Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Summer Tips: కరెంట్ లేకుండానే నడిచే ఫ్యాన్స్.. జస్ట్ రూ. 600 లకే అందుబాటులో.. వివరాలివే..

వేసవిలో ఎక్కువ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏసీ, కూలర్, ఫ్యాన్స్ వినియోగం అధికంగా ఉంటుంది. దీని వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. వేసవిలో ఎండ వేడిమి కారణంగా ఇంట్లోని ప్రతి గదిలోనూ ఫ్యాన్‌ వేయడం వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. ఈ సమస్యను పరిస్కరించే, కరెంట్ బిల్లు భారం పడకుండా ఉండే టిప్స్‌ను

Summer Tips: కరెంట్ లేకుండానే నడిచే ఫ్యాన్స్.. జస్ట్ రూ. 600 లకే అందుబాటులో.. వివరాలివే..
Solar Fan
Follow us
Shiva Prajapati

|

Updated on: May 02, 2023 | 2:14 PM

వేసవిలో ఎక్కువ ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఏసీ, కూలర్, ఫ్యాన్స్ వినియోగం అధికంగా ఉంటుంది. దీని వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. వేసవిలో ఎండ వేడిమి కారణంగా ఇంట్లోని ప్రతి గదిలోనూ ఫ్యాన్‌ వేయడం వల్ల కరెంటు బిల్లు ఎక్కువగా వస్తుంది. ఈ సమస్యను పరిస్కరించే, కరెంట్ బిల్లు భారం పడకుండా ఉండే టిప్స్‌ను మీకోసం చెప్పబోతున్నాం. కరెంట్ అవసరం లేని ఫ్యాన్స్ అందుబాటులోకి వచ్చాయి. సోలార్ సిస్టమ్‌తో నడిచే ఫ్యాన్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇవి వేసవీలో మీపై కరెంట్ బిల్లు భారాన్ని తగ్గిస్తాయి. ఈ ఫ్యాన్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

One For All SS-20 Solar multi purpose 12v DC fan..

కరెంటు బిల్లుల టెన్షన్‌తో పడుతుంటే.. ఈ ఫ్యాన్‌ని మీ ఇంట్లో పెట్టుకోవడం ఉత్తమ ఎంపిక. ఈ పోర్టబుల్ ఫ్యాన్‌లో అనేక ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫ్యాన్‌ని ఒకే బటన్‌తో నియంత్రించవచ్చు. వంటగది, హాల్‌లో, బెడ్ రూమ్ ఇలా ఎక్కడైనా సోలార్ ఫ్యాన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. 28D x 26W x 16H సైజులో ఇవి అందుబాటులో ఉన్నాయి. వీటి ధర రూ. 599, దీన్ని 2 శాతం తగ్గింపుతో కేవలం రూ. 589కి ఇ కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్ నుండి కొనుగోలు చేయవచ్చు.

Lovely Solar Fan® DC 12Volt 6..

ఈ ఫ్యాన్ అసలు ధర రూ.699. అమెజాన్‌లో దీనిని 14 శాతం తగ్గింపుతో రూ.599కి సులభంగా కొనుగోలు చేయవచ్చు. వివిధ రంగుల్లో అందుబాటులో ఉంది. ఒక సంవత్సరం వారంటీ కూడా ఉంది.

ఇవి కూడా చదవండి

సోలార్ ఫ్యాన్ ఎందుకు?

సోలార్ ఫ్యాన్ పర్యావరణ అనుకూలమైనది. కార్బన్ ఉద్గారాలను తగ్గిస్తుంది. దీన్ని ఏర్పాటు చేయడం ప్రారంభంలో కాస్త ఖర్చుతో కూడుకున్నది అయినప్పటికీ.. దీర్ఘకాలంలో చాలా ఖర్చు ఆదా అవుతుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..