Vivo X Fold 3 Pro: వివో నుంచి మడతపెట్టే స్మార్ట్‌ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్స్‌, ధర ఎంతో తెలుసా?

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్నాయి. వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు మొబైల్‌ తయారీ కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌తో మొబైల్‌లను తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వివో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివో కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో (Vivo X Fold 3..

Vivo X Fold 3 Pro: వివో నుంచి మడతపెట్టే స్మార్ట్‌ ఫోన్‌.. అదిరిపోయే ఫీచర్స్‌, ధర ఎంతో తెలుసా?
Vivo
Follow us
Subhash Goud

|

Updated on: Jun 06, 2024 | 4:47 PM

ప్రస్తుతం మార్కెట్లో రకరకాల స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్నాయి. వినియోగదారులను మరింతగా ఆకట్టుకునేందుకు మొబైల్‌ తయారీ కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌తో మొబైల్‌లను తయారు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ వివో మరో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వివో కొత్త ఫోల్డబుల్‌ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో (Vivo X Fold 3 Pro)పేరుతో దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌, ట్రిపుల్‌ కెమెరా సెటప్‌, 8.03 అంగుళాల అమోలెడ్‌ తెర వంటి ఫీచర్లు ఉన్నాయి.

వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో ఫీచర్లు..

డ్యూయల్‌ నానో సిమ్‌తో వస్తోన్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14పై రన్‌ అవుతుంది. ఫన్‌టచ్‌ ఓఎస్ 14తో పనిచేస్తుంది. దీని సైజు 8.3అంగుళాలు. అయితే లోపలి డిస్‌ప్లే 2కే+ రెజల్యూషన్‌, డాల్బీ విజన్‌, హెచ్‌డీఆర్‌10 సపోర్ట్‌తో వస్తోంది. 120Hz రీఫ్రెష్‌ రేటు, 4,500 గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తున్నాయి.

వివో ఎక్స్‌ ఫోల్డ్‌ 3 ప్రో ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అది రోజుకు 100 సార్లు చొప్పున మడతబెట్టినా 12 ఏళ్ల పాటు సమర్థంగా పని చేస్తుందని కంపెనీ చెబుతోంది. ఫోన్‌ ముందుభాగాన్ని గ్లాస్‌తో, వెనక గ్లాస్‌ ఫైబర్‌తో తయారు చేసింది కంపెనీ. మధ్య భాగాన్ని అల్యూమినియం లోహపు పదార్థంతో రూపొందించారు. ఎఫ్‌/1.68 లెన్స్‌, ఓఐఎస్‌, 64MP టెలిఫొటో సెన్సర్‌, 50MP అల్ట్రావైడ్‌ సెన్సర్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా సెటప్‌ను అందించింది. ఇక సెల్ఫీల కోసం కవర్‌ స్క్రీన్‌పై ఎఫ్‌/2.4 అపెర్చర్‌తో కూడిన 32MP కెమెరాను అందించింది. ఇందులో అథెంటికేషన్‌ కోసం ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ను కూడా ఉంది. అలాగే 100W వైర్డ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5,700mAh బ్యాటరీని ఇచ్చారు.

ఈ ఫోన్‌ 16GB ర్యామ్‌ + 512GB స్టోరేజ్‌తో మాత్రమే వస్తోంది. ఇది సెలెస్టియల్‌ బ్లాక్‌ రంగులో లభిస్తోంది. దీని ధర గురించి మాట్లాడినట్లయితే.. రూ.1,60,000 వరకు ఉంటుందని తెలుస్తోంది. వివో ఇండియా, అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీబుకింగ్‌కు అందుబాటులో ఉంది. జూన్‌ 13 నుంచి సేల్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈఫోన్‌ విడుదల సందర్భంగా ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.15 వేల వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. అలాగే రూ.10,000 ఎక్స్ఛేంజ్‌ బోనస్‌, 24 నెలల పాటు నెలకు రూ.6,666తో నో-కాస్ట్‌ ఈఎంఐ వెసులుబాటు కూడా ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి