Poco X5 5G:రూ. 20 వేలలోపు 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్ల విషయంలో తగ్గేదేలే..

ప్రస్తుతం భారత మార్కెట్లో 5జీ ఫోన్‌లో హవా కొనసాగుతోంది. దేశంలో 5జీ సేవలు విస్తృతంగా విస్తరిస్తున్న తరుణంలో ఎలక్ట్రాన్‌ కంపెనీలు సైతం వరుసగా 5జీ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో..

Poco X5 5G:రూ. 20 వేలలోపు 5జీ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్ల విషయంలో తగ్గేదేలే..
Poco X5 5g
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 17, 2023 | 8:18 AM

ప్రస్తుతం భారత మార్కెట్లో 5జీ ఫోన్‌లో హవా కొనసాగుతోంది. దేశంలో 5జీ సేవలు విస్తృతంగా విస్తరిస్తున్న తరుణంలో ఎలక్ట్రాన్‌ కంపెనీలు సైతం వరుసగా 5జీ ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తక్కువ ధరలో 5జీ ఫోన్‌లను తీసుకొస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజ సంస్థ పోకో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను తీసుకొస్తోందీ కంపెనీ. పోకో ఎక్స్‌5 5జీ పేరుతో లాంచ్‌ చేసిన ఈ ఫోన్‌లో ఫీచర్లు ఎలా ఉన్నాయి.? మీకోసం..

భారత మార్కెట్లోకి పోకో ఎక్స్‌5 5జీ ఫోన్‌ వచ్చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో క్వాల్కమ్‌ స్నాప్‌ డ్రాగన్‌ 695 ప్రాసెసర్‌ను అందించారు. ఇక 120 హెచ్‌జెడ్‌ సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లే ఈ ఫోన్‌ సొంతం. కెమెరా విషయానికొస్తే.. ఇందులో 48 ఎంపీ ట్రిపుల్ రియ‌ర్ కెమెరాను అందించారు. అంతేకాకుండా బ్యాటరీ విషయానికొస్తే.. 33 డ‌బ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ స‌పోర్ట్‌తో భారీ బ్యాట‌రీ సామ‌ర్ధ్యంతో తీసుకొచ్చారు. ఈ ఫోన్‌ను 128జీబీ, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ల‌లో తీసుకొచ్చారు. ఇక ఇందులో 6.67 ఇంచెస్‌ ఫుల్‌హెచ్‌డీ+సూపర్ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు.

ధర విషయానికొస్తే 128 జీబీ ధర రూ. 18999, 256 జీబీ ధర విషయానికొస్తే రూ. 20,999గా ఉంది. మార్చి 21వ తేదీ నుంచి సేల్ ప్రారంభంకానుంది. లాంఛ్ ఆఫ‌ర్ కింద ఐసీఐసీఐ బ్యాంకు కార్డులతో కొనుగోలు చేసేవారికి పోకో, ఫ్లిప్‌కార్ట్ రూ. 2000 డిస్కౌంట్ అందిస్తున్నారు. దీనికి అద‌నంగా కంపెనీ రూ. 2000 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ను ఆఫ‌ర్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..