Samsung Fab Grab Fest: సామ్‌సంగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్… అతిపెద్ద సేల్ ప్రారంభం.. ఆ ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్స్
ప్రస్తుతం సామ్‌సంగ్ కంపెనీ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ నిర్వహిస్తుంది. ఈ ఫెస్ట్ సందర్భంగా సామ్‌సంగ్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు లభించనుంది. వినియోగదారులు విస్తృత శ్రేణి సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఉపకరణాల వంటి వాటిపై మునుపెన్నడూ లేని విధంగా మెగా ఆఫర్‌లు, అద్భుతమైన క్యాష్‌బ్యాక్‌లను పొందవచ్చు.
భారతదేశంలో సామ్‌సంగ్ ఉత్పత్తులపై ప్రజలకు ఓ నమ్మకం. ఫోన్ల దగ్గర నుంచి టీవీలు, ఏసీలు, ఫ్రిజ్‌లు, గృహోపకరణాలు వంటి సామ్‌సంగ్ ఉత్పత్తులను ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు. కంపెనీ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త మోడల్స్‌ను రిలీజ్ చేస్తుంది. అలాగే ప్రజలను ఆకట్టుకోవడానికి ప్రత్యేక సేల్స్ కూడా పెడుతూ ఉంటుంది. ప్రస్తుతం సామ్‌సంగ్ కంపెనీ ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ నిర్వహిస్తుంది. ఈ ఫెస్ట్ సందర్భంగా సామ్‌సంగ్ ఉత్పత్తులపై భారీ తగ్గింపు లభించనుంది. వినియోగదారులు విస్తృత శ్రేణి సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఉపకరణాల వంటి వాటిపై మునుపెన్నడూ లేని విధంగా మెగా ఆఫర్‌లు, అద్భుతమైన క్యాష్‌బ్యాక్‌లను పొందవచ్చు. ఫెస్ట్ ఆఫర్‌లు సామ్‌సంగ్ వెబ్‌సైట్‌లో అలాగే దేశవ్యాప్తంగా ఉన్న సామ్‌సంగ్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటాయి. ఫ్యాబ్ గ్రాబ్ ఫెస్ట్ సందర్భంగా వినియోగదారులు గెలాక్సీ ఎస్ సిరీస్, ఏ సిరీస్, ఎం సిరీస్, ఎం సిరీస్, ఫ్లిప్ 3 స్మార్ట్‌ఫోన్‌ల ఎంపిక చేసిన మోడళ్లపై 57 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. అలాగే గెలాక్సీ టాబ్లెట్‌లు, ఉపకరణాల వంటి వాటిపై 40 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు. వినియోగదారులు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై 14 శాతం వరకు అదనపు క్యాష్‌బ్యాక్‌ను కూడా పొందుతారు. కాబట్టి ఈ సేల్ గురించి అదనపు వివరాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
గెలాక్సీ ఎఫ్ 14, గెలాక్సీ ఎఫ్ 23, ఫ్లాగిషిప్ గెలాక్సీ ఎస్ 21 ఎఫ్ఈ 5జీ, గెలాక్స్ జెడ్ ఫ్లిప్ 3, గెలాక్సీ ఎం 14 వంటి ఫోన్లపై 57 శాతం వరకూ తగ్గింపు లభిస్తుంది. గెలాక్సీ బుక్ 2, గెలాక్సీ బుక్ గో వంటి ల్యాప్‌టాప్‌లు, అలాగే గెలాక్సీ బుక్ 3, గెలాక్సీ బుక్ 3 ప్రో 360 ల్యాప్‌టాప్‌లను 29 శాతం వరకూ తగ్గింపు ధరకు పొందవచ్చు. సామ్ సంగ్ ట్యాబ్లెట్లు, ఉపకరణాలు, గెలాక్సీ ఎస్ 6 లైట్ వైఫై, గెలాక్సీ ఏ8 వైఫై, గెలాక్సీ వాచ్ 4 వంటి ఉత్పత్తులపై 40 శాతం వరకూ తగ్గింపును పొందవచ్చు. సామ్‌సంగ్ నియో క్యూ ఎల్ఈడీ, ది ఫ్రేమ్ టీవీలు, క్రిస్టల్ యూహెచ్‌డీ టీవీలపై 45 శాతం వరకూ తగ్గింపు లభిస్తుంది.
గృహోపకరణాలపై భారీ ఆఫర్లు
రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్‌లు, మానిటర్లు, ఎయిర్ కండీషనర్లు వంటి అనేక డిజిటల్ ఉపకరణాలపై మునుపెన్నడూ లేని ఆఫర్లను కంపెనీ అందిస్తుంది. ముఖ్యంగా ప్రీమియం సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్‌లపై గరిష్టంగా 40 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. ఎంపిక చేసిన సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్‌ల కొనుగోలుపై వినియోగదారులు రూ.15,990 లేదా అంతకంటే ఎక్కువ విలువైన 32 అంగుళాల స్మార్ట్ సామ్‌సంగ్ టీవీని 40 శాతం తగ్గింపుతో పొందవచ్చు. వాషింగ్ మెషీన్లకు ఎంపిక చేసిన మోడల్‌లను కొనుగోలు చేస్తే వినియోగదారులు 30% వరకు తగ్గింపుతో పాటు 28 లీటర్ల మైక్రోవేవ్ ఓవెన్ ఉచితంగా పొందుతారు. మైక్రోవేవ్ వంటి ఇతర డిజిటల్ ఉపకరణాలు గరిష్టంగా 35% తగ్గింపుతో లభిస్తాయి. ఎయిర్ కండీషనర్ల యొక్క ఎంపిక చేసిన మోడల్స్ 40 శాతం వరకు తగ్గింపుతో లభిస్తాయి. అలాగే ఐసీఐసీఐ, యాక్సిస్, కోటక్, ఇతర ప్రముఖ బ్యాంకుల డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై గరిష్టంగా రూ. 25,000తో 22.5 శాతం వరకు అదనపు క్యాష్‌బ్యాక్ అందుబాటులో ఉంటుంది. సామ్‌సంగ్ తాజా శ్రేణి విండ్ ఫ్రీ ఏసీల్లో రెండు లేదా అంతకంటే ఎక్కువ కొనుగోలు చేసే వినియోగదారులు మొత్తం ధరపై అదనంగా 10% తగ్గింపును పొందవచ్చు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..