Tech Tips: స్మార్ట్ ఫోన్ నీటిలో పడిపోయిందా? మరేం పర్లేదు.. యూ ట్యూబ్‌లో ఈ వీడియో ప్లే చేయండి చాలు..

ప్రస్తుతం వర్షాలు దంచికొడుతున్నాయి. తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేసేస్తున్నాయి. ఈ సమయంలో మన స్మార్ట్ ఫోన్ తడవకుండా కాపాడుకోవడం కష్టం. అందుకే వాటిని కవర్లలో చుట్టడం, లేకపోతే బయటకు తీసుకురాకుండా ఉండటం చేస్తుంటారు. అయితే మీ స్మార్ట్ ఫోన్ తడిసినా.. కేవలం ఇక యూ ట్యూబ్ వీడియో సాయంతో దానిని బాగు చేసేస్తారంట? ఇది నిజమేనా? ఇప్పటికే ఆ వీడియో కొన్ని మిలియన్ల వ్యూస్ సాధించడంతో అంతటా దీనిపై ఆసక్తి నెలకొంది.

Tech Tips: స్మార్ట్ ఫోన్ నీటిలో పడిపోయిందా? మరేం పర్లేదు.. యూ ట్యూబ్‌లో ఈ వీడియో ప్లే చేయండి చాలు..
Water Damaged Smartphone
Follow us

|

Updated on: Sep 01, 2024 | 2:39 PM

స్మార్ట్ ఫోన్ నీటిలో పడిపోతే? ఇంకేముంది అంతే సంగతులు. అది పనిచేయడం, చేయకపోవడం దైవాధీనమే? అందుకే వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఇక ఐఫోన్ లాంటి కాస్ట్లీ ఫోన్లు అయితే మరింత జాగ్రత్త వహిస్తాం. అయినప్పటికీ ఏదో ఒక సందర్భంలో ఫోన్లు నీటిలో పడిపోవడం, లేక వర్షానికి తడిసిపోవడం జరుగుతుంటుంది. అయితే ఈ ఇబ్బందిని కేవలం ఒక వీడియోతో సరి చేస్తామని చెబుతోంది యూ ట్యూబ్. ఐఫోన్ నీటిలో తడిసిపోయినా ఫర్వాలేదని, తమ వీడియతో ఫోన్లో ప్లే చేయడం ద్వారా లోపల చేరిన నీటిని బయటకు తీసేస్తామని కచ్చితంగా ఆ వీడియో యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వారు చెబుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం..

వీడియో ఇలా..

సౌండ్ టు రిమూవ్ వాటర్ ఫ్రమ్ ఫోన్ స్పీకర్ (గ్యారంటీడ్) పేరుతో యూ ట్యూబ్ లో ఉన్న వీడియో, వాటర్‌లో తడిసిన స్మార్ట్‌ఫోన్ స్పీకర్‌ల నుంచి నీటిని వైబ్రేట్ చేయడానికి ఉద్దేశించిన తక్కువ-ఫ్రీక్వెన్సీ సౌండ్‌లను ప్లే చేస్తుంది. ది వెర్జ్ డేవిడ్ పియర్స్, ఐఫిక్సిట్ మరమ్మతు నిపుణులు నిర్వహించిన ఒక ప్రయోగం కూడా దీని ప్రభావాన్ని నిర్ధారిస్తుంది. నాలుగు సంవత్సరాల క్రితం అప్‌లోడ్ చేసిన వీడియో ఇప్పటివరకు 45 మిలియన్లకు పైగా వీక్షణలను సంపాదించింది. ఈ పద్ధతి అత్యంత ప్రజాదరణ పొందింది. కానీ ఇది నిజంగా పని చేస్తుందా? తెలుసుకుందాం..

సౌండ్‌ని ఉపయోగించి ఐఫోన్ నుంచి నీటిని బయటకు తీయగలమని పలు యూ ట్యూబ్ వీడియోలలో చేసిన వాదనలు డేవిడ్ పియర్స్‌ను ఆశ్చర్యపరిచాయి. దీంతో ఆయన దీనిని పరీక్షించడానికి ఐఫిక్సిట్ తో కలిసి పని చేశారు. ప్రయోగానికి ఐఫోన్ 13ని యూవీ డై-ట్రీట్ చేసిన నీటిలో ముంచి, ఆపై ఈ ప్రత్యేకమైన వీడియోలలో ఒకదాన్నిప్లే చేయాలని నిర్ణయించారు. అలా ప్లే చేయగా అది ఆశ్చర్యకరమైన ఫలితాలను అందించాయి. వీడియో ద్వారా ఉత్పన్నమయ్యే ధ్వని తరంగాలు ఐఫోన్ సహా పరీక్షలో ఉంచిన నోకియా, గూగుల్‌తో సహా అనేక స్మార్ట్‌ఫోన్‌ల స్పీకర్‌ల నుంచి నీటిని బయటకు పంపించినట్లు గుర్తించారు. ఆ వీడియో మొదట్లోనే పెద్ద శబ్ధం కారణంగా నీరు బయటకు వచ్చేసింది. అయితే, ఈ పద్ధతి కేవలం స్పీకర్ గ్రిల్ నుంచి మాత్రమే నీటిని తొలగించింది. ఐఫోన్ ను ఓపెన్ చేసిన తర్వాత యూవీ రంగు పరికరంలోని ఇతర విభాగాలలో నీరు మిగిలి ఉందని చూపింది. దీంతో నీటిలో పూర్తిగా నానిన ఫోన్‌ను ఈ వీడియో పూర్తిగా ఆరబెట్టదని తేలిపోయింది.

యాపిల్ వాచ్ కు..

యాపిల్ వాచ్ నుంచి నీటిని తీసివేయడానికి ఇలా వీడియో ద్వారా ధ్వనిని వినియోగిస్తే మెరుగ్గా పనిచేస్తుందని నిర్ధారించారు. ఎందుకంటే యాపిల్ ఐఫోన్ పరిమాణం కన్నా వాచ్ తక్కువగా ఉండటం, అలాగే నీరు లోపలికి వెళ్లేందుకు పగుళ్లు తక్కువ ఉండటంతో ఈ వీడియో సౌండ్ ద్వారా నీటిని సులభంగా బయటకు పంపొచ్చని తేల్చారు.

వాస్తవానికి ఐఫోన్ 15సహా కొత్త ఐఫోన్ మోడళ్లు అన్ని ఐపీ68 వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంటున్నాయి. అంటే 30 నిమిషాల పాటు ఆరు మీటర్ల నీటిలో మునిగి ఉన్నా.. అవి ఏ మాత్రం పాడవ్వవు. అయితే ఫోన్ వాడేకొద్దీ ఈ వాటర్ ప్రూఫింగ్ సామర్థ్యం తగ్గే అవకాశాలుంటాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

స్మార్ట్ ఫోన్ నీటిలో పడిపోయిందా? యూట్యూబ్‌లో ఈ వీడియో ప్లే చేయండి
స్మార్ట్ ఫోన్ నీటిలో పడిపోయిందా? యూట్యూబ్‌లో ఈ వీడియో ప్లే చేయండి
ఏపీలో మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఏపీలో మరో 24 గంటలు భారీ నుంచి అతి భారీ వర్షాలు
50 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
50 ఏళ్లలో ఎన్నడూ చూడని బీభత్సం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
Test Records: క్యాచ్‌లతో ప్రపంచ రికార్డ్ లిఖించిన స్టార్ ప్లేయర్
Test Records: క్యాచ్‌లతో ప్రపంచ రికార్డ్ లిఖించిన స్టార్ ప్లేయర్
ప్రముఖ నటి అభినయ ఇంట తీవ్ర విషాదం..రిక్షాలో వెళుతూ తల్లి కన్నుమూత
ప్రముఖ నటి అభినయ ఇంట తీవ్ర విషాదం..రిక్షాలో వెళుతూ తల్లి కన్నుమూత
కడప విద్యార్థిని సత్తా.. రూ.1.70 కోట్ల వార్షిక వేతనంతో కొలువు
కడప విద్యార్థిని సత్తా.. రూ.1.70 కోట్ల వార్షిక వేతనంతో కొలువు
బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‏గా పనిచేసిన అమ్మాయికి పాన్ ఇండియా క్రేజ్.
బ్యాగ్రౌండ్ డ్యాన్సర్‏గా పనిచేసిన అమ్మాయికి పాన్ ఇండియా క్రేజ్.
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
కంగనాకు బిగ్ ఝలక్‌.! ఇక సినిమా విడుదల కష్టమే.!
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
వాన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టి నగ్నంగా వీడియోలు తీస్తారు: రాధికా
ఈ చిన్న చిట్కాలతో గురకను శాశ్వతంగా తగ్గించుకోండి..

ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఇంతకీ NTR వస్తున్నారా.? లేదా.? | ఈ ఇద్దరూ కొరకరాని కొయ్యలు.!
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఎలా ఉండే హీరోయిన్ ఎలా మారిపోయింది.? షాకింగ్‌లో ఫ్యాన్స్‌..
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
ఫాస్ట్‌ ట్యాగ్‌ కనుమరుగు కానుందా.? టోల్ గేట్ల పరిస్థితి ఏంటి.?
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
యూట్యూబ్ యూజర్లకు బ్యాడ్ న్యూస్‌.! రెన్యువల్‌ సబ్​ స్క్రిప్షన్ ధర
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
ఇక రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్‌ అయ్యాకే ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతి.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
హైదరాబాద్‌లో దంచికొట్టిన వాన.. నీటిలో కొట్టుకుపోయిన కూరగాయలు
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
కేన్సర్‌తో మరణానికి దగ్గరగా యువతి.. జీవితంలోని చివరి క్షణాలు వేలం
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్
వరంగల్‌ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్