Cyber Security: సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారా? సైబర్ నేరగాళ్లకు చిక్కినట్లే.. తస్మాత్ జాగ్రత్త..

ఇది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసం. మనందరం సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంటాం. కొంతమంది వారి ఎక్కడకు వెళ్లినా, ఏం చేసినా దానిని ఫొటోలు, వీడియోల రూపంలో షేర్ చేస్తూనే ఉంటారు. అలాంటి వారిని నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఆ ఫోటోల ద్వారా వారి వేలి ముద్రలను క్లోన్ చేస్తున్నట్లు లేటెస్ట్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

Cyber Security: సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారా? సైబర్ నేరగాళ్లకు చిక్కినట్లే.. తస్మాత్ జాగ్రత్త..
Cyber Crime
Follow us

|

Updated on: Sep 01, 2024 | 2:58 PM

ప్రస్తుత సమాజంలో సైబర్ సెక్యూరిటీ అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నా.. నేరగాళ్లు ఏదోక రకంగా ఖాతాలను కొల్లగొడుతూనే ఉంటున్నారు. ప్రస్తుతం మరో కొత్త రకం మోసం వెలుగు చూసింది. ఇది సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న మోసం. మనందరం సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంటాం. కొంతమంది వారి ఎక్కడకు వెళ్లినా, ఏం చేసినా దానిని ఫొటోలు, వీడియోల రూపంలో షేర్ చేస్తూనే ఉంటారు. అలాంటి వారిని నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ఆ ఫోటోల ద్వారా వారి వేలి ముద్రలను క్లోన్ చేస్తున్నట్లు లేటెస్ట్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆ వేలి ముద్రల సాయంతో ఆధార్ ఆధారిత లావాదేవీలు(అంటే ఏఈపీఎస్-ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా లావాదేవీలు) చేసేసి ఖాతాలు కొల్లగొట్టేస్తున్నారు. ఆ తరహా ఘటనలు ఇప్పుడు నెటిజనుల ఆందోళనను తార స్థాయికి తీసుకెళ్తున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

ఎక్కడంటే..

నోయిడాలో ఇటువంటి పదికి పైగా కేసులు నమోదయ్యాయని అక్కడి పోలీసులు పేర్కొన్నారు. పలు నివేదికల ప్రకారం ఇక్కడ నేరస్తులు వ్యక్తుల సోషల్ మీడియా ఫొటోల నుంచి వ్యక్తుల వేలిముద్రలను క్లోన్ చేసి వాటిని దుర్వినియోగం చేశారని పోలీసులు చెబుతున్నారు. దీంతో ఆన్‌లైన్‌లో ఫోటోలను పోస్ట్ చేసేటప్పుడు ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వేలిముద్రల వంటి సున్నితమైన సమాచారాన్ని ప్రదర్శించే చిత్రాలను భాగస్వామ్యం చేయకుండా ఉండటం చాలా ముఖ్యం. అదనంగా, సోషల్ మీడియా ఖాతాలలో గోప్యతా సెట్టింగ్‌లను మెరుగుపరచాలని, భద్రతను పెంచడానికి టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ ఉపయోగించాలని సిఫార్సు చేస్తున్నారు.

బయోమెట్రిక్‌లను భద్రపరచడం అవసరం..

ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) బ్యాంకింగ్ లావాదేవీలు మీ ఆధార్ నంబర్‌లు, బయోమెట్రిక్ డేటా ఆధారంగానే సాగుతాయి. ఇక్కడ వేలిముద్రల భద్రత కీలకమైన అంశం. అందుకే మోసాన్ని నిరోధించడానికి వేలిముద్ర సమాచారాన్ని భద్రపరచాల్సిన ప్రాముఖ్యతను సైబర్ సెక్యూరిటీ నిపుణులు నొక్కి చెబుతున్నారు. చాలా మంది వ్యక్తులు సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలను పంచుకుంటారని, అలా చేయడం వల్ల వారు ఎక్కువగా సైబర్ క్రైమ్‌కు గురవుతారని పేర్కొంటున్నారు.

ఈ చిట్కాలు పాటిస్తే సరి..

సోషల్ మీడియాతో జాగ్రత్త.. మీ వేలిముద్రలు, ముఖ గుర్తింపు డేటా లేదా ఇతర బయోమెట్రిక్ వివరాలను బహిర్గతం చేసే ఫొటోలు లేదా సమాచారాన్ని పోస్ట్ చేయడం మానుకోండి.

ప్రైవసీ సెట్టింగ్స్.. సోషల్ మీడియా , బ్యాంకింగ్ యాప్‌లతో సహా మీ అన్ని ఆన్‌లైన్ ఖాతాలలో గోప్యతా(ప్రైవసీ) సెట్టింగ్‌లను బలోపేతం చేయండి. భద్రతకు అదనపు పొరను జోడించడానికి టూ ఫ్యాక్టర్ అథంటికేషన్ ను అమలు చేయండి.

ప్లాట్ ఫారం జాగ్రత్త.. అనధికార యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లలో బయోమెట్రిక్ డేటాను నమోదు చేయకుండా ఉండండి. సున్నితమైన సమాచారాన్ని భాగస్వామ్యం చేయడానికి విశ్వసనీయ, అధికారిక ప్లాట్‌ఫారమ్‌లను మాత్రమే ఉపయోగించండి.

సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌.. మీ మొబైల్ ఫోన్, ఇతర పరికరాలలో ఆపరేటింగ్ సిస్టమ్, సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను క్రమం తప్పకుండా నవీకరించండి. ఇది మీరు తాజా భద్రతా మెరుగుదలల నుంచి ప్రయోజనం పొందేలా చేస్తుంది.

బయోమెట్రిక్ లాగ్‌లు.. మీ లావాదేవీల లాగ్‌లను క్రమం తప్పకుండా సమీక్షించండి, ప్రత్యేకించి మీ బయోమెట్రిక్‌లు బ్యాంకింగ్ లేదా ఇతర క్లిష్టమైన సేవల కోసం ఉపయోగించినట్లయితే ఇది చాలా అవసరం. ఎందుకంటే మీ సమాచారం ఎవరైనా అనధికారిక వినియోగిస్తే తెలుసుకునే వీలుంటుంది. అలాగే అవసరమైన సేవలకు మాత్రమే బయోమెట్రిక్ డేటాను ఉపయోగించండి.

వెంటనే నివేదించండి.. మీ బయోమెట్రిక్ సమాచారం దుర్వినియోగం అవుతోందని మీరు అనుమానించినట్లయితే, వెంటనే సంబంధిత అధికారులకు లేదా సైబర్ క్రైమ్ విభాగానికి సమస్యను నివేదించండి.

బయోమెట్రిక్‌లను ఎలా తనిఖీ చేయాలి?

  • లావాదేవీ స్టేట్‌మెంట్‌లను సమీక్షించండి.. మీ బయోమెట్రిక్ డేటా ఏదైనా ఆర్థిక సేవలకు లింక్ చేయబడి ఉంటే మీ బ్యాంక్ స్టేట్‌మెంట్‌లను క్రమం తప్పకుండా పరిశీలించండి. ఏదైనా అనుమానాస్పద లావాదేవీలు జరిగితే వెంటనే మీ బ్యాంక్‌కి రిపోర్ట్ చేయండి.
  • బయోమెట్రిక్ లాగ్‌ల పర్యవేక్షణ.. మీ బయోమెట్రిక్ డేటా ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించబడిందో చూపించే లాగ్‌లకు కొన్ని సేవలు యాక్సెస్‌ను అందిస్తాయి. ఏదైనా అసాధారణ కార్యాచరణను గుర్తించడానికి ఈ లాగ్‌లను తరచుగా తనిఖీ చేయండి.
  • సైబర్ భద్రతా సాధనాలు.. మీ పరికరాల్లో సైబర్ భద్రతా సాధనాలను ఇన్‌స్టాల్ చేయండి. క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయండి. ఈ సాధనాలు మీ బయోమెట్రిక్ సమాచారాన్ని రక్షించడంలో సహాయపడతాయి. సంభావ్య ముప్పుల గురించి మిమ్మల్ని హెచ్చరిస్తాయి.
  • ఆధార్ ధ్రువీకరణ.. మీ ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ డేటాతో లింక్ చేసి ఉంటే, ఆధార్ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా మీ బయోమెట్రిక్‌ల వినియోగాన్ని క్రమానుగతంగా తనిఖీ చేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త..
సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తున్నారా? తస్మాత్ జాగ్రత్త..
డాడీ సినిమాలో చిరంజీవి కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడేలా ఉందంటే
డాడీ సినిమాలో చిరంజీవి కూతురిగా నటించిన చిన్నారి ఇప్పుడేలా ఉందంటే
భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు
భారీ వర్షాలపై హోం మంత్రి సమీక్ష.. అధికారులకు కీలక సూచనలు
వర్షాలు, వరదలపై హోం మంత్రి అనిత సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
వర్షాలు, వరదలపై హోం మంత్రి అనిత సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు
స్మార్ట్ ఫోన్ నీటిలో పడిపోయిందా? యూట్యూబ్‌లో ఈ వీడియో ప్లే చేయండి
స్మార్ట్ ఫోన్ నీటిలో పడిపోయిందా? యూట్యూబ్‌లో ఈ వీడియో ప్లే చేయండి
ఏపీలో మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఏపీలో మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
50 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
50 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Test Records: క్యాచ్‌లతో ప్రపంచ రికార్డ్ లిఖించిన స్టార్ ప్లేయర్
Test Records: క్యాచ్‌లతో ప్రపంచ రికార్డ్ లిఖించిన స్టార్ ప్లేయర్
ప్రముఖ నటి అభినయ ఇంట తీవ్ర విషాదం..రిక్షాలో వెళుతూ తల్లి కన్నుమూత
ప్రముఖ నటి అభినయ ఇంట తీవ్ర విషాదం..రిక్షాలో వెళుతూ తల్లి కన్నుమూత
కడప విద్యార్థిని సత్తా.. రూ.1.70 కోట్ల వార్షిక వేతనంతో కొలువు
కడప విద్యార్థిని సత్తా.. రూ.1.70 కోట్ల వార్షిక వేతనంతో కొలువు
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్