Samsung 2024 QLED 4K: మార్కెట్‌లోకి సామ్‌సంగ్ నయా స్మార్ట్ టీవీ ఎంట్రీ.. విజువల్ వండర్స్ అందిచేలా అధునాతన ఫీచర్లు

ప్రముఖ కంపెనీ అయిన సామ్‌సంగ్ ఇటీవల భారతదేశంలో కొత్త 2024 క్యూఎల్ఈడీ 4 కే టీవీ సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్ ధరలు రూ.65,990 నుంచి ప్రారంభమవుతాయి. ఈ తాజా లైనప్ అధునాతన ఫీచర్‌లతో ప్రీమియం వీక్షణ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 క్యూఎల్ఈడీ 4 కే టీవీ సిరీస్ మూడు పరిమాణాల్లో అంటే 55 అంగుళాలు, 65 అంగుళాలు. 75 అంగుళాలు అందుబాటులో ఉంది. ఈ  టీవీ ఇప్పటికే సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది.

Samsung 2024 QLED 4K: మార్కెట్‌లోకి సామ్‌సంగ్ నయా స్మార్ట్ టీవీ ఎంట్రీ.. విజువల్ వండర్స్ అందిచేలా అధునాతన ఫీచర్లు
Samsung 2024 Qled 4k
Follow us

|

Updated on: Jun 11, 2024 | 3:05 PM

ప్రముఖ కంపెనీ అయిన సామ్‌సంగ్ ఇటీవల భారతదేశంలో కొత్త 2024 క్యూఎల్ఈడీ 4 కే టీవీ సిరీస్‌ను ప్రారంభించింది. ఈ సిరీస్ ధరలు రూ.65,990 నుంచి ప్రారంభమవుతాయి. ఈ తాజా లైనప్ అధునాతన ఫీచర్‌లతో ప్రీమియం వీక్షణ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024 క్యూఎల్ఈడీ 4 కే టీవీ సిరీస్ మూడు పరిమాణాల్లో అంటే 55 అంగుళాలు, 65 అంగుళాలు. 75 అంగుళాలు అందుబాటులో ఉంది. ఈ  టీవీ ఇప్పటికే సామ్‌సంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంది. ఈ కొత్త టీవీ క్వాంటం ప్రాసెసర్ లైట్ 4కేతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ టీవీల్లో క్వాంటం డాట్ టెక్నాలజీ, క్వాంటం హెచ్‌డీఆర్ 100 శాతం కలర్ వాల్యూమ్‌ అందరినీ ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో సామ్‌సంగ్ 4కే టీవీ గురించి మరిన్ని వివరాలను తెలసుకుందాం. 

సామ్‌సంగ్ 2024 క్యూఎల్ఈడీ 4 కే టీవీలు 4కే అప్‌స్కేలింగ్‌ను కూడా అందిస్తాయి. ఇది కంటెంట్‌కు సంబంధించిన రిజల్యూషన్‌ను మెరుగుపరుస్తుంది. క్యూ-సింఫనీ సౌండ్ టెక్నాలజీ, డ్యూయల్ ఎల్ఈడీ, గేమింగ్ కోసం మోషన్ యాక్సలేటర్, పాన్‌టోన్ వాలిడేషన్ కచ్చితమైన రంగు ప్రాతినిధ్యాన్ని నిర్ధారిస్తుంది. 2024 క్యూఎల్ఈడీ 4 కే సిరీస్ డిజైన్ అందరినీ ఆకర్షిస్తుంది. ముఖ్యంగా ఈ టీవీలు ఎయిర్‌స్లిమ్ డిజైన్‌తో వస్తాయి. హద్దులు లేని స్క్రీన్, సర్దుబాటు స్టాండ్ హోమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సెటప్‌ను ఎలివేట్ చేస్తాయి. అదనంగా ఈ టీవీలు స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ఇందులో బ్యాటరీలు లేకుండా పనిచేసే సోలార్ సెల్ రిమోట్, ఇంధన పొదుపు ప్రయోజనాల కోసం ఏఐ ఎనర్జీ మోడ్ ఆకట్టుకుంటాయి.

2024 క్యూఎల్ఈడీ 4 కే సిరీస్‌లో క్యూ సింఫనీ, ఓటీఎస్ లైట్, అడాప్టివ్ సౌండ్ ఫీచర్‌లు ఉన్నాయి. ఈ సాంకేతికతలు రియల్ టైమ్ కంటెంట్ విశ్లేషణ ద్వారా 3డీ సరౌండ్ సౌండ్ ఎఫెక్ట్‌ను సృష్టిస్తాయి. గేమర్‌లను మోషన్ ఎక్స్‌సెలరేటర్, ఆటో లో లాటెన్సీ మోడ్  ఆకట్టుకుంటాయి. ఇవి స్క్రీన్ మోషన్ స్మూత్‌నెస్‌ని మెరుగుపరుస్తాయి. అలాగే తక్కువ జాప్యంతో వేగవంతమైన ఫ్రేమ్ ట్రాన్సిషన్‌లను అందిస్తాయి. కొత్త టీవీలు సామ్‌సంగ్‌కు సంబంధించిన టీవీ ప్లస్ సర్వీస్‌తో పాటు 100కి పైగా ఉచిత ఛానెల్‌లను అందిస్తాయి. అంతర్నిర్మిత మల్టీ వాయిస్ అసిస్టెంట్ ద్వారా మంచి కనెక్టవిటీను నిర్ధారిస్తుంది. అయితే సామ్‌సంగ్ నాక్స్ సురక్షితమైన టాప్-టైర్ భద్రతను అందిస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Latest Articles
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాంటూ అభ్యర్థనలు
ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్ష వాయిదా వేయాంటూ అభ్యర్థనలు
పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే పాయిజన్ అవుతుందా?
పొట్లకాయ, గుడ్డు కలిపి వండితే పాయిజన్ అవుతుందా?
సుడిగాలి సుధీర్ తొలిసారి కనిపించిన సినిమా ఎదో తెలుసా.?
సుడిగాలి సుధీర్ తొలిసారి కనిపించిన సినిమా ఎదో తెలుసా.?
గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత.. కచ్చితంగా ఇవి పాటించాల్సిందే..
గుండెపోటు నుంచి కోలుకున్న తర్వాత.. కచ్చితంగా ఇవి పాటించాల్సిందే..
ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండటం వల్ల లాభమా? నష్టమా?
ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉండటం వల్ల లాభమా? నష్టమా?
ఆ ప్రాజెక్టులో అడుగంటిన నీటి నిల్వలు.. సాగుకే కాదు తాగుకు కష్టమే
ఆ ప్రాజెక్టులో అడుగంటిన నీటి నిల్వలు.. సాగుకే కాదు తాగుకు కష్టమే
పాలమ్మే బాలిక.. రూ. కోట్లు సంపాదిస్తోంది.. అసాధారణ ప్రయాణం..
పాలమ్మే బాలిక.. రూ. కోట్లు సంపాదిస్తోంది.. అసాధారణ ప్రయాణం..
కర్నూలు జిల్లాలో దేవాలయానికి హీరో సుమన్..
కర్నూలు జిల్లాలో దేవాలయానికి హీరో సుమన్..
ఆ రహదారిపై రాత్రివేళ ప్రయాణిస్తున్నారా? ఆదమరిస్తే అంతే సంగతులు..
ఆ రహదారిపై రాత్రివేళ ప్రయాణిస్తున్నారా? ఆదమరిస్తే అంతే సంగతులు..
గూగుల్‌లో వీటి గురించి వెతుకుతున్నారా.? జైలుకు వెళ్తారు జాగ్రత్త.
గూగుల్‌లో వీటి గురించి వెతుకుతున్నారా.? జైలుకు వెళ్తారు జాగ్రత్త.