స్మార్ట్రాన్ ఇండియా నుండి సరికొత్త ఈ-బైక్.. త్వరలోనే మార్కెట్‌లోకి ‘టీబైక్ వన్ ప్రొ’..
ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా తెలంగాణను తీర్చి దిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం సాక్షాత్కారం అవుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లోకి రాగా.. ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ వాహనం వస్తోంది. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్మార్ట్రాన్ ఇండియా తమ ప్రతిష్టాత్మక క్రాస్ ఓవర్ స్మార్ట్ ఈ-బైక్ ‘టీబైక్ వన్ ప్రో’ను త్వరలోనే ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మాట్లాడిన స్మార్ట్రాన్ ఇండియా ఫౌండర్ అండ్ ఛైర్మన్ మహేష్ లింగారెడ్డి.. అత్యధిక ఆర్‌ఓఐ, క్లౌడ్ […]
ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా తెలంగాణను తీర్చి దిద్దాలనే రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యం సాక్షాత్కారం అవుతోంది. హైదరాబాద్ కేంద్రంగా ఇప్పటికే ఎన్నో ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్‌లోకి రాగా.. ఇప్పుడు మరో ఎలక్ట్రిక్ వాహనం వస్తోంది. తాజాగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న స్మార్ట్రాన్ ఇండియా తమ ప్రతిష్టాత్మక క్రాస్ ఓవర్ స్మార్ట్ ఈ-బైక్ ‘టీబైక్ వన్ ప్రో’ను త్వరలోనే ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. దీని గురించి మాట్లాడిన స్మార్ట్రాన్ ఇండియా ఫౌండర్ అండ్ ఛైర్మన్ మహేష్ లింగారెడ్డి.. అత్యధిక ఆర్‌ఓఐ, క్లౌడ్ కనెక్టడ్ ఆఫరింగ్‌తో ధృడమైన ఫీచర్లను అందించే రీతిలో తీర్చిదిద్దిన ఈ బైక్‌ను ప్రత్యేకంగా భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న షేర్డ్/బీ2బీ ఈ–బైక్ విభాగం కోసం తీర్చిదిద్దామన్నారు.
అలాగే ఇంటిలిజెంట్ కనెక్టెడ్ ఈ–బైక్, టీబైక్ వన్ ప్రో లు వినూత్నమైనవని, విప్లవాత్మక రీతిలో రైడర్లకు మెరుగైన ప్రయాణ అనుభూతులను అందిస్తుందని మహేష్ లింగారెడ్డి చెప్పుకొచ్చారు. భారత్‌తో పాటు ప్రపంచం కోసం భారతదేశంలో రూపకల్పన చేసి తీర్చిదిద్దడం పట్ల తాము గర్వంగా ఉన్నామన్నారు. ట్రాన్ ఎక్స్ ప్లాట్‌ఫామ్ శక్తితో మరిన్ని ఎలక్ట్రానిక్ వెహికల్ ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నామని మహేష్ ప్రకటించారు.