Youtube: ప్రపంచంలో అత్యధిక సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న టాప్ 10 యూట్యూబ్‌ ఛానల్స్‌ ఇవే..

యూట్యూబ్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది సబ్‌స్క్రైబర్స్‌.. ఎంత ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటే అంత ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిసిందే. మనకు తెలిసినంత వరకు ఒక కోటి మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉంటే వామ్మో అనుకుంటాం. అయితే మరి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న యూట్యూబ్‌ ఛానల్‌ ఏంటో తెలుసా.?

Youtube: ప్రపంచంలో అత్యధిక సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న టాప్ 10 యూట్యూబ్‌ ఛానల్స్‌ ఇవే..
Youtube
Follow us

|

Updated on: Jun 08, 2024 | 3:12 PM

యూట్యూబ్‌.. ప్రస్తుతం ఈ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్‌ను కోట్లాది మంది వినియోగిస్తున్నారు. ప్రతీ క్షణానికి ఎన్నో కొత్త యూట్యూబ్ ఛానల్స్‌ పుట్టుకొస్తున్నాయి, ఎన్నో కొత్త వీడియోలు అప్‌లోడ్‌ అవుతున్నాయి. ఇక యూట్యూబ్‌ ద్వారా రూ. లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్న వారు కూడా ఎంతో మంది ఉన్నారు.

యూట్యూబ్‌ అనగానే అందరికీ గుర్తొచ్చేది సబ్‌స్క్రైబర్స్‌.. ఎంత ఎక్కువ మంది సబ్‌స్క్రైబర్స్ ఉంటే అంత ఎక్కువ ఆదాయం వస్తుందని తెలిసిందే. మనకు తెలిసినంత వరకు ఒక కోటి మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉంటే వామ్మో అనుకుంటాం. అయితే మరి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న యూట్యూబ్‌ ఛానల్‌ ఏంటో తెలుసా.? సుమారు 27 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్‌తో మిస్టర్‌ బీస్ట్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌ ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. మరి ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సబ్‌స్క్రైబర్స్‌ ఉన్న తొలి 10 యూట్యూబ్‌ ఛానల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* మిస్టర్‌ బీస్ట్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌ సమారు 26.9 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్‌తో ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇక 2023లో అత్యధికంగా డబ్బు సంపాదించిన యూట్యూబ్‌ ఛానల్‌గా కూడా మిస్టర్‌బీస్ట్‌ నిలిచింది. సాహసాలు, వింతైన స్టంట్లూ చేస్తూ, డోనాల్డ్‌సన్‌ నడుపుతున్న ఈ ఛానల్‌ ఆదాయం దాదాపు రూ.680 కోట్లని ఒక అంచనా.

* ఇక భారత్‌కు చెందిన టి సీరీస్‌ ప్రపంచంలోనే అత్యధిక సబ్‌స్క్రైబర్లున్న రెండో యూట్యూబ్‌ ఛానల్‌గా నిలిచింది. ఈ ఛానెల్‌కు సుమారు 26.6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లుగా ఉన్నారు. టి సిరీస్ మ్యూజిక్‌ కంపెనీ అనే విషయం తెలిసిందే.

* మూడో స్థానంలో కోకోమిలాన్‌ నర్సీ రైమ్స్‌ అనే యూట్యూబ్‌ ఛానల్ నిలిచింది. ఈ ఛానెల్‌కు సుమారు 17.6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్స్‌ ఉన్నారు. ఈ ఛానల్‌లో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు వస్తాయి.

* ఈ జాబితాలో ‘సెట్‌ ఇండియా’ అనే యూట్యూబ్‌ ఛానల్‌ నాల్గవ స్థానంలో నిలిచింది. ఈ ఛానల్‌కు సుమారు 17.3 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

* చిన్నారుల కంటెంట్‌ను అందించే కిడ్స్‌ డయానా షో 5వ స్థానంలో నిలిచింది. ఈ ఛానల్‌కు సుమారు 12.2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

* వ్లాడ్‌ అండ్‌ నిక్కి ఈ జాబితాలో 6వ స్థానంలో నిలిచింది. ఈ ఛానల్‌కు సుమారు 11.8 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

* ఇక 7వ స్థానంలో లైక్ నాస్త్య అనే యూట్యూబ్‌ ఛానల్‌ ఉంది. ఈ ఛానల్‌కు సుమారు 11.6 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

* ప్యూడైఫై అనే యూట్యూబ్‌ ఛానల్‌ సుమారు 11.1 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో 8వ స్థానంలో కొనసాగుతోంది

* కాగా భారత్‌కు చెందిన జీ మ్యూజిక్‌ కంపెనీ 1.07 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లతో 9వ స్థానంలో ఉంది.

* ఇదిలా ఉంటే WWE యూట్యూబ్‌ ఛానల్‌ పదవ స్థానంలో ఉంది , ఈ YouTube ఛానెల్‌కు 1.02 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
అనుమానాస్పదంగా ఆగిన రెడ్ కలర్ కారు.. డోర్లు ఓపెన్ చేస్తే..
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఈ సినిమాను పైరసీ చెయ్యలేరు .. సవాల్ విసిరిన నరేష్
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
ఆ పథకంలో వేలల్లో పెట్టుబడితో కోట్లల్లో రాబడి..కానీ వారికి మాత్రమే
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
కేరళకు వెళ్లొద్దు.. విద్యార్థులకు తమిళనాడు ప్రభుత్వం వార్నింగ్.!
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
‘చీరమీను’ రుచి అదిరేను.. మీకు తెలుసా ఈ చేపల గురించి
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
అక్బరుద్దీన్‌కు సీఎం రేవంత్ రెడ్డి బంపర్ ఆఫర్.. వీడియో చూశారా..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
వానొచ్చింది.. ఊరు మురిసింది..! గాడిదల నోరు తీపి చేస్తూ సంబరాలు..
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
కీలక గ్రహాలు అనుకూలం.. ఆ రాశుల వారి ఆదాయం దినదినాభివృద్ధి..!
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తలైంది.. ఇప్పుడు కోట్లల్లో సంపాదన.
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్
మరికొన్ని గంటల్లో భారత్- శ్రీలంక మ్యాచ్.. ఆస్పత్రిలో కీలక ప్లేయర్