Smart Watch Payments: స్మార్ట్‌వాచ్ ద్వారా సూపర్ స్మార్ట్ పేమెంట్స్.. బోట్ వాచ్‌లో అందుబాటులోకి నయా ఫీచర్

భారతదేశంలో యూపీఐ చెల్లింపులు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిల్లర సమస్యకు డిజిటల్ చెల్లింపులు చెక్ పెట్టాయి. సాధారణంగా స్మార్ట్ పేమెంట్స్ అన్నీ స్మార్ట్ ఫోన్స్ ద్వారా చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ యాక్ససరీస్ వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో స్మార్ట్ యాక్ససరీస్ అంటే ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌ల ద్వారా చెల్లింపులు చేసేలా కొన్ని ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి.

Smart Watch Payments: స్మార్ట్‌వాచ్ ద్వారా సూపర్ స్మార్ట్ పేమెంట్స్.. బోట్ వాచ్‌లో అందుబాటులోకి నయా ఫీచర్
Smart Watches
Follow us

|

Updated on: Sep 01, 2024 | 6:24 PM

భారతదేశంలో యూపీఐ చెల్లింపులు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా చిల్లర సమస్యకు డిజిటల్ చెల్లింపులు చెక్ పెట్టాయి. సాధారణంగా స్మార్ట్ పేమెంట్స్ అన్నీ స్మార్ట్ ఫోన్స్ ద్వారా చేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ యాక్ససరీస్ వినియోగం కూడా పెరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో స్మార్ట్ యాక్ససరీస్ అంటే ముఖ్యంగా స్మార్ట్ వాచ్‌ల ద్వారా చెల్లింపులు చేసేలా కొన్ని ఫీచర్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. భారతదేశంలోని ప్రముఖ స్మార్ట్ వాచ్ బ్రాండ్‌ అయిన బోట్ స్మార్ట్‌వాచ్‌లలో నేరుగా ట్యాప్-అండ్-పే ఫంక్షనాలిటీని పరిచయం చేయడానికి మాస్టర్ కార్డ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో బోట్ స్మార్ట్ వాచ్‌ల ద్వారా పేమెంట్‌కు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బోట్ స్మార్ట్ వాచ్ వినియోగదారులు ఇప్పుడు బోట్ అధికారిక యాప్ అయిన క్రెస్ట్ పే ద్వారా కాంటాక్ట్‌లెస్ చెల్లింపుల కోసం వారి స్మార్ట్‌వాచ్‌లను ఉపయోగించవచ్చు. ఈ యాప్ వినియోగదారులు తమ ప్రస్తుత మాస్టర్ కార్డ్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లను మద్దతు ఉన్న బ్యాంకుల నుంచి లింక్ చేయడానికి అనుమతిస్తుంది. సెటప్ చేసిన తర్వాత, రూ. 5,000 వరకు చెల్లింపులు చేయడానికి పాయింట్ ఆఫ్ సేల్ (పీఓఎస్) మెషీన్ వద్ద స్మార్ట్‌వాచ్‌తో ట్యాప్ చేస్తే సరిపోతుంది. చెల్లింపులు చేయడానికి ఎలాంటి పిన్ అవసరం లేదు. ఇది రోజువారీ కొనుగోళ్లను వేగవంతంగా, సౌకర్యవంతంగా చేస్తుంది. అయితే మాస్టర్ కార్డు అధునాతన టోకనైజేషన్ సాంకేతికత ద్వారా ప్రతి లావాదేవీ సురక్షితంగా ఉండేలా చేస్తుంది. ప్రారంభంలో ఈ ఫీచర్ ఎంపిక చేసిన ప్రముఖ బ్యాంకుల నుంచి మాస్టర్ కార్డ్ వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది, త్వరలో మరిన్ని బ్యాంకులకు విస్తరించే యోచనలో ఉంది.

2023లోనే భారతదేశంలో స్మార్ట్ యాక్ససరీస్ మార్కెట్ 34 శాతం పెరిగింది. స్మార్ట్‌వాచ్ షిప్‌మెంట్‌లు 73.7 శాతం పెరిగాయి-దీని ఫలితంగా దాదాపు 54 మిలియన్ పరికరాలు వినియోగదారుల చేతుల్లోకి వచ్చాయి. బోట్, మాస్టర్ కార్డ్ భాగస్వామ్యం ద్వారా అత్యాధునిక సాంకేతికతను యూజర్ ఫ్రెండ్లీ పరిష్కారాలతో కలపడం ద్వారా వారు చెల్లింపులను మరింత వేగవంతమవుతాయని ఇరు కంపెనీల ప్రతినిధులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.