Nostradamus Predictions: 2021లో ప్రపంచ వినాశనమట! నోస్ట్రాడమస్ భవిష్యవాణిలో బయటపడ్డ సంచలన విషయాలు..

వచ్చే ఏడాది భూమి మొత్తం అంతమవుతుందనే మరోవార్త హల్‌చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక ప్రిడిక్షన్ ఇప్పుడు బయటకు వచ్చింది.

Nostradamus Predictions: 2021లో ప్రపంచ వినాశనమట! నోస్ట్రాడమస్ భవిష్యవాణిలో బయటపడ్డ సంచలన విషయాలు..
Follow us
Anil kumar poka

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Dec 07, 2020 | 3:24 PM

Nostradamus Predictions 2021: వచ్చే ఏడాది భూమి మొత్తం అంతమవుతుందనే మరోవార్త హల్‌చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక ప్రిడిక్షన్ ఇప్పుడు బయటకు వచ్చింది. 2021లో భూకంపం సంభంవిస్తుందని దీంతో భూగ్రహం అంతమవుతుందని, అలాగే కరువుతో భూప్రపంచం మొత్తం విలవిలలాడుతుందని నోస్ట్రాడమస్ ప్రిడిక్షన్‌లో బయటపడింది.

ఫ్రాన్స్‌కు చెందిన మైఖేల్ ది నోస్ట్రాడమస్ (నోస్ట్రాడమస్ ప్రిడిక్షన్స్ 2021) గురించి చాలా మందికి తెలుసు. ఈయన భవిష్యత్తులో సంభవించే అనేక విషయాలను ముందుగానే చెప్పారు. దాదాపు 465 సంవత్సరాల క్రితం ఈయన చెప్పిన మాటలన్నీ కూడా నిజమయ్యాయి. ప్రస్తుత తరానికి ఇదంతా ఆశ్చర్యంగానే అనిపించొచ్చు.

ఎన్నో విషయాలు..

నోస్ట్రాడమస్ కొన్ని శతాబ్దాల క్రితం ‘లెస్ ప్రాఫెటీస్’ అనే పుస్తకంలో ప్రపంచానికి సంబంధించిన చాలా విషయాలను వివరించారు. ఈ పుస్తకం మొదటి ఎడిషన్ 1555 లో వచ్చింది. ఈ పుస్తకంలో భవిష్యత్ కు సంబంధించి మొత్తం 6338 విషయలు ఉన్నాయి, వాటిలో 70 శాతం దాకా వాస్తమేనని తేలింది. ఆయన ప్రిడిక్షన్స్‌ను ‘క్వాట్రెయిన్స్’ అని అంటారు.

నిజమయ్యాయట..

2020కి సంబంధించిన భవిష్యవాణి నిజమైంది. 2020 సంవత్సరంలో ప్రపంచాన్ని చిగురుటాకులా వణికించిన కరోనా వైరస్ మహమ్మారి గురించి కూడా నోస్ట్రాడమస్ ముందే చెప్పారు. ఇదొక్కటే కాదు ఇలా అనేక జరగబోయే విషయాలను ఆయన ముందే చెప్పారు. అవన్నీ కూడా నిజమయ్యాయి. రుజువుగా మారాయి. మరి 2021 గురించి నోస్ట్రాడమస్ ఏం చెప్పాడో ఒకసారి చూద్దామా.

వైరస్‌లతో మానవజాతి అంతం..

జోంబీ-నోస్ట్రాడమస్ అంచనా ప్రకారం.. రష్యన్ శాస్త్రవేత్తలు బయాలాజికల్ వెపన్స్ అంటే కొన్ని రకాల వైరస్‌లను తయారు చేసే అవకాశం ఉంది. ఈ వైరస్‌లు మానవళి మొత్తానికి హానీ చేసేలా ఉంటాయి. దీంతో మానవ జాతి అంతా నాశనమవుతుందనేది నోస్ట్రాడమస్ అభిప్రాయం.

కరువు, భూకంపాలు…

కరువు – నోస్ట్రాడమస్ ఇంకా చాలా విషయాలు అప్పట్లోనే అంచనా వేశారు. కరువు, భూకంపాలు, వివిధ వ్యాధుల ద్వారా ప్రపంచం మొత్తం అంతమవుతుందనడానికి సంకేతంగా చెప్పారు. ఇక ఈ విషయాలన్నీ కూడా నిజం అవుతున్నాయి. 2020లో కరోనా మహమ్మారి వ్యాప్తినే మనకు ఒక హెచ్చరిక. కరోనా ప్రపంచం మొత్తాన్ని వణికించింది. ఇక ప్రపంచం ముందెన్నడూ కరువును కూడా ప్రజలంతా ఎదొర్కోవాల్సి వస్తుందట. జనమంతా ఈ విపత్తుతో అల్లాడిపోతారంట.

భానుడి విశ్వరూపం –

రాబోయే 2021 మనం అందరం గుర్తుంచుకునే సంవత్సరంగా నిలవనుందట. భూమిపై ఇప్పటి వరకు జాలి చూపిన భానుడు కూడా భగభగ నిప్పులు చిమ్ముతాడట. సూర్య భగవానుడు భూమిని మొత్తం నాశనం చేస్తాడంట. సముద్ర మట్టం పెరగడం వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉందని కూడా నోస్ట్రాడమస్ చెప్పారు. పకృతిలో తీవ్రమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అంతటా యుద్ధవాతారణం ఏర్పడుతుంది. వనరుల కోసం ప్రపంచం మొత్తం పోట్లాడుకోవాల్సిన పరిస్థితులు కూడా తలెత్తుతాయంట. జనాలంతా దిక్కుతెలియకుండా పారిపోతారంట.

‘గ్రేట్ ఫైర్’ లాగా ఉంటుందట..

భూకంపాలు, అనేక ప్రకృతి వైపరీత్యాలకు కారణమయ్యే ‘క్వాట్రైన్’లో భూమిని తోకచుక్క ఢీ కొట్టడం గురించి నోస్ట్రాడమస్ వివరించారు. ఈ గ్రహశకలం భూమి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత తన ప్రభావాన్ని చూపుతుంది. ఇక ఈ దృశ్యం ఆకాశంలో ‘గ్రేట్ ఫైర్’ లాగా ఉంటుందట. భూమికి పొంచి ఉన్న ముప్పు గురించి ఇప్పటికే నాసా శాస్త్రవేత్తలు చాలా విషయాలు వెల్లడించారు. 2009 KF1 అనే అస్ట్రాయిడ్ 2021, మే 6న భూమిని తాకే ప్రమాదం ఉంది. ఈ ఉల్క చాలా ప్రమాదకరమైనది. 1945లో హిరోషిమాపై అమెరికా విసిరిన అణుబాంబుల కంటే ఇది 15 రెట్లు ఎక్కువగా ప్రభావంగా చూపుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

కాలిఫోర్నియాలో భూకంపం..

నోస్ట్రాడమస్ అంచనా ప్రకారం… ఒక భారీ భూకంపం ఈ ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసే అవకాశం చేస్తుంది. కాలిఫోర్నియాపై ఈ ప్రభావం ఎక్కువగా ఉండనుంది. ప్రకృతి వైపరీత్యాల గురించి నోస్ట్రాడమస్ వేసిన అంచనాలన్నీ నిజమయ్యాయి. ఇది కూడా నిజం అయ్యే నిజం అయ్యే అవకాశం ఉంది.

బ్రెయిన్ చిప్..

ఇక అంతరించిపోనున్న మానవజాతిని కాపాడటానికి, అమెరికన్ సైనికులు సైబోర్గ్స్ వంటి వాటికి వెళ్లాల్సి వస్తుంది. ఇందుకు వారు బ్రెయిన్ చిప్ ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ చిప్ మానవ మెదడు మేధస్సును పెంచడానికి పని చేస్తుంది. అంటే అప్పుడు మన బుర్ర ప్లేస్ లో ఈ చిప్ ఉంటుందన్నమాట. మొత్తానికి కృత్రిమ మేధస్సుతో మనం బతకాల్సి వస్తుంది. నోస్ట్రాడమస్ చెప్పిన ఈ విషయాలన్నీ నిజం అయితే మాత్రం మానవమనుగడ కష్టమే మరి.