వ్యాక్సిన్ రవాణాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధం.. ఇంకొద్ది రోజుల్లో భారత్‏కు కరోనా టీకా.!

మరికొన్ని రోజుల్లోనే దేశానికి కరోనా వ్యాక్సిన్ రాబోతుంది. ఈ క్రమంలో టీకా పంపిణీ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రణాళికలు సిద్దం చేసినట్లు ప్రకటించింది.

వ్యాక్సిన్ రవాణాకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిద్ధం.. ఇంకొద్ది రోజుల్లో భారత్‏కు కరోనా టీకా.!
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 07, 2020 | 2:34 PM

మరికొన్ని రోజుల్లోనే దేశానికి కరోనా వ్యాక్సిన్ రాబోతుంది. ఈ క్రమంలో టీకా పంపిణీ కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రణాళికలు సిద్దం చేసినట్లు ప్రకటించింది. దేశంలోని మారుమూల ప్రాంతాలకు టీకాను పంపిణీ చేసేందుకు ఎయిర్ ఫోర్స్ అన్నివిధాలుగా ఉపయోగపడుతుందని ఎయిర్ ఫోర్స్ అధికారులు ఆదివారం వెల్లడించారు.

వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇంతవరకు తమకు గానీ, ఆర్మీ అధికారులకు గానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికార ప్రకటన వెలువడలేదని తెలిపారు. దేశంలోని ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మిలియన్ల మోతాదులలో టీకాను రవాణా చేయగల సామర్థ్యం ఎయిర్ ఫోర్స్‏కు ఉందన్నారు. ఈ విషయం గురించి ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం వెలువడిన టీకాను రవాణా చేయడంలో తాము సహయం చేస్తామన్నారు. దేశంలో వ్యాక్సిన్ రవాణాకు ఎయిర్ ఫోర్స్ మిలిటరీ పద్ధతులను ఉపయోగించనున్నారు. ఇప్పటికే ఇది 28,000 యూనిట్ల కోల్డ్ స్టోరెజ్ నెట్‏వర్క్ నుంచి టీకాను తరలిస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్‏ను ప్రత్యేకమైన బాక్స్‏లలో రవాణా చేస్తామని వాటికోసం విమానాలను సవరించాల్సిన అవసరం లేదని తెలిపారు.