Noise Fit: నాయిస్ నుంచి నయా స్మార్ట్ వాచ్ లాంచ్.. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లు

భారతీయ స్మార్ట్‌ వాచ్ తయారీ కంపెనీ నాయిస్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌వాచ్‌ని నాయిస్‌ఫిట్ ఆరిజిన్‌ను ఇటీవ విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ అనేక ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లతో పాటు మరెన్నో సూపర్ ఫీచర్‌లతో లోడ్ చేసి వస్తుంది. ముఖ్యంగా ఈ వాచ్ ఆరు రంగుల్లో లభిస్తుంది. నాయిస్ ఫిట్ ఆరిజిన్ వాచ్ వాచ్ ముఖ్యంగా యువతను కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఫీచర్ల విషయానికి వస్తే నాయిస్ ఫిట్ ఆరిజిన్ వాచ్ 466×466 రిజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్ నెస్‌తో 1.46 అంగుళాల ఎమోఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది.

Noise Fit: నాయిస్ నుంచి నయా స్మార్ట్ వాచ్ లాంచ్.. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లు
Noise Fit Origin
Follow us
Srinu

|

Updated on: Jun 06, 2024 | 5:45 PM

భారతీయ స్మార్ట్‌ వాచ్ తయారీ కంపెనీ నాయిస్ తన కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌వాచ్‌ని నాయిస్‌ఫిట్ ఆరిజిన్‌ను ఇటీవ విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ అనేక ఫిట్‌నెస్ ట్రాకింగ్ ఫీచర్‌లతో పాటు మరెన్నో సూపర్ ఫీచర్‌లతో లోడ్ చేసి వస్తుంది. ముఖ్యంగా ఈ వాచ్ ఆరు రంగుల్లో లభిస్తుంది. నాయిస్ ఫిట్ ఆరిజిన్ వాచ్ వాచ్ ముఖ్యంగా యువతను కచ్చితంగా ఆకట్టుకుంటుందని ఆ కంపెనీ ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఫీచర్ల విషయానికి వస్తే నాయిస్ ఫిట్ ఆరిజిన్ వాచ్ 466×466 రిజుల్యూషన్, 600 నిట్స్ బ్రైట్ నెస్‌తో 1.46 అంగుళాల ఎమోఎల్ఈడీ స్క్రీన్‌తో వస్తుంది. సాధారణ స్మార్ట్‌వాచ్‌ల మాదిరిగా కాకుండా వీటిలో చాలా వరకు ఒకే వన్ ఆల్వేస్-ఆన్ డిస్‌ప్లే మోడ్‌తో వస్తుంది. నాయిస్‌కు సంబంధించిన ఫిట్ ఆరిజిన్ స్మార్ట్ వాచ్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

నాయిస్ ఫిట్ ఆరిజిన్ స్మార్ట్ వాచ్ విడ్జెట్ స్క్రీన్ నుంచి వాతావరణ సూచనలు, ఫిట్‌నెస్ ట్రాకింగ్ వంటి ప్రాథమిక సమాచారాన్ని తనిఖీ చేయడంతో నాయిస్ యాప్ నుంచి మల్టీ నోటిఫికేషన్‌లను ఆటోమెటిక్‌గా సమూహపరచడానికి యూజర్లను అనుమతిస్తుంది. ముఖ్యంగా వాట్సాప్, లింక్‌డ్ ఇన్, ఇన్‌స్టా గ్రామ్, ఫేస్ బుక్ మెసెంజర్, స్కైప్, ఎక్స్, ఫేస్ బుక్, యూట్యూబ్, జీమెయిల్, అవుట్ లుక్, స్నాప్ చాట్, టెలిగ్రామ్ వంటి యాప్స్ నుంచి నోటిఫికేషన్లు పొందే అవకాశం ఉంది. నాయిస్ ఫిట్ ఆరిజన్ స్మార్ట్ వాచ్ ఈఎన్ 1 ప్రాసెసర్‌తో ఆధారంగా పని చేస్తుంది. ముఖ్యంగా ఈస్మార్ట్ వాచ్ప్రతి టచ్, ట్యాప్, కమాండ్‌కు వేగవంతమైన ప్రతిస్పందనలను అందిస్తుందని నాయిస్ ప్రతినిధులు చెబుతున్నారు. 

నాయిస్ ఫిట్ ఆరిజిన్ స్మార్ట్‌వాచ్‌ లీనియర్ వైబ్రేషన్ మోటారుతో రావడం వల్ల 3 ఏటీఎం వరకు నీటి నిరోధకతను అందిస్తుంది. అయితే ఈ వాచ్ స్విమ్మింగ్ కోసం తీసుకోలేరని కంపెనీ చెబుతోంది. స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారు చేసిన ఈ స్మార్ట్ వాచ్ ఫిజికల్ బటన్, యూజర్ ఇంటర్‌ఫేస్‌ను స్క్రోల్ చేయడానికి ఉపయోగించే క్రౌన్‌తో వస్తుంది. ఫిట్‌నెస్ వయస్సు, రిలాక్సేషన్ రిమైండర్‌లతో పాటు మన మూడ్‌ను బట్టి మార్చుకునే ప్రత్యేక ఫేస్‌లను ఈ వాచ్ ఆఫర్ చేస్తుందని నాయిస్ చెబుతోంది. ముఖ్యంగా మీ రిస్ట్‌ను కదిలించడం ద్వారా కాల్‌లను మ్యూట్ చేయడంతో పాటు రిమోట్‌గా ఫోటోలను క్యాప్చర్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఛార్జ్ చేయడానికి 2 గంటల వరకు పడుతుంది. అలాగే ఒక్కసారి ఛార్జ్ చేస్తే 7 రోజుల వరకు ఉంటుంది. ఈ వాచ్ 100 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లకు మద్దతు ఇస్తుంది. అలాగే 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌ల నుండి ఎంచుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. స్మార్ట్ వాచ్ హార్ట్ బీట్ రేట్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, స్ట్రెస్ ట్రాకింగ్, బ్లడ్ ఆక్సిజన్ లెవెల్ మానిటరింగ్‌తో పాటు ఫిమేల్ సైకిల్ ట్రాకర్ వంటి అనేక హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లతో వస్తుంది. ఈ వాచ్ ప్రస్తుతం నాయిస్ వెబ్‌సైట్‌తో పాటు క్రోమాలో రూ. 6,499కి అందుబాటులో ఉంది. అలాగే ఈ వాచ్ రేపటి నుంచి అమెజాన్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్ వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చని కంపెనీ ఇటీవల తెలిపింది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..