AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lifestyle: భోజనం విషయంలో ఈ తప్పులు గుండెపోటుకు కారణం కావొచ్చు..

ముఖ్యంగా రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేసే వారిలో జీవ గడియారంపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మన జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది అలాగే గుండెపై ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా మనం పడుకునే ముందు ఆహారం తీసుకుంటే మన శరీరం ఆహారాన్ని...

Lifestyle: భోజనం విషయంలో ఈ తప్పులు గుండెపోటుకు కారణం కావొచ్చు..
Heart Attack
Narender Vaitla
|

Updated on: Feb 12, 2024 | 12:43 PM

Share

మారుతోన్న కాలంతో పాటు జీవన విధానం సైతం మారుతోంది. గబిజిబీ జీవితం కారణంగా తినడానికి కూడా సమయం లేని పరిస్థితి నెలకొంది. దీంతో సమయానికి తినే వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతుంది. ఆలస్యంగా భోజనం చేసే వారి సంఖ్య పెరుగుతోంది. సరైన సమయంలో భోజనం చేయకపోతే, తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయిని నిపుణులు చెబుతున్నారు. సరైన సమయంలో భోజనం చేయకపోతే గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేసే వారిలో జీవ గడియారంపై ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మన జీర్ణవ్యవస్థను ప్రభావితం చేస్తుంది అలాగే గుండెపై ఒత్తిడిని కూడా కలిగిస్తుంది. ముఖ్యంగా మనం పడుకునే ముందు ఆహారం తీసుకుంటే మన శరీరం ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేక పోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ పరిస్థితి మన గుండెపై చెడు ప్రభావం చూపుతుంది.

అందుకే రాత్రి పూట ఆలస్యంగా భోజనం చేయకూదని చెబుతున్నారు. పడుకోవడానికి కనీసం మూడు గంటల ముందే భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. దీని వల్ల మన శరీరం ఆహారం బాగా జీర్ణం కావడమే కాకుండా మన గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే, మన ఆహారంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని చేర్చుకోవడం చాలా ముఖ్యం. తాజా పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు లీన్ ప్రోటీన్లు వంటి ఆరోగ్యకరమైన ఫుడ్‌ ఉండేలా చూసుకోవాలి.

గుండెపోటు మాత్రమే కాకుండా రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం వల్ల మరిన్ని దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల ఎక్కువ కేలరీలు చేరుతాయి. దీంతో ఇది ఖర్చు చేయడానికి సమయం పడుతుంది. ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. ఆలస్యంగా తినడం వల్ల చక్కెర స్థాయిలు అసమతుల్యతకు దారితీస్తాయి, ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.

రాత్రిపూట భారీ ఆహారాన్ని తీసుకోవడం వల్ల నిద్రకు ఇబ్బంది కలుగుతుంది, ఇది నిద్రలేమికి దారితీస్తుంది. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల ఎసిడిటీ, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ డిసీజ్ వంటి జీర్ణ సమస్యలు వస్తాయి. క్రమరహిత ఆహారపు అలవాట్ల కారణంగా మెటబాలిక్ సిండ్రోమ్‌కు కారణమవుతాయి. ఇందులో అధిక రక్తపోటు, అధిక చక్కెర స్థాయిలు, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు, అదనపు శరీర కొవ్వు పేరుకుపోతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..