర ఫీచర్లు ఉన్నాయి. ఒక్కసారి చార్జింగ్ చేస్తే దాదాపు ఏడు రోజుల పాటు పని చేస్తుంది. అదే బ్లూటూత్ కాలింగ్‌ను ఉపయోగిస్తే మూడు రోజులు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది.

సీబిరెర్ బియాండ్ 3 స్మార్ట్ వాచ్ (CIBERER BEYOND3)..

ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ బ్యాకప్ చాలా బాగుంది. దాదాపు 14 రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపయోగించుకోవచ్చు. 1.43 అంగుళాల హెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే కలిగిన ఈ వాచ్ లో షాక్, చలి, తేమ, హీట్, స్ప్రే, రెయిన్ రెసిస్టెంట్ ఫీచర్లు ఉన్నాయి. ఐపీ69కే, 3 ఏటీఎమ్ రేటింగ్‌తో 30 మీటర్ల వరకు వాటర్ ప్రూఫ్ గా పని చేస్తుంది. హార్ట్ బీట్, ఆక్సిజన్ స్థాయిలు, కేలరీలు, శ్వాస, నిద్ర తదితర వాటిని ట్రాక్ చేస్తుంది. స్విమ్మింగ్, యోగా, సైక్లింగ్ తదితర 150కి పైగా స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి.

ఎస్ కేజీ స్మార్ట్ వాచ్ (SKG smart watch)..

1.7 అంగుళాల హెచ్ డీ టచ్ స్క్రీన్‌తో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ తో మన హార్ట్ బీట్, ఒత్తిడి స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. ఎనిమిది రోజుల బ్యాటరీ బ్యాకప్ దీని ప్రత్యేకత. 5 ఏటీఎం రేటింగ్ కలిగిన ఈ వాచ్ 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెంట్ ను కలిగి ఉంది. మనకు ఎంతో ఉపయోగపడే 14 స్పోర్ట్స్ మోడ్‌లను కూడా ఉన్నాయి.

ఏక్యూఫిట్ డబ్ల్యూ6 స్మార్ట్ వాచ్ (AQFIT W6 smart watch)..

ఏక్యూ ఫిట్ డబ్ల్యూ6 స్మార్ట్ వాచ్ చాలా తేలికగా ఉంటుంది. 1.69 అంగుళాల పూర్తి టచ్ డిస్‌ప్లే, ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది. వాతావరణ సూచనలతో పాటు మెసేజ్ లు, కాల్‌లు, రోజువారీ రిమైండర్లను అందిస్తుంది. వాటర్‌ ప్రూఫ్, డస్ట్ రెసిస్టెంట్‌గానూ పనిచేస్తుంది. హార్ట్ బీట్, నిద్ర, కేలరీలు, శ్వాస తదితర వాటిని ట్రాక్ చేయడంలో మీకు సహాయపడుతుంది. దీని బ్యాటరీ ఏడు నుంచి పది రోజుల వరకూ వస్తుంది. మహిళల కోసం 15 స్పోర్ట్స్ మోడ్‌లు ఉన్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
అత్యాశకు పోతే అంతే సంగతులు.. పల్లెలను కూడా వదలని సైబర్‌ నేరగాళ్లు
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
బీఆర్ఎస్‌ చుట్టూ కాంగ్రెస్‌ మైండ్‌ గేమ్‌ నడుస్తోందా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!