WhatsApp Update: వాట్సాప్ యూజర్లకు మరో శుభవార్త.. డెస్క్ టాప్ నుంచీ ‘స్టేటస్’..
కొత్త ఫీచర్ ప్రకారం వినియోగదారులు తమ మ్యాక్ డెస్క్‌టాప్ యాప్ నుంచి స్టేటస్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఏదైనా లింక్ చేసుకున్న మొబైల్ పరికరం నుంచి స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా ఫొటోలు, వీడియోలు, జీఐఎఫ్ లు, టెక్స్ట్ లు, వాయిస్ మెసేజ్‌లను షేర్ చేయగల సామర్థ్యం ఇటీవల వాట్సాప్ యూజర్లకు వచ్చింది. ఇప్పుడు దీనిని మ్యాక్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు యాజమాన్యం పని చేస్తోంది.
వాట్సాప్ వినియోగదారులకు మరో శుభవార్త. మీకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు వాట్సాప్ యజమాన్యం మరో కొత్త అప్ డేట్ ను తీసుకురానుంది. ఇప్పటికే ఈ యాప్ లో అనేక కొత్త ఫీచర్లు వచ్చాయి. వాటిని యాజమాన్యం కొనసాగిస్తోంది. యూజర్లకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
ప్రజల ఆదరణ..
ప్రముఖ మేసేజింగ్ యాప్ వాట్సాప్ యాప్ కు ప్రజల ఆదరణ ఎంతో ఉంది. లక్షల మంది ఈ యాప్ ను వినియోగిస్తున్నారు. దాదాపు ప్రతి స్మార్ట్ ఫోన్ లోనూ ఈ యాప్ తప్పనిసరిగా ఉంటుంది. ఈ నేపథ్యంలో వినియోగదారులకు కొత్త ఫీచర్లు అందించేందుకు యాజమాన్యం నిరంతరం చర్యలు తీసుకుంటోంది. కొత్తగా వాట్సాప్ డెస్క్‌టాప్ యాప్ నుంచి యూజర్లు స్టేటస్ అప్‌డేట్‌లను పోస్ట్ చేయడానికి వీలుండేలా కొత్త ఫీచర్ రూపొందిస్తుంది.
కొత్త అప్ డేట్..
కొత్త ఫీచర్ ప్రకారం వినియోగదారులు తమ మ్యాక్ డెస్క్‌టాప్ యాప్ నుంచి స్టేటస్ అప్‌డేట్ చేసుకోవచ్చు. ఏదైనా లింక్ చేసుకున్న మొబైల్ పరికరం నుంచి స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా ఫొటోలు, వీడియోలు, జీఐఎఫ్ లు, టెక్స్ట్ లు, వాయిస్ మెసేజ్‌లను షేర్ చేయగల సామర్థ్యం ఇటీవల వాట్సాప్ యూజర్లకు వచ్చింది. ఇప్పుడు దీనిని మ్యాక్ వినియోగదారులకు కూడా అందుబాటులోకి తెచ్చేందుకు యాజమాన్యం పని చేస్తోంది. ఇంతకు ముందు మ్యాక్ యాప్ లో స్టేటస్ అప్‌డేట్‌లను పోస్ట్ చేసే ఆప్షన్ లేదు. కేవలం వాటిని వీక్షించడానికి మాత్రమే వినియోగదారులను అవకాశం ఉండేది.
ఎంతో సౌకర్యం..
ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ డెస్క్‌టాప్ నుంచి స్టేటస్ అప్‌డేట్‌లను నేరుగా చేసుకునే అవకాశం లభిస్తుంది. కంప్యూటర్ పై ఎక్కువ సమయం గడిపే వారికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది. యూజర్లు స్టేట స్ అప్ డేట్ కోసం వేరే పరికరాలకు మారాల్సిన అవసరం ఉండదు. వారి సమయాన్ని ఆదా చేసుకోవడం తో పాటు మెరుగున సేవలు అందుతాయి. వినియోగదారులు తమ మొబైల్ ను ఆన్ చేయకుండా, ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయకుండానే అప్ డేట్ లను చేసుకోవచ్చు. వాట్సాప్ రూపొందించిన కొత్త ఫీచర్ ప్రస్తుతం కొంతమంది బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది, త్వరలో యూజర్లందరికీ అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
మెరుగైన సేవలు..
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఇటీవల వాయిస్ నోట్‌లను స్టేటస్ అప్‌డేట్‌లుగా పోస్ట్ చేయడానికి కాల పరిమితిని పెంచింది. దాదాపు ఒక్క నిమిషం వరకూ వాయిస్ నోట్‌లను షేర్ చేసే వీలు కల్పించింది. ఇందుకోసం స్టేటస్ ఫీచర్‌ను మెరుగుపరిచింది. దీని ద్వారా వినియోగదారులు తమ స్టేటస్ అప్‌డేట్‌ల ద్వారా సుదీర్ఘ ఆడియో సందేశాలను రికార్డ్ చేయవచ్చు, షేర్ చేయవచ్చు. అంటే ఇబ్బంది లేకుండా తమ ఆలోచనలు, అభిప్రాయాలను పంచుకునే వీలు కలిగింది.
ఇబ్బంది లేకుండా..
వాట్సాప్ స్టేటస్‌లో లాంగ్ వీడియోలను పోస్ట్ చేయడం గతంలో కుదిరేది కాదు. దీనివల్ల యూజర్లు కొంచెం ఇబ్బంది పడేవారు. పోస్ట్ చేసిన వీడియో సగమే అప్ డేట్ అయ్యేది. ఈ సమస్యను కూడా వాట్సాప్ యాజమాన్యం పరిష్కరించింది. 30 సెకన్ల కన్నా ఎక్కువ నిడివి ఉన్న వీడియోలను పోస్ట్ చేసుకునేలా కొత్త ఫీచర్ ను అప్ డేట్ చేసింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..