Forerunner 165: అథ్లెట్లు, రన్నర్ల కోసమే భారతదేశంలో ఆ సూపర్ స్మార్ట్ వాచ్ విడుదల… ధరెంతో తెలుసా..?

ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ దిగ్గజం గార్మిన్ తన సరికొత్త జీపీఎస్-రన్నింగ్ స్మార్ట్‌వాచ్ సిరీస్, ఫోర్రన్నర్ 165ను గ్లోబల్ రన్నింగ్ డే సందర్భంగా భారతదేశంలో ప్రవేశపెట్టింది. అథ్లెట్లు, రన్నర్‌ల కోసం రూపొందించిన ఫోర్రన్నర్ 165 సిరీస్ అధునాతన ఫిట్‌నెస్ మెట్రిక్‌లు, సూపర్ శిక్షణ మాడ్యూల్‌లతో వస్తుంది. ఫోర్రన్నర్ 165 సిరీస్ శక్తివంతమైన ఎమోఎల్ఈడీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో స్మార్ట్‌వాచ్ మోడ్‌లో 11 రోజుల వరకు, జీపీఎస్ మోడ్‌లో 19 గంటల వరకు బ్యాటరీ రన్నింగ్ లైఫ్‌తో ఆకర్షణీయంగా రిలీజ్ చేశారు. 

Forerunner 165: అథ్లెట్లు, రన్నర్ల కోసమే భారతదేశంలో ఆ సూపర్ స్మార్ట్ వాచ్ విడుదల… ధరెంతో తెలుసా..?
Garmin Forerunner 165
Follow us
Srinu

|

Updated on: Jun 06, 2024 | 5:30 PM

ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ దిగ్గజం గార్మిన్ తన సరికొత్త జీపీఎస్-రన్నింగ్ స్మార్ట్‌వాచ్ సిరీస్, ఫోర్రన్నర్ 165ను గ్లోబల్ రన్నింగ్ డే సందర్భంగా భారతదేశంలో ప్రవేశపెట్టింది. అథ్లెట్లు, రన్నర్‌ల కోసం రూపొందించిన ఫోర్రన్నర్ 165 సిరీస్ అధునాతన ఫిట్‌నెస్ మెట్రిక్‌లు, సూపర్ శిక్షణ మాడ్యూల్‌లతో వస్తుంది. ఫోర్రన్నర్ 165 సిరీస్ శక్తివంతమైన ఎమోఎల్ఈడీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేతో స్మార్ట్‌వాచ్ మోడ్‌లో 11 రోజుల వరకు, జీపీఎస్ మోడ్‌లో 19 గంటల వరకు బ్యాటరీ రన్నింగ్ లైఫ్‌తో ఆకర్షణీయంగా రిలీజ్ చేశారు.  స్మార్ట్ వాచ్‌లో పల్స్ ఓఎక్స్ బ్లడ్ ఆక్సిజన్ మానిటర్, బారోమెట్రిక్ ఆల్టిమీటర్, ఫ్లోర్ క్లైమ్, కంపాస్, అప్‌డేటెడ్ యాంబియంట్ లైట్ సెన్సార్‌లతో వచ్చే ఫోర్రన్నర్ 165 సిరీస్ వాచ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

ఫోర్రన్నర్ 164 వాచ్ 43 ఎంఎం  కేస్ పరిమాణంలో వస్తుంది. అలాగే, డ్యూయల్-షాట్ బ్యాండ్‌లను అందిస్తుంది. స్పోటిఫై లేదా అమెజాన్ మ్యూసిక్ ఖాతాల నుంచి నేరుగా ప్లేజాబితాలను డౌన్‌లోడ్ చేయడం ద్వారా వినియోగదారులు ఫోన్ లేకుండా సంగీతాన్ని ఆశ్వాదించే అవకాం ఇస్తుంది. ఆస్వాదించవచ్చు. ఈ స్మార్ట్ వాచ్‌లో కచ్చితమైన వేగం, లెంగ్త్ ట్రాకింగ్ పీచర్‌తో పాటు హృదయ స్పందన పర్యవేక్షణ కోసం అంతర్నిర్మిత జీపీఎస్ ఫీచర్లు ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ వాచ్ రియల్ టైమ్ పవర్‌తో పాటు కీలకమైన రన్నింగ్ మెట్రిక్‌లను అందిస్తుంది.

ఈ స్మార్ట్ వాచ్ వర్కౌట్‌లు ఫిట్‌నెస్, వాటి ప్రయోజనాలను ఎలా ప్రభావితం చేస్తాయో? క్లియర్ కట్‌గా చూపిస్తుంది. ముఖ్యంగా గార్మిన్ కనెక్ట్ యాప్ ద్వారా ఇప్పటికే ఉన్న కోర్సులను సృష్టించడానికి లేదా? కనుగొనడానికి, అలాగే వాటిని నేరుగా వాచ్‌కి సమకాలీకరించడానికి ఈ ఫీచర్ వినియోగదారులను అనుమతిస్తుంది. కార్యాచరణ ప్రొఫైల్‌ విషయానికి వస్తే ట్రయల్ రన్నింగ్, ఓపెన్-వాటర్ స్విమ్మింగ్, పికిల్‌బాల్, టెన్నిస్ వంటి 25కి పైగా కార్యాచరణ ప్రొఫైల్‌లు ఉన్నాయి. అలాగే నిద్రతో శిక్షణ తీసుకునే వారికి ప్రత్యేక అలెర్ట్‌లు, హెచ్ఆర్‌వీ స్థితితో వాతావరణంపై అనుకూలీకరించదగిన నివేదికను అందిస్తుంది. ప్రత్యేకంగా పల్స్ ఆక్స్ ఫీచర్ నిద్రలో ఉన్నప్పుడు కూడా రక్త ఆక్సిజన్ స్థాయిలను తెలియజేసే అవకాశాన్ని ఇస్తుంది. నిద్ర పర్యవేక్షణతో నిద్ర స్కోర్ ట్రాక్ చేస్తే స్లీపింగ్ స్కోర్‌ ఈ వాచ్ ప్రత్యేకతలుగా నిలుస్తున్నాయి. 

ఇవి కూడా చదవండి

నిద్రను గుర్తించడంతో పాటు సమయం, వ్యవధితో శరీరానికి ప్రయోజనం చేకూర్చడానికి ఆటోమెటిక్ న్యాప్‌లను ట్రాక్ చేసే సదుపాయం ఈ వాచ్ ప్రత్యేకతగా ఉంటుంది. వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లతో గైడెడ్ వర్కౌట్‌లు, పనితీరు హెచ్చరికలకు ఈ వాచ్ మద్దతు ఇస్తుంది. గార్మిన్‌లోని గ్లోబల్ కన్స్యూమర్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ డాన్ బార్టెల్ ఈ వాచ్ గురించి ఇటీవల మాట్లాడుతూ ప్రొఫెషనల్ రన్నర్‌లతో పాటు అథ్లెట్‌ల కోసం వారి శిక్షణను నిశితంగా విశ్లేషించడం ద్వారా ఫేస్, దూరం, వారి హార్ట్ బీట్ రేట్, వీఓ2 గరిష్టం వంటి విషయాలను ట్రాక్ చేయడానికి ఈ వాచ్ చాలా కీలకంగా పని చేస్తుందని వివరించారు. 

ముఖ్యంగా ఈ స్మార్ట్‌వాచ్‌లో హృదయ స్పందన రేటు, నిద్ర, ఒత్తిడి కోసం కార్యాచరణ, విశ్రాంతిని ఆప్టిమైజ్ చేయడానికి 24/7 ట్రాకింగ్‌ను అందిస్తుందని పేర్కొన్నారు. ఈ వాచ్ రుతుచక్రం, గర్భధారణ పర్యవేక్షణ, వ్యాయామం, పోషకాహార విద్య వంటి మహిళల ఆరోగ్య ట్రాకింగ్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. ధర విషయానికి వస్తే భారతదేశంలో గార్మిన్ ఫార్‌రన్నర్ 165 సిరీస్ ధర రూ.33,490గా ఉంటుంది. ఈ వాచ్ రెండు సంవత్సరాల వారెంటీతో వస్తుంది. టర్కోయిస్/ఆక్వా, బ్లాక్/స్లేట్ గ్రే, మిస్ట్ గ్రే/వైట్‌స్టోన్, బెర్రీ/లిలక్ వంటి రంగుల్లో లభ్యమయ్యే ఈ స్మార్ట్ వాచ్‌ ప్రీమియం బ్రాండ్ స్టోర్‌లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..