AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పనిచేస్తున్నారా..? ఆ విషయంలో మొదటికే మోసం.. బీకేర్‌ఫుల్..

ఆధునిక యుగం.. కంప్యూటర్ లేనిది పనవ్వడం కష్టం.. ఉపాధి కూడా దానితోనే.. ఇలా నేడు ల్యాప్‌టాప్ మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారింది.. అవసరం మేరకు వాడినా.. సక్రమంగా వినియోగించకుంటే నయం కాని ప్రమాదకర రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..

ల్యాప్‌టాప్‌ను ఒడిలో పెట్టుకుని పనిచేస్తున్నారా..? ఆ విషయంలో మొదటికే మోసం.. బీకేర్‌ఫుల్..
Side effects of using laptop on lap
Shaik Madar Saheb
|

Updated on: Jun 08, 2024 | 1:36 PM

Share

ఆధునిక యుగం.. కంప్యూటర్ లేనిది పనవ్వడం కష్టం.. ఉపాధి కూడా దానితోనే.. ఇలా నేడు ల్యాప్‌టాప్ మన రోజువారీ జీవితంలో ఒక భాగంగా మారింది.. అవసరం మేరకు వాడినా.. సక్రమంగా వినియోగించకుంటే నయం కాని ప్రమాదకర రోగాలు వస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పురుషులు తమ ఒడిలో ల్యాప్‌టాప్‌తో గంటల తరబడి పని చేయడం వారి పునరుత్పత్తి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుందని పేర్కొంటున్నారు.

చాలా మంది పురుషులు తమ ఒడిలో ఎక్కువగా ల్యాప్‌టాప్‌ని ఉపయోగిస్తారు. దీనివల్ల ఏం జరుగుతుందనేది వారికి తెలియదు. అయితే ఈ పద్ధతి పురుషుల ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు పేర్కొంటున్నారు.. క్రమంగా ఇది పురుషుల లైంగిక జీవితం, సంతానంపై ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.

ఒడిలో ల్యాప్‌టాప్ పెట్టుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు..

  1. నిరంతరం వేడికి గురికావడం వల్ల వృషణాలలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. అలాగే పురుషుల స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతుంది. స్పెర్మ్ నాణ్యత కూడా చాలా వరకు తగ్గుతుంది.
  2. అయితే.. పురుష పునరుత్పత్తి వ్యవస్థ అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోలేకపోవడమే దీనికి కారణం. స్పెర్మ్ ఉత్పత్తి, పనితీరుకు చల్లని వాతావరణం అవసరమని నిపుణులు అంటున్నారు.
  3. ల్యాప్‌టాప్‌ని ఒడిలో ఉంచినప్పుడు, దాని నుండి వచ్చే వేడి వృషణాల ఉష్ణోగ్రతను పెంచి.. లైంగిక శక్తిని దెబ్బతీస్తుంది. ఇది ‘స్క్రోటల్ హైపర్‌థెర్మియా’ అనే సమస్యకు దారి తీస్తుంది. ఇంకా ఫలదీకరణానికి ఆటంకం కలిగిస్తుంది.
  4. ల్యాప్‌టాప్‌ని ఒడిలో ఉంచి పనిచేస్తున్నప్పుడు ల్యాప్‌టాప్‌లు తరచుగా విద్యుదయస్కాంత తరంగాలను విడుదల చేస్తాయి. ఇది స్పెర్మ్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.
  5. కావున, ఎవరైనా ఒడిలో ల్యాప్ ట్యాప్ ఉంచుకుని పనిచేయడం మంచిది కాదని.. ఇది ఆరోగ్యంపై పెను ప్రభావం చూపుతుందని పేర్కొంటున్నారు. అలా పనిచేస్తుంటే.. ఇప్పటికైనా బంద్ చేయడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..