- Telugu News Photo Gallery Technology photos Average indian smartphone user check 70 to 80 times per day, Says reports
Smart phone: రోజుకు 80 సార్లు ఫోన్ చెక్ చేస్తున్నారంటా… సర్వేలో ఆసక్తికర విషయాలు..
స్మార్ట్ ఫోన్... మనిషి జీవితంలో ఒక భాగమైపోయింది. ఉదయం లేచింది మొదలు, రాత్రి పడుకునే వరకు ఫోన్‌లేనిది రోజు గడవలేని పరిస్థితి వచ్చింది. అవసరం ఉన్నా లేకపోయినా ఫోన్ పట్టుకొని కూర్చుంటున్నారు. తాజాగా గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టింగ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి...
Updated on: Feb 13, 2024 | 11:48 AM

దాదాపు 50 శాతం మంది అసలు తాము ఎందుకు ఎందుకు ఫోన్ తీస్తున్నామో కూడా తెలియకుండానే చేతుల్లోకి తీసుకుంటున్నట్లు ఈ అధ్యయనంలో వెల్లడైంది. గ్లోబల్ మేనేజ్‌మెంట్ కన్సల్టింట్ ఫర్మ్ అయిన బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ ఈ వివరాలను వెల్లడించింది.

ఈ నివేదిక ప్రకారం సగటున ఒక స్మార్ట్ ఫోన్ యూజర్ రోజులో 70 నుంచి 80 సార్లు స్మార్ట్ ఫోన్‌ను చేతుల్లోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. 50 శాతం మంది అసలు ఫోన్‌ను ఎందుకు ఓపెన్ చేస్తున్నారో కూడా తెలియకుండాచే చేస్తున్నారంటా.

భారతదేశంలోని సుమారు 1000 మంది స్మార్ట్ ఫోన్ యూజర్లను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఈ వివరాలను వెల్లడించారు. ఇక మిగతా 45 నుంచి 50 శాతం మంది మాత్రం తాము ఫోన్‌ను ఎందుకు ఉపయోగిస్తున్నామన్న దానిపై స్పష్టతతో ఉన్నారు.

ప్రస్తుతం టెక్నాలజీలో వస్తున్న మార్పుల కారణంగా స్మార్ట్ ఫోన్‌లో ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ వినియోం పెరిగిందని, ఈ కారణంగా యూజర్లు ఫోన్‌తో గడిపే సమయం మరింత పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇక భారత్‌కు చెందిన స్మార్ట్ ఫోన్ యూజర్లలో 50 నుంచి 55 శాతం మంది యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా వీడియో స్ట్రీమింగ్, షాపింగ్, ట్రావెల్, జాబ్స్‌కు సంబంధించిన యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది





























