Samsung: అదిరిపోయే ఫీచర్లతో మడతపెట్టే మొబైల్.. స్లైడ్ ఆప్షన్ కూడా.. ఇంతకీ ఫోన్ వివరాలు ఏంటంటే?
శామ్సంగ్(Samsung)తన సరికొత్త డిస్ ప్లే డిజైన్లను ఆవిష్కరించింది. ఫ్లెక్స్ హై బ్రీడ్ ప్రోటోటైప్ కు చెందిన ఈ డివైజ్ లు ఫోల్డ్ అవుతాయి.. స్లైడ్ అవుతాయి. రెండు వేరియంట్లను కలిపి ఒకే దానిలో తీసుకురావడంతో వినియోగదారుల్లో ఆసక్తిని కలుగజేస్తోంది.
ఆండ్రాయిడ్ ఫోన్లతో ఒక ట్రెండ్ సృష్టించిన శామ్సంగ్ కంపెనీ మరో సరికొత్త ఆవిష్కరణతో ముందుకొచ్చింది. అందుకు కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES)ను వేదికగా చేసుకుంది. అత్యాధునిక ఫ్లెక్స్ హైబ్రీడ్ స్లైడబుల్, ఫోల్డబుల్ మొబైల్ డిస్ ప్లే ను ఆవిష్కరించింది. అలాగే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ల కోసం సరికొత్త డిజిటల్ కాన్సెప్ట్ డిజిటల్ కాక్ పిట్ ను కూడా ప్రదర్శించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
రెండు వేరియంట్లు ఒక దానిలో..
శామ్సంగ్(Samsung)తన సరికొత్త డిస్ ప్లే డిజైన్లను ఆవిష్కరించింది. ఫ్లెక్స్ హై బ్రీడ్ ప్రోటోటైప్ కు చెందిన ఈ డివైజ్ లు ఫోల్డ్ అవుతాయి.. స్లైడ్ అవుతాయి. రెండు వేరియంట్లను కలిపి ఒకే దానిలో తీసుకురావడంతో వినియోగదారుల్లో ఆసక్తిని కలుగజేస్తోంది. ఎడమచేతి వైపు డిస్ ప్లే ఫోల్డబుల్ టెక్నాలజీ వస్తుండగా.. కుడిచేతి వైపు స్లైడబుల్ ఫెసిలిటీ ఉంటుంది. ఈ డివైజ్ డిస్ ప్లే రేంజ్ 10.5 అంగుళాల నుంచి 12.4 అంగుళాల మధ్య లభిస్తుంది. స్క్రీన్ రేషియో 16:10 ఉంటుందని కంపెనీ వివరించింది.
డిజిటల్ కాక్ పిట్..
ఈ సీఈఎస్ శామ్సంగ్ ప్రదర్శించిన మరో ఆసక్తికర ఉత్పత్తి డిజిటల్ కాక్ పిట్. ఆటోమోబైల్స్ లో ఇండస్ట్రీలో ఉపయోగించేందుకు దీనిని ఆవిష్కరించింది. దీనిలో 34 అంగుళాలు, 15.6 అంగుళాల డిస్ ప్లేతో వస్తుంది. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లలో దీనిని వినియోగించేలా రూపొందించింది. 700R కర్వేచర్ తో కూడిన డిస్ ప్లే డ్రైవింగ్ లో మంచి అనుభూతినిస్తుంది. ఇవి కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ మోడ్లో ఉన్నప్పుడు ప్రయాణికులకు వినోదాన్ని కూడా అందించేందుకు దోహద పడతాయి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం..