AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mobile Camera: ఇలాంటి చిన్న పొరపాట్లు చేస్తున్నారా? మీ ఫోన్‌ కెమెరా పాడైపోయినట్లే.. జాగ్రత్త!

Tech Tips: మొబైల్ కెమెరాలు వచ్చినప్పటి నుండి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ పనిలో ప్రొఫెషనల్ కెమెరాల స్థానంలో మొబైల్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ప్రొఫెషనల్ కెమెరాల కంటే మొబైల్స్ చౌకగా ఉండటంతో ప్రజలు మొబైల్ కెమెరాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది కాకుండా, ఫోన్‌ను కూడా..

Mobile Camera: ఇలాంటి చిన్న పొరపాట్లు చేస్తున్నారా? మీ ఫోన్‌ కెమెరా పాడైపోయినట్లే.. జాగ్రత్త!
Subhash Goud
|

Updated on: Jun 30, 2025 | 7:08 PM

Share

నేటి కాలంలో అన్ని మొబైల్ తయారీ కంపెనీలు ఫోన్ కెమెరాల నాణ్యతను పెంచేస్తున్నాయి. యువత కూడా మంచి కెమెరా కలిగిన స్మార్ట్‌ ఫోన్‌ల వైపు ఎక్కువగా చూస్తున్నారు. మొబైల్ కెమెరాలు వచ్చినప్పటి నుండి ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ పనిలో ప్రొఫెషనల్ కెమెరాల స్థానంలో మొబైల్ కెమెరాలు ఉపయోగిస్తున్నారు. ప్రొఫెషనల్ కెమెరాల కంటే మొబైల్స్ చౌకగా ఉండటంతో ప్రజలు మొబైల్ కెమెరాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది కాకుండా, ఫోన్‌ను కూడా సులభంగా ఉపయోగించవచ్చు.

అయితే మీకు ఇంతగా ఉపయోగపడే మొబైల్ కెమెరా మీరు తెలియక చేసే చిన్న పొరపాటు వల్ల ఫోన్ కెమెరా పాడైపోవడం లేదా శాశ్వతంగా పాడైపోయే ప్రమాదం ఉందని మీకు తెలుసా..? జాగ్రత్తలు తీసుకోకపోతే, ఫోన్ కెమెరాను శాశ్వతంగా పాడు చేసే అంశాల గురించి తెలుసుకుందాం.

బైక్‌ ఫోన్‌ స్టాండ్‌:

ఇవి కూడా చదవండి

ఫోన్ కెమెరాలు పాడవకుండా నిరోధించడానికి ఈ విషయాలను గుర్తుంచుకోండి: ప్రజలు లొకేషన్‌ను కనుగొనడానికి జీపీఎస్‌ని ఉపయోగించడం తరచుగా కనిపిస్తుంటుంది. ఇందుకోసం బైక్‌పై ఫోన్‌ను ఫిక్స్‌ చేస్తారు. అయితే దీని వల్ల ఫోన్ కెమెరా పాడవుతుందని వారికి తెలియదు. వాస్తవానికి, బైక్ లేదా స్కూటర్ కదిలినప్పుడు చాలా వైబ్రేషన్ వస్తుంటుంది. ఇది కెమెరాను ప్రభావితం చేస్తుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ కెమెరాను రక్షించడానికి ప్రత్యేక మౌంటు కిట్‌ని ఉపయోగించండి.

లేజర్‌ కిరణాలు కెమెరాకు ఎఫెక్ట్‌:

ఇది కాకుండా, కొంతమంది మంచి ఐపీ రేటింగ్ కారణంగా మొబైల్‌తో నీటిలోకి వెళతారు. కెమెరా లెన్స్‌లో నీరు చేరితే అది ఎప్పటికైనా పాడైపోతుంది. మీరు కచేరీకి లేదా లైవ్ షోకి వెళ్లినప్పుడల్లా లేజర్ కిరణాల సమయంలో ఫోటోలు క్లిక్ చేయకుండా ప్రత్యేక శ్రద్ధ వహించండి. లేజర్ కాంతి కారణంగా కెమెరా లెన్స్ దెబ్బతింటుంది.

సూర్యగ్రహణం:

అలాగే సూర్యగ్రహణం సమయంలో చాలా మంది ఫోన్ కెమెరాలతో ఫోటోలు తీస్తుంటారు. ఇది సరైనది కాదు. ఇది లెన్స్‌ను ప్రభావితం చేయవచ్చు. బలమైన సూర్యకాంతిలో కూడా ఫోన్ కెమెరాను ఉపయోగించడం మానుకోవాలని సూచిస్తున్నారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 8,262 ప్రత్యేక రైళ్లు!
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 8,262 ప్రత్యేక రైళ్లు!
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..
పుదీనా వీరికి విషంతో సమానం.. తినే ముందు ఈ విషయాలు తప్పక..
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
నీచు వాసన రాకుండా బోటి కూర మధ్యలో ఇవి వేస్తే చాలు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
800 ఫోర్లు కొట్టిన మొట్టమొదటి ప్లేయర్‌గా కోహ్లీ రికార్డు
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
ఉదయాన్నే కాఫీ, టీకి బదులు మజ్జిగ తాగి చూడండి.. మీకు తిరుగుండదు!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
నెటిజన్స్ కామెంట్స్ మాత్రం.. అబ్బో..!!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
బుమ్రా, సూర్యకుమార్‌లపై వేటు? హార్దిక్ పాండ్యా షాకింగ్ నిర్ణయం..!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
నీట్‌ యూజీ 2026 పరీక్ష రూల్స్ ఇవే.. ఈ తప్పులు చేస్తే మీకే నష్టం!
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
వెండి కొంటున్నారా? జాగ్రత్త! ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారట
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!
భార్యను తిట్టిన భర్త.. తననే దూషించారనుకొని పక్కింటి మహిళ దాడి!