AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lenovo tab m11: లెనెవో నుంచి కొత్త ట్యాబ్ వచ్చేస్తోంది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా..

కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ట్యాబ్‌ల ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో కూడిన ట్యాబ్స్‌ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం లెనొవో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. లెనెవో ట్యాబ్‌ ఎమ్‌11 పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకురానుంది. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌ 11 ఫీచర్ల విషయానికొస్తే..

Lenovo tab m11: లెనెవో నుంచి కొత్త ట్యాబ్ వచ్చేస్తోంది.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా..
Lenovo Tab M11
Narender Vaitla
|

Updated on: Sep 30, 2023 | 6:35 PM

Share

ప్రస్తుతం మార్కెట్లో స్మార్ట్‌ ఫోన్స్‌కు ఎంతటి గిరాకీ ఉందో ట్యాబ్‌లకు అదే స్థాయిలో స్పందన లభిస్తోంది. కరోనా తదనంతర పరిస్థితుల నేపథ్యంలో ట్యాబ్‌ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. విద్యార్థులతో పాటు, ఉద్యోగులు సైతం ట్యాబ్‌లోనే తమ పనులను పూర్తి చేసే రోజులు వచ్చేశాయ్‌. దీంతో ట్యాబ్‌ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. ఒకప్పుడు కేవలం బడా కంపెనీలు మాత్రమే ట్యాబెలను విడుదల చేస్తూ వచ్చేవి. కానీ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్‌ను తీసుకొస్తున్న ప్రతీ కంపెనీ ట్యాబ్‌లను లాంచ్‌ చేస్తూ వస్తున్నాయి.

కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో ట్యాబ్‌ల ధరలు కూడా గణనీయంగా తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లతో కూడిన ట్యాబ్స్‌ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం లెనొవో మార్కెట్లోకి కొత్త ట్యాబ్‌ను తీసుకొచ్చే పనిలో పడింది. లెనెవో ట్యాబ్‌ ఎమ్‌11 పేరుతో ఈ ట్యాబ్‌ను తీసుకురానుంది. లెనోవో ట్యాబ్‌ ఎమ్‌ 11 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 11 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు.

1,920 x 1,200 పిక్సెల్‌ల రిజల్యూషన్‌ ఈ స్క్రీన్ ప్రత్యేకత. ఇక లెనోవో ట్యాబ్‌ ఎమ్‌11 మీడియా టెక్‌ హీలియో జీ88 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేసే ఈ ట్యాబ్‌ను మూడు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. 4జీబీ, 8 జీబీ, 12 జీబీ వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. అంతేకాకుండా మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇక ఈ ట్యాబ్‌ను ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే ఏకంగా 10 గంటల తరబడి పనిచేస్తుంది. ట్యాబ్ బరువు 466 గ్రాములు ఉంది.

ఇక కెమెరా విషయానికొస్తే మాత్రం లెనోవో ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట వైరల్ అవుతోన్న సమాచారం ఆధారంగా ఈ ట్యాబ్‌లో సింగిల్ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక సౌండ్ విషయానికొస్తే ఇందులో డాల్బీ ఆటమ్స్‌ సౌండ్ ఇవ్వనున్నారని సమాచారం. లెనోవో ట్యాబ్ ఎమ్‌11లో 5v/2A ఛార్జింగ్‌ అడాప్టర్‌ను ఇవ్వనున్నారు. 16 ఎమ్‌ఎమ్‌ ఈ ట్యాబ్‌ హైట్‌ ఉండనున్నట్లు అంచనా వేస్తున్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..