AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈ రోజు ఆకాశంలో మహాద్భుతం కనువిందు.. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు.. ఎలా చూడాలో తెలుసా..?

ఈ గ్రహాలన్నీ ఒకే వరుస క్రమంలో వచ్చి కూర్చుంటాయి. అంటే ఆ సమయంలో ఈ గ్రహాల అమరిక సూర్యుడికి ఒకవైపున జరుగుతుంది. ఈ ఖగోళ అద్భుతం ఈ ఏడాది రెండు సార్లు కనువిందు చేయనుంది. ఇది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని 'పరేడ్ ఆఫ్ ప్లానెట్స్' 'గ్రహాల కవాతు'గా పిలుస్తున్నారు. అలాంటి అరుదైన ఘట్టం పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ చూసే అవకాశాన్ని వదులుకోకండి.

ఈ రోజు ఆకాశంలో మహాద్భుతం కనువిందు.. ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు.. ఎలా చూడాలో తెలుసా..?
Planetary Parade
Jyothi Gadda
| Edited By: |

Updated on: Jan 21, 2025 | 5:54 PM

Share

ఆకాశంలో జరిగే అద్భుతాలను ఆసక్తిగా చూసేవారికి గొప్ప శుభవార్త. అంతరిక్ష ప్రేమికులను మంత్రముగ్ధులను చేసేందుకు.. ఈ యేడాదిలో మొదటి ఖగోళ అద్బుతం ఆకాశంలో జరగబోతోంది. ఫిబ్రవరి 28న ఆకాశంలో ఈ అద్భుతం ఆవిష్కృతం కానుంది. రిపబ్లిక్ డే సందర్భంగా పాత్ ఆఫ్ డ్యూటీలో నిర్వహించే కవాతును మీరు చూసి ఉంటారు. అలాంటి దృశ్యమే ఇప్పుడు ఆకాశంలో కనువిందు చేయనుంది. ఆరు గ్రహాలు ఒకే వరుసలో కనిపించనున్నాయి.. ఇది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే జరిగే అద్భుతం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీనిని ‘పరేడ్ ఆఫ్ ప్లానెట్స్’ ‘గ్రహాల కవాతు’గా పిలుస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

అయితే జనవరి 21 నుంచి 31 వరకు ఆకాశంలో జరిగే ఈ అద్భుతంలో ఆరు గ్రహాలు మాత్రమే చూసేందుకు వీలుంటుంది.  శని, బృహస్పతి, అంగారకుడు, శుక్రుడు, నెప్ట్యూన్, యూరేనస్ గ్రహాలు ఒకే వరుసలో కనబడతాయి. యురేనస్, నెప్ట్యూన్‌లను చూడాలంటే టెలిస్కోప్ తప్పనిసరి. ఈ గ్రహాలన్నీ ఒకే వరుస క్రమంలో వచ్చి కూర్చుంటాయి. అంటే ఆ సమయంలో ఈ గ్రహాల అమరిక సూర్యుడికి ఒకవైపున జరుగుతుంది. ఈ ఖగోళ అద్భుతం ఈ ఏడాది రెండు సార్లు కనువిందు చేయనుంది. జనవరి 21వ తేదీ, తిరిగి ఫిబ్రవరి 2వ తేదీన ఈ గ్రహాలు ఒకేవరుసలో దర్శనమివ్వనున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.

ఈ గ్రహాల కవాతు భారతదేశంలో కూడా కనిపించనుంది. ఈ గ్రహాల పరేడ్ దాదాపు నాలుగు వారాలు ఆకాశంలో కనిపిస్తుంది. ఈ సమయంలో ప్రజలు ఈ అద్భుతమైన దృశ్యాలను చూడగలుగుతారు. ఈ గ్రహాలు సూర్యాస్తమయ సమయంలో, సాయంత్రం 8:30 గంటల సమీపంలో ఆకాశంలో చాలా స్పష్టంగా కనిపిస్తాయని శాస్త్రవేత్తలు చెప్పారు. అయితే, ఈ దృశ్యాల స్పష్టత వాతావరణ పరిస్థితులు, కాలుష్య స్థాయిలపై ఆధారపడి ఉంటుంది. ఆరు నుంచి ఏడూ గ్రహాలు ఒకే వరుసలో అమరిపోవడం చాలా అరుదుగా జరిగే సంఘటన. అలాంటి అరుదైన ఘట్టం పరేడ్ ఆఫ్ ప్లానెట్స్ చూసే అవకాశాన్ని వదులుకోకండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఇది తెలుసుకోండి
పాలు, పండ్లు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదేనా..? ఇది తెలుసుకోండి
సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ శర్మ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?
సూర్యకుమార్ యాదవ్‌పై రోహిత్ శర్మ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?
పోలీసులు ఆ పని చేయకుండా.. ఈ పని ఎలా చేస్తారంటూ..?
పోలీసులు ఆ పని చేయకుండా.. ఈ పని ఎలా చేస్తారంటూ..?
యంగ్ హీరో ప్లానింగ్ మామూలుగా లేదుగా.. నెక్స్ట్‌ సినిమా డైరెక్టర్‌
యంగ్ హీరో ప్లానింగ్ మామూలుగా లేదుగా.. నెక్స్ట్‌ సినిమా డైరెక్టర్‌
ఎప్‌స్టీన్‌ వివాదంపై దలైలామా స్పష్టత..!
ఎప్‌స్టీన్‌ వివాదంపై దలైలామా స్పష్టత..!
సినిమా విడుదలై 13 ఏళ్లైనా డైలాగ్స్‌కు ఇంకా పూనకాలే
సినిమా విడుదలై 13 ఏళ్లైనా డైలాగ్స్‌కు ఇంకా పూనకాలే
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
పారతో వృద్దురాలిపై విచక్షణారహితంగా దాడి చేసిన వ్యక్తి!
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
వామ్మో.. ఇదెక్కడి క్రేజ్ రా బాబూ.. ఓటీటీనే క్రాష్ చేసిన ఫ్యాన్స్.
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
ఆరోగ్యానిచ్చే..టేస్టీ టేస్టీ కుల్ఫీ.. కొర్రలతో ఇలా చేయండి!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!
సండే స్పెషల్ : ఉల్లిపాయలతో ఎండు చేపల పులుసు.. తింటే వదిలిపెట్టరు!