Jio Prepaid Plans: అన్‌లిమిటెడ్ ప్రయోజనాలతో నాన్‌స్టాప్ వినోదం.. జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్లు ఇవే..

స్మార్ట్ ఫోన్ పనిచేయడానికి డేటా చాలా అవసరం. వినియోగదారుల అవసరాన్ని బట్టి వివిధ రీచార్జి ప్యాక్ లను టెలికం కంపెనీలు అందిస్తున్నాయి. వీటిలో కాల్స్, డేటా, ఎస్ఎమ్ఎస్ తదితర సేవలు లభిస్తాయి. ఇప్పుడు వీటితో పాటు ఓటీటీ ప్లాట్ ఫారంలకు ఉచిత సబ్ స్క్రిప్షన్ లతో కూడా కొత్త ప్లాన్లు వస్తున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.

Jio Prepaid Plans: అన్‌లిమిటెడ్ ప్రయోజనాలతో నాన్‌స్టాప్ వినోదం.. జియో సరికొత్త రీచార్జ్ ప్లాన్లు ఇవే..
Jio
Follow us
Madhu

|

Updated on: Jun 06, 2024 | 5:47 PM

ఫోన్ అంటే గతంలో కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే ఉపయోగించేవారు. ఆ అవసరానికి తగ్గట్టుగానే రీచార్జి ప్లాన్లు ఉండేవి. కానీ నేడు టెక్నాలజీ బాగా పెరిగింది. స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. వాటితో ప్రజల అవసరాలు కూడా ఎక్కువయ్యాయి. చేతిలో స్మార్ట్ ఫోన్ల లేకపోతే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. కాల్స్, వాట్సాప్, ఫేస్ బుక్, మ్యూజిక్, సినిమాలు, యూట్యూబ్ ఇలా అనేక యాప్ లు అందుబాటులోకి వచ్చాయి.

జియో ప్రీపెయిడ్ ప్లాన్లు..

స్మార్ట్ ఫోన్ పనిచేయడానికి డేటా చాలా అవసరం. వినియోగదారుల అవసరాన్ని బట్టి వివిధ రీచార్జి ప్యాక్ లను టెలికం కంపెనీలు అందిస్తున్నాయి. వీటిలో కాల్స్, డేటా, ఎస్ఎమ్ఎస్ తదితర సేవలు లభిస్తాయి. ఇప్పుడు వీటితో పాటు ఓటీటీ ప్లాట్ ఫారంలకు ఉచిత సబ్ స్క్రిప్షన్ లతో కూడా కొత్త ప్లాన్లు వస్తున్నాయి. ముఖ్యంగా రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్లలో ఇవి అందుబాటులో ఉన్నాయి.

ప్లాన్ల వివరాలు..

రిలయన్స్ జియో తన వినియోగదారులకు ఏడు ప్రీపెయిడ్ ప్లాన్లను అందజేస్తోంది. వీటితో డిస్నీ+ హాట్‌స్టార్‌కు ఏడాది పాటు ఉచిత సభ్యత్వం లభిస్తుంది. మీరు అదనపు ఖర్చు లేకుండా టీ20 క్రికెట్ ప్రపంచ కప్‌ని చూడవచ్చు. రూ. 328 నుంచి రూ. 317 మధ్య అందుబాటులో ఉన్న ప్రీపెయిడ్ ప్లాన్ల గురించి తెలుసుకుందాం.

  • రూ. 328 ప్రీపెయిడ్ ప్లాన్.. రిలయన్స్ జియో అందజేస్తున్న రూ.328 ప్రీపెయిడ్ ప్లాన్ తో 28 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 1.5 జీబీడేటా లభిస్తుంది. సుమారు మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం లభిస్తుంది.
  • రూ.331 ప్లాన్.. ఈ ప్లాన్ వినియోగదారులకు చాలా ఉపయోగంగా ఉంటుంది. 30 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. 40 జీబీ డేటా లభిస్తుంది. మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ చందా లభిస్తుంది.
  • రూ. 388 ప్లాన్.. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు. కాల్స్ ఉచితంగా చేసుకోవచ్చు. వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటా అందజేస్తారు. పైవిధంగానే 3 నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ ను ఉచితంగా వీక్షించవచ్చు.
  • రూ.598 ప్లాన్.. ఈ ప్లాన్ లో ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం లభిస్తుంది. వినియోగదారులు 28 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకునే వీలుంది. అలాగే రోజుకు 2 జీబీ డేటా అందజేస్తారు.
  • రూ.758 ప్లాన్.. ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ వినియోగదారులకు మరింత ఉపయోగంగా ఉంటుంది. దాదాపు 84 రోజుల పాటు ఉచితంగా కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. ఇక డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం మూడు నెలల పాటు లభిస్తుంది.
  • రూ.808 ప్లాన్.. ఈ ప్లాన్ వ్యాలిడీటీ 84 రోజులు ఉంటుంది. ఆ సమయంలో ఉచితంగా కాల్స్ చేసుకునే వీలుంది. రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. వీటికి అదనంగా మూడు నెలల పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం అందజేస్తారు.
  • రూ.3,178 ప్లాన్.. ఈ ప్లాన్ ఏడాది పాటు చెల్లుబాటు అవుతుంది. అంటే ఏడాది పాటు కాల్స్ చేసుకోవచ్చు. వినియోగదారులకు రోజుకు 2 జీబీ డేటా అందజేస్తారు. ఏడాది పాటు డిస్నీ+ హాట్‌స్టార్ సభ్యత్వం అందుతుంది.

వినూత్న పరిష్కార మార్గాలు..

ఆధునిక కాలంలో ఫోన్ వినియోగం, ప్రాధాన్యత, అవసరం బాగా పెరిగిపోయింది. అయితే ప్రకృతి వైపరీత్యాల సమయంలో విద్యుత్ సరఫరాలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. అటువంటి పరిస్థితులలో నెట్‌వర్క్ దెబ్బతింటుంది. తద్వారా కమ్యూనికేషన్ నిలిచిపోతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డీవోటీ) చర్యలు తీసుకుంటోంది. అత్యవసర సమయాల్లో 5 జీ కనెక్టివిటీని నిర్వహించడానికి వినూత్న పరిష్కారాలను అన్వేషిస్తోంది. సాధారణ మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే వరకూ నిరంతర 5జీ కవరేజీని అందజేయడానికి బెలూన్లు, డ్రోన్‌లను వినియోగించే విధానాన్ని పరిశీలిస్తోంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..