Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Meta: మారనున్న సోషల్‌ మీడియా ముఖచిత్రం.. వాట్సాప్‌, ఇన్‌స్టా, మెసేంజర్‌లో ఏఐ సేవలు..

ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం మెటా సైతం తన స్వంత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అసిస్టెంట్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్‌, మెసేంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కృత్రి మేధస్సును అందుబాటులోకి తెస్తుంది. చాట్‌ జీపీటీ, బింగ్‌ వంటి సులభమైన సేవలను వినియోగదారులకు తీసుకొస్తున్నారు. మెటా కనెక్ట్ వార్షిక ఈవెంట్‌లో భాగంగా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఈవెంట్‌లో భాగంగా...

Meta: మారనున్న సోషల్‌ మీడియా ముఖచిత్రం.. వాట్సాప్‌, ఇన్‌స్టా, మెసేంజర్‌లో ఏఐ సేవలు..
Meta
Follow us
Narender Vaitla

|

Updated on: Sep 30, 2023 | 7:26 PM

టెక్నాలజీ రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. మారుతోన్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీలో సమూల మార్పులు వస్తున్నాయి. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రాకతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. కృత్రిమ మేధస్సు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్‌నెట్‌ స్వరూపమే మారి పోయింది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా ఎన్నో అధునాతన సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. చాట్‌ జీపీటీ రాకతో టెక్నాలజీలో అనూహ్య మార్పులు వచ్చాయి.

ఈ క్రమంలోనే ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం మెటా సైతం తన స్వంత ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అసిస్టెంట్‌ను తీసుకొస్తోంది. వాట్సాప్‌, మెసేంజర్‌, ఇన్‌స్టాగ్రామ్‌లో కృత్రి మేధస్సును అందుబాటులోకి తెస్తుంది. చాట్‌ జీపీటీ, బింగ్‌ వంటి సులభమైన సేవలను వినియోగదారులకు తీసుకొస్తున్నారు. మెటా కనెక్ట్ వార్షిక ఈవెంట్‌లో భాగంగా కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఈవెంట్‌లో భాగంగా క్వెస్ట్‌3 మిక్స్‌డ్‌ రియాలిటీ హెడ్‌సెట్‌ను తీసుకొచ్చింది. వీటితో పాటు మెసేజింగ్ యాప్స్‌లో ఏఐని అందుబాటులోకి తీసుకొచ్చారు. త్వరలోనే ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు.

మెటా AI టెక్ట్స్‌ ద్వారా చిత్రాలను గీయొచ్చు. ఈ ఫీచర్స్‌ సహాయంతో గ్రూట్ చాట్‌లో ట్రిప్‌లను ప్లాన్‌ చేయడంతో పాటు వంటల గురించిన విషయాలను, షాపింగ్ లిస్ట్‌ను తయారు చేసుకోవచ్చు. వాట్సాప్‌, మెసేజింగ్, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి యాప్స్‌లో మెసేంజర్‌లలో AI అవతార్‌లను కూడా షేర్‌ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. ఈ అవతార్‌ల ద్వారా యూజర్‌లు మెసేజ్‌లను పంపుకోవచ్చు.

ఈ ఇమేజ్‌ జనరేటషన్‌ టూల్‌ని ‘ఎక్స్‌ప్రెసివ్‌ మీడియా యూనివర్స్‌’గా పిలుస్తున్నారు. ఈ ఫీచర్‌ సహాయంతో వాట్సాప్‌, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌ మేసేంజర్స్‌లో టెక్ట్స్‌ ఆధారంగా AI స్టిక్కర్‌లను తయారు చేసుకోవచ్చు. వీటిని నేరుగా యూజర్లకు పంపుకోవచ్చు. టెక్ట్స్‌ను స్టిక్కర్‌గా కేవలం 5 సెకండ్స్‌లోనే మార్చుకునే అవకాశాన్ని ఈ ఫీచర్‌ కల్పించనుంది. వచ్చే నెల నుంచి ఈ ఫీచర్‌ను మెటాకు సంబంధించిన అన్ని మెసేజింగ్‌ సేవల్లో అందుబాటులోకి తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే మెటా కనెక్ట్ వార్షిక ఈవెంట్‌లో భాగంగా మరో అద్భుత డివైజ్‌ను లాంచ్‌ చేసింది. మెటా క్విస్ట్‌ 3 పేరుతో రియాలిటీ హెడ్‌సెట్‌ను తీసుకురానున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు తెచ్చిన మెటా క్విస్ట్‌ 2కి కొనసాగింపుగా ఈ రియాలిటీ హెడ్‌సెట్‌ను తీసుకొచ్చారు. అధునాతన టెక్నాలజీతో మెటా తీసుకొచ్చిన ఈ కొత్త అప్‌డేట్స్‌ సోషల్‌ మీడియాలో మరెన్ని అద్భుతాలు సృష్టిస్తుందో చూడాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..