Moto Smart Phones: మరో రెండు నయా ఫోన్స్ లాంచ్ చేసిన మోటో .. ఫీచర్స్ తెలిస్తే మతిపోతుందంతే..!

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ప్రపంచ దేశాలతో పోటీపడుతుంది. జనాభాకు అనుగుణంగా ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి అందుబాటులో ఉండేలా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు సరికొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా రెండు కొత్త మిడ్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్‌లను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది.

Moto Smart Phones: మరో రెండు నయా ఫోన్స్ లాంచ్ చేసిన మోటో .. ఫీచర్స్ తెలిస్తే మతిపోతుందంతే..!
Moto Phones
Follow us

|

Updated on: Sep 01, 2024 | 6:45 PM

భారతదేశంలో ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ప్రపంచ దేశాలతో పోటీపడుతుంది. జనాభాకు అనుగుణంగా ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కువ మంది మధ్యతరగతి ప్రజలు ఉంటున్నారు. ఈ నేపథ్యంలో వారికి అందుబాటులో ఉండేలా స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు సరికొత్త స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మోటోరోలా రెండు కొత్త మిడ్ సెగ్మెంట్ స్మార్ట్‌ఫోన్‌లను యూరోపియన్ మార్కెట్లో విడుదల చేసింది. త్వరలోనే ఈ రెండు ఫోన్లు భారతమార్కెట్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది. మోటో జీ55, మోటో జీ35 పేరుతో లాంచ్ చేసిన ఈ రెండు ఫోన్లు కేవలం రూ.19,000 నుంచి రూ.24,000 ధర మధ్య అందుబాటులో ఉండనున్నాయి. అయితే ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు చాలావరకు ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి, అయితే మోటో జీ 55 కొన్ని స్పెక్స్ కొంచెం మెరుగ్గా ఉన్నాయి. అందుకే మోటో జీ 55 ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో మోటో నయా ఫీచర్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం. 

మోటో జీ 55 యూరోపియన్ మార్కెట్‌లో 249 యూరోల ప్రారంభ ధరతో ప్రారంభించారు. అంటే మన కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 24,000గా ఉంది. మోటో జీ 35 ధర 199 యూరోలు అంటే దాదాపు రూ. 18,500. రెండు ఫోన్‌లు ఒకే వేరియంట్‌లలో విడుదలయ్యాయి. మోటో జీ 55లో ఫారెస్ట్ గ్రే, స్మోకీ గ్రీన్, ట్విలైట్ పర్పుల్ అనే మూడు కలర్ ఆప్షన్‌లు ఉన్నాయి. మోటో జీ 35 లీఫ్ గ్రీన్, జామ రెడ్, మిడ్‌నైట్ బ్లాక్, సేజ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. మోజీ జీ 55 1080 x 2400 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.49 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే, 120 హెచ్ రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. పైగా ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్‌తో వస్తుంది. మోటో జీ 35 120 హెచ్‌జెడ్ వరకు రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. మోటో జీ 55 మీడియా టెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్‌తో 8 జీబీ + 256 జీబీ వేరియంట్‌లో అందుబాటులో ఉంటుంది. మోటో జీ 35 యూనిసాక్ టీ 760 చిప్‌సెట్‌తో వస్తుంది. 

మోటో జీ 55, మోటో జీ 35 రెండు ఫోన్లు  వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అలాగే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉన్నాయి. అలాగే ఈ రెండు ఫోన్‌లు 5,000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తాయి. అయితే మోటో జీ 55 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంటే మోటో జీ 35 మాత్రం 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
'మోహన్‌లాల్ పిరికివాడు' అంటూ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్.!
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
భలే.. భలే.. పైసలు లేకుండా ఫ్రీగా బోలెడు చేపలు
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
చడీచప్పుడు కాకుండా బాంబ్‌ పేల్చిన సమంత.. టాలీవుడ్‌లో పెద్ద చర్చ.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.