- Telugu News Photo Gallery Technology photos Samsung offering discount on Samsung galaxy s23 smart phone check here for full details
Galaxy S23: సామ్‌సంగ్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ. 50 వేలలోపే సొంతం చేసుకునే ఛాన్స్
కంపెనీలు స్మార్ట్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటిస్తున్నాయి. అంతకు ముందు లాంచ్ చేసిన ఫోన్‌లపై ప్రస్తుతం ఆఫర్స్‌ను అందిస్తూ కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ సైతం తన స్మార్ట్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తోంది. సామ్‌సంగ్ గ్యాలక్సీ ఎస్23 ఫోన్‌పై అందిస్తోన్న డిస్కౌంట్‌కు సంబంధంచిన వివరాలు ఇప్పుడు చూద్దాం..
Updated on: Feb 13, 2024 | 8:56 AM

ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్‌సంగ్ గతేడాది అక్టోబర్‌లో గ్యాలక్సీ ఎస్23ఎఫ్‌ఈ పేరుతో ఓ ఫోన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. లాంచింగ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ. 64,990గా ఉంది. అయితే తాజాగా ఈ ఫోన్‌పై కంపెనీ భారీ ఢిస్కౌంట్‌ను ప్రకటించింది.

ఈ ఫోన్‌కు సంబంధించి 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8 జీబీ ర్యామ్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై రూ. 5 వేల డిస్కౌంట్‌ను కంపెనీ అందిస్తోంది. డిస్కౌంట్ తర్వాత 128 జీబీ వేరియంట్‌ను రూ. 54,990 కాగా 256 జీబీ వేరియంట్‌ను రూ. 64,990కి సొంతం చేసుకోవచ్చు.

ఇదిలా ఉంటే డిస్కౌంట్ ఆఫర్ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ స్మార్ట్ ఫోన్‌ను హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే అదనం రూ. 10 వేల వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో 128 జీబీ వేరియంట్‌ను రూ. 50 వేలలోపే సొంతం చేసుకోవచ్చు.

ఇక సామ్‌సంగ్ గ్యాలక్జీ ఎస్23ఎఫ్‌ఈ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.4 ఇంచెస్‌తో కూడిన డైనమిట్ అమోఎల్‌ఈడీ 2ఎక్స్ డిస్‌ప్లేను ఇచ్చారు. 120 హెచ్‌జెడ్ రిఫ్రెస్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. అవుట్ డోర్ విజిబులిటీ కోసం ఇందలో ప్రత్యేకంగా విజన్ బూస్టర్ టెక్నాలజీని అందించారు.

ఇక ఈ స్మార్ట్ ఫోన్లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీని అందించారు.




