- Telugu News Photo Gallery Technology photos Poco offering huge discount on Poco X6 Pro smartphone, check here for full details
Poco X6 Pro: కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదండోయ్..
కొత్త ఫోన్ కొనే ప్లాన్‌లో ఉన్నారా.? మీకోసమే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో అదిరిపోయే ఆఫర్‌ను అందించింది. పోకో ఎక్స్6 ప్రో స్మార్ట్ ఫోన్‌ను భారీ డిస్కౌంట్ లభిస్తోంది. కంపెనీ అందిస్తోన్న ఈ ఆఫర్‌తో పోకో ఎక్స్6 ప్రో స్మార్ట్ ఫోన్‌ను రూ. 25వేలోపే సొంతం చేసుకోవచ్చు. ఇంతకీ స్మార్ట్ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Feb 12, 2024 | 10:31 AM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం పోకో తన స్మార్ట్ ఫోన్ పోకో ఎక్స్6 ప్రోపై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభ వేరియంట్ ధర లాంచింగ్ సమయంలో రూ. 26,999గా ఉంది. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ స్మార్ట్ ఫోన్‌పై రూ. 4 వేలు డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ను రూ. 22,999కే సొంతం చేసుకోవచ్చు.

ఆఫర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ను యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లేదా ఎస్‌బీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే.. రూ. 2వేలు ఇన్‌స్టాంట్ డిస్కౌంట్ పొందొచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్ ప్రారంభవేరియంట్‌ను రూ. 24,999కి పొందొచ్చు.

వీటితో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో కూడా ఈ ఫోన్‌పై డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత ఫోన్‌ను ఇచ్చి డిస్కౌంట్ పెందొచ్చు. అలాగే ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే సమయంలో రూ. 699 వద్ద 12-నెలల స్పాటిఫై ప్రీమియం సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు.

ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో తీసుకొచ్చారు. ఈ స్మార్ట్ ఫోన్ డైమెన్సిటీ డీ8300 అల్ట్రా ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ఇక ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా విషయానికొస్తే ఇందులో 64 మెగాపిక్సెల్స్, 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు. 5000 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.




