Play Smart Watch: తక్కువ ధరలో బ్లూ టూత్ కాలింగ్ స్మార్ట్ వాచ్..ఫీచర్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీలు యువత అభిరుచులకు సరిపోలేలా వివిధ ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. టైంతో పాటు హృదయ స్పందన రేట్, వాకింగ్ ట్రాక్, బ్లూ టూత్ కాలింగ్ వంటి సదుపాయాలను స్మార్ట్ వాచ్ లకు అందిస్తున్నాయి. ధర కూడా అందుబాటులో ఉండడంతో యువత ఎక్కువుగా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా యువత ఆలోచనలు కూడా మారుతున్నాయి. గతంలో కేవలం సమయం చూసుకోడానికి మాత్రమే వాడే వాచిల్లో అనేక సదుపాయాలను కోరుకుంటున్నారు. దీంతో మొబైట్ కంపెనీలు, స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీలు యువత అభిరుచులకు సరిపోలేలా వివిధ ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొస్తున్నాయి. టైంతో పాటు హృదయ స్పందన రేట్, వాకింగ్ ట్రాక్, బ్లూ టూత్ కాలింగ్ వంటి సదుపాయాలను స్మార్ట్ వాచ్ లకు అందిస్తున్నాయి. ధర కూడా అందుబాటులో ఉండడంతో యువత ఎక్కువుగా వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. యువత ఆలోచనలకు అనుగుణంగా దేశీయ స్మార్ట్ వాచ్ తయారీ సంస్థ ప్లే తన కొత్త మోడల్ ను గురువారం మార్కెట్ లో లాంచ్ చేసింది. ప్లే ఫిట్ డయల్ 3 పేరుతో ఇది వినియోగదారులకు అందుబాటులో ఉంది. ప్లే కంపెనీ తన ప్లే ఫిట్ సిరీస్ కు జోడింపుగా ప్లేఫిట్ డయల్ 3 ను లాంచ్ చేసింది.
ప్లే ఫిట్ డయల్ 3 స్పెసిఫికేషన్లు
- 1.8 అంగుళాల డిస్ ప్లే, 500 నిట్స్ బ్రైట్ నెస్
- బ్లూ టూత్ కాలింగ్, ఇంటిగ్రేటెడ్ వాయిస్ అసిస్టెంట్, వాయిస్ మానిటరింగ్
- రక్తపోటు, ఎస్ పీఓ 2, వాకింగ్, స్లీపింగ్ ట్రాకింగ్
- గూగుల్ అసిస్టెంట్, సిరి వంటి సర్వీస్ లతో అనుసంధానం
- పాత ప్లేఫిట్ వాచ్ ల నుంచి అప్ గ్రేడ్ అవుతున్న వారి డేటా మానిటరింగ్
- ఓ సారి చార్జ్ చేస్తే ఐదు రోజుల పాటు సేవలు
ఈ వాచ్ మూడు విభిన్నమైన రంగుల్లో రూ.2999 కు అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ప్లే అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..