- Telugu News Photo Gallery Technology photos Xiaomi launching new smartphone in india Xiaomi 14 civi features and price details
Xiaomi 14 Civi: కొత్త ఫోన్‌తో రచ్చ చేస్తున్న షావోమీ.. ఫీచర్స్ తెలిస్తే మీరు ఇదే అంటారు
భారత మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని రోజుకో కొత్త ఫోన్ సందడి చేస్తోంది. మరీ ముఖ్యంగా దేశంలో 5జీ నెట్‌వర్క్ విస్తరిస్తున్న ప్రస్తుత తరుణంలో 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి కంపెనీలు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. షావోమీ 14 సివి పేరుతో లాంచ్ చేస్తున్న ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Updated on: Jun 09, 2024 | 7:48 PM

చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ భారత మార్కెట్లో కొత్త ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. షావోమీ 14 సివీ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఈనెల 12వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్ చేయనున్నారు. షావోమీ సివి4 ప్రో ఫోన్‌కు రీబ్రాండ్‌గా ఈ ఫోన్ వస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 43 వేలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫోన్‌లో 1.5 కే రిజల్యూషన్‌తో కూడిన అమోఎల్‌ఈడీ స్క్రీన్‌ను అందించనున్నారని సమాచారం. ఈ స్క్రీన్ రిజల్యూషన్ 120 హెర్ట్జ్‌గా ఉండునున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆండ్రాయిడ్ 14 ఆధారిత హైపర్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఈ ఫోన్ పనిచేస్తుంది.

షావోమీ 14 సివీ స్మార్ట్ ఫోన్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్ 3 చిప్ సెట్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇక ఈ ఫోన్‌లో 67 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4700 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. లాంచింగ్ రోజున పూర్తి వివరాలపై స్పష్టత రానుంది.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో లైకా బ్యాక్డ్ ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను, సెల్ఫీలు.. వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. క్రూయిజ్ బ్లూ, మచ్చా గ్రీన్, షాడో బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉండనుంది.




