Airtel Prepaid: కొత్త ప్లాన్‌తో జియోకి ఎయిర్‌టెల్ సవాల్.. రెండింటిలో ఏది బెస్ట్ అంటే..
ప్రీపెయిడ్ తో పాటు పోస్ట్ పెయిడ్ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ తో ఎయిర్‌టెల్ ముందుకొచ్చింది. రూ. 395 చార్జీతో 56 రోజుల వ్యాలిడిటీతో ఈ కొత్త ప్లాన్ ఉంటుందని చెబుతున్నారు. ఇదే ధర వద్ద రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇది ఎయిర్‌టెల్ అందిస్తుందని చెబుతున్నారు.

మన దేశంలోని టాప్ టెలికాం నెట్ వర్క్ లలో ఎయిర్‌టెల్ ఒకటి. దీనికి ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. అధిక స్పీడ్, అంతరాయాలు లేని నెట్ వర్క్ ను ఎయిర్‌టెల్ అందిస్తుంది. దీంతో వినియోగదారుల నుంచి కూడా మంచి ఫీడ్ బ్యాక్ వస్తోంది. దీనిలో ప్రీపెయిడ్ తో పాటు పోస్ట్ పెయిడ్ ప్లాన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు మరో కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్ తో ఎయిర్‌టెల్ ముందుకొచ్చింది. రూ. 395 చార్జీతో 56 రోజుల వ్యాలిడిటీతో ఈ కొత్త ప్లాన్ ఉంటుందని చెబుతున్నారు. ఇదే ధర వద్ద రిలయన్స్ జియో ప్రీపెయిడ్ ప్లాన్ ఒకటి ఉంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇది ఎయిర్‌టెల్ అందిస్తుందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎయిర్‌టెల్ ప్లాన్ లోని ప్రయోజనాలు, రిలయన్స్ జియో కి దీనికి మధ్య తేడాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్ రూ.395 ప్లాన్..
ఈ ప్లాన్ లో ప్రయోజనాలు ఇలా ఉంటాయి..
- 56 రోజుల వ్యాలిడిటీ
- అపరిమిత వాయిస్ కాలింగ్
- 56 రోజులకు 600 ఎస్ఎంఎస్ ఒకవేళ అన్ని ఉచిత ఎస్ఎంఎస్ లను ఉపయోగించినట్లయితే, వినియోగదారులు స్థానిక ఎస్ఎంఎస్ కోసం రూ. 1, ఎస్టీడీ ఎస్ఎంఎస్ కోసం రూ. 1.5 వసూలు చేస్తారు.
- 6జీబీ డేటా
- అలాగే అపోలో 24|7 సర్కిల్, వింక్ మ్యూజిక్, ఉచిత హెలోట్యూన్‌లకు యాక్సెస్ ఇస్తుంది
ఎయిర్‌టెల్ వర్సెస్ జియో..
ఎయిర్‌టెల్ తీసుకొచ్చిన కొత్త ప్లాన్ ధరతోనే రిలయన్స్ జియోలో మరో ప్లాన్ ఉంది. అయితే ఎయిర్‌టెల్ 56 రోజుల వ్యాలిడిటీ ఇస్తుంటే.. జియో మాత్రం 84 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది. ఇంకా, Jio రోజుకు 100 ఎస్ఎంఎస్ లను ఇస్తోంది. అయితే ఎయిర్‌టెల్ మాత్రం మొత్తం కలిపి 600ఎస్ఎంఎస్ లు మాత్రమే అందిస్తోంది. ఈ క్రమంలో రెండింటినీ కంపేర్ చేస్తే ఎయిర్‌టెల్ ప్లాన్ కన్నా జియో ఎక్కువ కాలం వ్యాలిడిటీ, ఎస్ఎంఎస్ ల కారణంగా మెరుగైనదిగా కనిపిస్తోంది. అయినప్పటికీ, టెలికాం టాక్ నివేదించిన ప్రకారం, ఎయిర్‌టెల్ ప్లాన్ టెలికాం ల్యాండ్‌స్కేప్‌లో భవిష్యత్ టారిఫ్ సర్దుబాట్లను ప్రభావితం చేయడానికి ఒక వ్యూహాత్మక చర్య కావచ్చు.
మరిన్ని ప్లాన్లు..
వీఐ(Vi) ఇటీవల ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌తో కూడిన ప్రీపెయిడ్ ప్లాన్‌లతో ముందుకు వచ్చింది. నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో మూడు ప్లాన్‌లు ఉన్నాయి. దీని ధర రూ. 199.
అలాగే జియో దాని బడ్జెట్-ఫ్లెండ్లీ ప్లాన్‌లకు ప్రసిద్ధి చెందింది. ఇది వినియోగదారులకు అనేక రీఛార్జ్ ఎంపికలతో భరోసా ఇస్తుంది. వినియోగదారుల బడ్జెట్‌పై ఒత్తిడి లేకుండా వినియోగదారు అనేక అవసరాలను తీర్చుతుంది. కంపెనీ రీచార్జ్ పోర్ట్‌ఫోలియోలో స్వల్పకాలిక నుంచి దీర్ఘకాలిక ప్లాన్‌ల శ్రేణిని కలిగి ఉంటుంది, ఇది వినియోగదారులకు సౌలభ్యాన్ని అందిస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




