AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp: ఒకటి కన్నా ఎక్కువ వాట్సాప్ ఖాతాలు వాడేవారికి అదిరిపోయే న్యూస్.. ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి..

ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన వాట్సాప్ ను అనేక ఫీచర్లతో మెటా యాజమాన్యం నిరంతరం డెవలప్ చేస్తోంది. వినియోగదారులకు అవసరమైన అనేక ఫీజర్ల ప్రవేశపెడుతూ, ఉన్న వాటిని అప్ గ్రేడ్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. ‘కాంటాక్ట్ సింకింగ్(Contact Syncing)’ పేరుతో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

WhatsApp: ఒకటి కన్నా ఎక్కువ వాట్సాప్ ఖాతాలు వాడేవారికి అదిరిపోయే న్యూస్.. ఈ కొత్త ఫీచర్ గురించి తెలుసుకోండి..
Whatsapp
Madhu
|

Updated on: Sep 01, 2024 | 4:24 PM

Share

మెటా యాజమాన్యంలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌నకు పెద్ద సంఖ్యలో యూజర్లు ఉన్నారు. ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్ ఉండాల్సిందే. మన నిత్యం జీవితంలో అవసరమైన ప్రతి పనికీ ఈ యాప్ సహాయపడుతుంది. విద్య, ఉద్యోగ సమాచారం, వినోదం, ఫొటోలు, వీడియోలు తదితర వాటిని షేర్ చేసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందిన వాట్సాప్ ను అనేక ఫీచర్లతో మెటా యాజమాన్యం నిరంతరం డెవలప్ చేస్తోంది. వినియోగదారులకు అవసరమైన అనేక ఫీజర్ల ప్రవేశపెడుతూ, ఉన్న వాటిని అప్ గ్రేడ్ చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా మరో కొత్త ఫీచర్ ను పరిచయం చేయనుంది. ‘కాంటాక్ట్ సింకింగ్(Contact Syncing)’ పేరుతో ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ ప్రత్యేకతలు, ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.

వాట్సాప్ లోని నంబర్ల ప్రైవసీని కాపాడటం, నిర్వహణలో సౌలభ్యం మెరుగుపర్చడం ఈ ఫీచర్ ప్రధాన లక్ష్యాలు. ముఖ్యంగా ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు నిర్వహించే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. వాట్సాప్ బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం.. యూజర్లు తమ బహుళ ఖాతాలకు సంబంధించి కాంటాక్ట్ ల నిర్వహణను మెరుగుపర్చుతుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలో ఉంది. వినియోగదారులకు కాంటాక్ట్ సింక్రనైజేషన్‌పై నియంత్రణతో పాటు గోప్యత, సౌలభ్యాన్ని మెరుగుపర్చుతుంది. మీ పరిచయాల జాబితాను యాక్సెస్ చేయడానికి, నవీకరించడానికి యాప్‌ను అనుమతిస్తుంది.

పనిచేసే విధానం..

వాట్సాప్ ఖాతాలో కాంటాక్ట్ లను నియంత్రించడానికి కొత్త కాంటాక్ట్ సింకింగ్ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు మీకు రెండు వాట్సాప్ ఖాతాలు ఉన్నాయి. ఒక దానికి పని కోసం, మరో దాన్ని వ్యక్తిగతంగా ఉపయోగిస్తున్నారనుకోండి. కొత్త ఫీచర్ ద్వారా మీరు కావాల్సిన కాంటాక్టులనే ఖాతాలకు యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ కార్యాలయ వాట్సాప్‌లోని కాంటాక్ట్‌లు వ్యక్తిగత ఖాతాలో కనిపించవు. ఒక్కో ఖాతాకు విభిన్న నంబర్లను ఎంపిక చేసుకునే అవకాశం లభిస్తుంది.

సురక్షితం..

కొత్త ఫీచర్ వల్ల మీ కాంటాక్ట్‌లు సురక్షితంగా, భద్రంగా ఉంటాయి. మీరు ఫోన్లను మార్చుకున్నప్పడు కూడా ఎలాంటి అసౌకర్యం కలగదు. వాట్సాప్‌ను మళ్లీ ఇన్‌స్టాల్ చేసినా ఇబ్బంది ఉండదు. అయితే మీరు సెట్టింగ్‌లలో ఈ ఎంపికను ఎనేబుల్ చేసుకోవాలి. అప్పుడే మీ పరిచయాలు పునరుద్ధరించబడతాయి. అలాగే ఇకపై మీ పరికరాల్లో పరిచయాన్ని సింక్రనైజ్ చేయకూడదనుకుంటే, మీరు దానిని అన్‌సింక్ చేయవచ్చు, అన్ని లింక్ చేసిన ఖాతాల నుంచి తొలగించవచ్చు.

ఎంతో ప్రయోజనం..

బహుళ వాట్సాప్ ఖాతాలను నిర్వహించే వారికి మెరుగైన సేవలు అందించేందుకు ఈ ఫీచర్ ను తీసుకువస్తున్నారు. కార్యాలయం, వ్యక్తిగత జీవితాన్నివేరు చేయడానికి ఉపయోగపడుతుంది. ఉద్యోగ నిర్వహణతో పాటు వ్యక్తిగత స్నేహితులతో అనుబంధాన్ని కొనసాగించవచ్చు. ఈ ఫీచర్ ఇప్పటికే బీటాలో ఉంది. కానీ వినియోగదారులందరికీ అందుబాటులో రాలేదు. త్వరలోనే మెటా ఈ కొత్త ఫీచర్ ను అందరికీ అందుబాటులోకి తీసుకువస్తుందని భావిస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..