Smartphone Tips: మీ మొబైల్‌ హీటెక్కిపోతుందా..? ఇలా చేయండి

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు వాడనివారంటూ ఉండరు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటుంది. అయితే చాలా మంది స్మార్ట్‌ ఫోన్లు హీటెక్కిపోతుంటాయి. అలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం చాలా ముఖ్యమంటున్నారు టెక్‌ నిపుణులు. స్క్రీన్‌ డిస్‌ప్లే కలర్‌ఫుల్‌గా ఉండాలని చాలా మంది అనుకుంటారు. అంఉదకే బ్రైట్‌నెస్‌ ఎక్కువగా పెడుతూ మొబైల్‌ను వాడుతుంటారు. ఇలా చేయడం..

Smartphone Tips: మీ మొబైల్‌ హీటెక్కిపోతుందా..? ఇలా చేయండి
Smartphone
Follow us

|

Updated on: Jun 08, 2024 | 4:42 PM

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్లు వాడనివారంటూ ఉండరు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ ఫోన్‌ ఉంటుంది. అయితే చాలా మంది స్మార్ట్‌ ఫోన్లు హీటెక్కిపోతుంటాయి. అలాంటి సమయంలో కొన్ని చిట్కాలు పాటించడం చాలా ముఖ్యమంటున్నారు టెక్‌ నిపుణులు. స్క్రీన్‌ డిస్‌ప్లే కలర్‌ఫుల్‌గా ఉండాలని చాలా మంది అనుకుంటారు. అంఉదకే బ్రైట్‌నెస్‌ ఎక్కువగా పెడుతూ మొబైల్‌ను వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా మీ ఫోన్‌ హీటెక్కుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు. అందుకే బ్రైట్‌నెస్‌ తగ్గించుకోవడం మంచిదని సూచిస్తున్నారు. మీ ఫోన్‌ సేఫ్‌గా ఉండేందుకు చాలా మందంతో కూడిన మొబైల్‌ కవర్స్‌ను వేస్తుంటారు. ఇలాంటి బ్యాక్‌ కవర్స్‌ను వాడేవారు మొబైల్‌ ఛార్జింగ్‌ పెడుతున్న సమయంలో కవర్‌ను తీసివేయడం మంచిది. మొబైల్‌కు మందపాటి కవర్‌ ఉండటం వల్ల కూడా ఫోన్‌ హీటెక్కిపోతుందట. మొబైల్‌ఫోన్‌ను అదే పనిగా వాడటం వల్ల కూడా హీటెక్కిపోతుంది. ఇలా కాకుండా మధ్య మధ్యలో కొంత విరామం ఇవ్వడం వల్ల హీటెక్కకుండా చేసుకోవచ్చు.

ఒరిజినల్‌ ఛార్జర్‌

మీ మొబైల్‌కు ఎప్పుడు కూడా ఒరిజినల్‌ ఛార్జీర్‌ను మాత్రమే వాడాలి. చాలా మంది డూప్లికేట్‌, లేదా వేరే మోడల్‌కు చెందిన ఛార్జర్‌ను వాడుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా మొబైల్‌ త్వరగా హీటెక్కిపోతుంటుంది. ఇక చాలా మంది మొబైల్‌ యూజర్లు నేవిగేషన్‌ కోసం జీపీఎసఝ్‌ ఆన్‌ చేస్తుంటారు. అవసరం తీరాక వెంటనే జీపీఎస్‌ను ఆఫ్‌ చేయాలి. కొందరు ఎప్పుడు కూడా ఆన్‌లో ఉంచడం వల్ల మొబైల్‌ హీటెక్కిపోతుంటుంది. అందుకే ఆఫ్‌ చేసుకోవడం ఉత్తమం. స్మార్ట్‌ ఫోన్‌లలో బ్యాటరీ సేవింగ్‌ మోడ్‌ అనే ఆప్షన్‌ ఉంటుందనే విషయం అందరికి తెలియకపోవచ్చు. ఈ ఫీచర్‌ ఆన్‌ చేసుకోవడం ద్వారా బ్యాక్‌గ్రౌండ్‌ ప్రాసెస్‌లో జరిగే ఆపరేషన్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. దీని వల్ల ఫోన్‌ వేడెక్కకుండా ఉంటుంది.

యాప్స్‌ ఇన్‌స్టాల్‌

మన మొబైల్‌ ఫోన్‌ కొనుగోలు చేసినప్పుడు అందులో చాలా యాప్స్‌ ఉచితంగా ఇన్‌స్టాల్‌ చేసి ఉంటాయి. ఇలాంటి యాప్స్‌ మనకు అవసరం లేదు అనుకుంటే వాటిని డిలీట్‌ చేయడం మంచిది. దీని వల్ల మీ మొబైల్‌ హీటెక్కకుండా ఉంటుంది. మొబైల్‌ ఫోన్లు నేరుగా సన్‌లైట్‌కు ఎక్సపోజ్‌ కాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఇలా సన్‌లైట్‌ తగిలితే ఫోన్‌ మరింతగా వేడెక్కిపోతుంటుంది. చాలా మంది రాత్రుల్లో మొబైల్‌లను ఛార్జింగ్‌ పెట్టి అలాగే ఉంచుతారు. ఛార్జింగ్‌ పూర్తయిన వెంటనే డిస్‌కనెక్ట్‌ చేయడం మంచిది. రాత్రి నుంచి ఉదయం వరకు అలా కనెక్ట్‌ చేసిన ఫోన్‌ అతిగా వేడెక్కే ప్రమాదం ఉందని, ఫోన్‌ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని టెక్‌ నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ ప్రాంతాల్లో ఈదురుగాలులతో అతిభారీ వర్షాలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!