Budget Phone: రూ.7000 లోపు అదిరిపోయే స్మార్ట్ ఫోన్స్.. ధరలోనే తక్కువ, ఫీచర్లు మాత్రం అదుర్స్..
ప్రస్తుతం మూడు కొత్త ఫోన్లు మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ధర విషయంలో అన్ని ఫోన్లు ఒకే రేంజ్ లో ఉన్నా ఫీచర్స్ విషయంలో పలు మార్పులు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ బడ్జెట్ ఫోన్ సెషన్ లో పోకో సీ 50, రెడ్ మీ ఏ1, రియల్ మీ సీ 30 ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం భారత్ లో బడ్జెట్ ఫోన్ మార్కెట్ నెమ్మదించింది. డబ్బు కొంత ఎక్కువైనా ఎక్కువ ఫీచర్స్ ఉన్న ఫోన్లనే వాడుతున్నారనే కారణంతో స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా రూ.10000 నుంచి రూ.15000 మధ్య ఉన్న ఫోన్లతో మార్కెట్ లోకి రిలీజ్ చేస్తున్నాయి. దీంతో బడ్జెట్ ఫోన్ ప్రియులు తమ బడ్జెట్ వచ్చే పాత మోడల్ ఫోన్ల వైపే మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలాంటి వారిని టార్గెట్ చేస్తూ ప్రస్తుతం మూడు కొత్త ఫోన్లు మార్కెట్ లో లాంచ్ అయ్యాయి. ధర విషయంలో అన్ని ఫోన్లు ఒకే రేంజ్ లో ఉన్నా ఫీచర్స్ విషయంలో పలు మార్పులు ఉన్నాయి. ప్రస్తుతం మార్కెట్ బడ్జెట్ ఫోన్ సెషన్ లో పోకో సీ 50, రెడ్ మీ ఏ1, రియల్ మీ సీ 30 ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి ఫీచర్స్ లో ఉన్న తేడాలేంటో? ఓ లుక్కేద్దాం.
ధర, మోడళ్లు
పోకో సీ 50 భారత్ లో రెండు స్టోరేజ్ వేరియంట్లల్లో అందుబాటులో ఉంది. 2 జీబీ+32 జీబీ వేరియంట్ ధర రూ.6499 ఉంది. 3 జీబీ+32 జీబీ వేరియంట్ ధర రూ.7299 గా ఉంది. అలాగే రెడ్ మీ ఏ1 ఒకే మోడల్ వస్తుంది. 2 జీబీ+32 జీబీ వేరియంట్ ధర రూ.6499 గా ఉంది. రియల్ మీ సీ 30ఎస్ 2 జీబీ+32 జీబీ వేరియంట్ ధర రూ.7499 గా ఉంటే, 4 జీబీ+ 64 జీబీ మోడల్ ధర రూ. 8999 గా ఉంది.
డిజైన్ల మధ్య వ్యత్యాసం
పోకో సీ 50 ప్లాస్టిక్ బాడీతో వెనకు ప్యానెల్ మాత్రం ఫాక్స్-లెదర్ ముగింపుతో వస్తుంది. అలాగే వెనుకువైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో పాటు ఫ్లాట్ గా కెమెరా ఉంటుంది. రెడ్ మీ ఏ1 కూడా లెదర్ ఫినిషింగ్ తో వస్తుంది. రియల్ మీ సీ 30ఎస్ మాత్రం భిన్నంగా సూట్ కేస్ డిజైన్ తో వస్తుంది. అలాగే ప్లాస్టిక్ ఫినిషింగ్ తో ఉంటుంది. దీని డిజైన్ మాత్రం వినియోగదారులను ఆకట్టుకునేలా లేదు.
డిస్ ప్లే, పనితీరు
పోకో సీ 50 6.52 అంగుళాల డిస్ ప్లే తో 60 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్ తో మీడియా టెక్ హీలియో ప్రాసెసర్ తో ఎండ్రాయిడ్ 12 (గో ఎడిషన్) లో అందుబాటులో ఉంది. రెడ్ మీ ఏ1 6.52 అంగుళాల హెచ్ డీ ప్లస్ స్క్రీన్ రెజుల్యూషన్ తో ఎల్ సీడీ డిస్ ప్లేతో మీడియా టెక్ హీలియో ప్రాసెసర్ తో ఎండ్రాయిడ్ 12 (గోఎడిషన్) తో వస్తుంది. అలాగే రియల్ మీ సీ 30ఎస్ 6.5 అంగుళాల డిస్ ప్లేతో అక్టాకోర్ ప్రాసెసర్ తో వస్తుంది.
కెమెరా, బ్యాటరీ
పోకో సీ 50 ఫోన్ 8 ఎంపీ ప్రైమరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్ సెన్సార్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 10 వాట్స్ సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వినియోగదారులను ఆకట్టుకుంది. అలాగే రెడ్ మీ ఏ1 కూడా 8 ఎంపీ+2ఎంపీ, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. అలాగే రియల్ మీ సీ 30 ఎస్ 8 ఎంపీ ప్రైమరీ కెమెరాతో, 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ సెగ్మెంట్ లో ఈ మూడు ఫోన్ లు ఒకే తరహా స్పెసిఫికేషన్స్ తో ఉన్నాయి.
మూడు ఫోన్లల్లో ఏది బెస్ట్?
ఈ మూడు ఫోన్లు ఒకే తరహా ఫీచర్స్ తో వస్తున్నాయి. పోకో, రెడ్ మీ ఒకె బడ్జెట్ తో ఉంది. అలాగే రియల్ ఆక్టాకోర్ చిప్ సెట్ తో వస్తుంది. అయితే మీరు ఫొటో లవర్స్ అయితే మాత్రం కెమెరా క్లారిటీకు అనుగుణంగా ఫోన్ ను ఎంచుకోవాలి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..