Wifi: రాత్రంతా వైఫై రూటర్ ఆన్‌లోనే పెడుతున్నారా.? చాలా ప్రమాదం..
ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్‌నెట్ కనెక్షన్లు పెరిగిపోయాయి. వైఫై రూటర్ లేని ఇల్లు లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. అయితే రూటర్‌ను ఉపయోగించే క్రమంలో మనలో చాలా మంది తెలిసో, తెలియకో కొన్ని తప్పులు..
ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగింది. మరీ ముఖ్యంగా స్మార్ట్ ఫోన్‌లు, స్మార్ట్ టీవీలు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటర్‌నెట్ కనెక్షన్లు పెరిగిపోయాయి. వైఫై రూటర్ లేని ఇల్లు లేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదన్నట్లు పరిస్థితులు మారిపోయాయి. అయితే రూటర్‌ను ఉపయోగించే క్రమంలో మనలో చాలా మంది తెలిసో, తెలియకో కొన్ని తప్పులు చేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో రాత్రంగతా రూటర్‌ను ఆన్‌లో ఉంచడం ఒకటి.
దాదాపు ప్రతీ ఒక్కరూ చేసే పనే ఇది. ఇందులో తప్పేముంది అంటారు కదూ! రాత్రి పడుకునేంత వరకు స్మార్ట్ ఫోన్‌తో గడిపే వారు వైఫై రూటర్‌ను ఆఫ్ చేయకుండా అలాగే వదిలేస్తుంటారు. అయితే దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ వైఫై ఆన్‌లోనే ఉంటే జరిగే ఆ నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* రాత్రంతా వైఫై రూటర్ ఆన్‌లోనే ఉంటే దాని నుంచి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియషన్ నిరంతరంగా వెలువడుతూనే ఉంటుంది. దీనివల్ల కొన్ని రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
* మరీ ముఖ్యంగా పడుకునే ప్రదేశానికి దగ్గర్లో రూటర్ ఉంటే బ్రెయిన్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్యకు కూడా ఇది కారణమవుతుందని సూచిస్తున్నారు. అందుకే పడుకునే సమయంలో కచ్చితంగా వైఫై రూటర్‌ను ఆఫ్ చేయాలని చెబుతున్నారు.
* రాత్రంతా వైఫై రూటర్‌ని ఆన్‌లోనే ఉంచితే దాని నుంచి వెలువడే ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ తర్వాత శరీరంలో అనేక వ్యాధులకు కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్యుదయస్కాంత వికిరణం శరీరంలోని కొన్ని వ్యాధులకు కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు.
* కేవలం అనారోగ్య సమస్యలే కాకుండా రాత్రంతా వైఫై ఆన్‌లో ఉంచడం వల్ల టెక్నికల్‌గా కూడా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు వీటిలో ప్రధానమైంది ఇంటర్నెట్ అవసరం లేకపోయినా రూటర్ ఆన్‌లో ఉండడం వల్ల అనవసరంగా కరెంట్ వినియోగం పెరుగుతుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీ ప్రమేయం లేకుండానే మీ రూటర్‌ని హ్యాక్ చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రాత్రి అవసరం లేని సమయంలో రూటర్‌ను ఆఫ్ చేయడం మంచిది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..