AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahakumbh 2025: కొత్త పెళ్లి కూతురిలా ముస్తాబైన మహా కుంభమేళా… రాత్రి వేళ ఆ అద్భుత చిత్రాలు చూడతరమా..!

ఆయా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృత తత్వాన్ని సంతరించుకున్నాయని చెబుతుంటారు. ఈ సమయాన్నే కుంభమేళా సమయంగా భావిస్తారు. ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు బారులు తీరుతుంటారు. ఇప్పుడు జరుగుతున్న మహా కుంభమేళాకు సంబంధించిన రాత్రిపూట దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. రాత్రివేళ మహాకుంభం మేళా ఏర్పాట్లు చూసేందుకు అందంగా ముస్తాభైన నవ వధువులా కనిపిస్తోంది.

Jyothi Gadda
|

Updated on: Jan 21, 2025 | 3:22 PM

Share
మహా కుంభమేళా..ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక..ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ప్రధానంగా జరుగుతోంది. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు కోట్లాది మంది తరలివస్తున్నారు. జనవరి 13 ప్రారంభమైన కుంభమేళా ఫిబ్రవరి 26 వరకూ దాదాపు నలభై అయిదు రోజులపాటు జరుగుతుంది. గంగమ్మతల్లిని మనసారా పూజించడం ఈ వేడుక అసలైన పరమార్థంగా పండితులు చెబుతుంటారు.

1 / 6
క్షీరసాగర మథనం సమయంలో ఆ సాగరంలోంచి అమృతభాండం ఉద్భవించింది. ఆ పాత్రకోసం దేవతలు- రాక్షసులు పోరాటం సాగిస్తున్నప్పుడు అందులోంచి నాలుగు అమృతపు చుక్కలు భూలోకంలోని నాలుగు నదుల్లో పడ్డాయట. దాంతో ఆ నాలుగు నదులూ అత్యంత పవిత్రతను సంతరించుకున్నాయని పురాణాలు చెబుతున్నాయి.

2 / 6
హరిద్వార్‌లోని గంగ, ఉజ్జయినిలోని శిప్రా, నాసిక్‌లోని గోదావరి, ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణీ సంగమంలో అమృత చుక్కలు పడ్డాయని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతారు. ఈ కారణంగా ఆయా నదుల్లోని నీళ్లు కొన్ని సమయాల్లో అమృత తత్వాన్ని సంతరించుకున్నాయని చెబుతుంటారు. ఈ సమయాన్నే కుంభమేళా సమయంగా భావిస్తారు. అందుకే అప్పుడు ఈ నదుల్లో స్నానం చేసేందుకు కోట్లాది భక్తులు బారులు తీరుతుంటారు.

3 / 6
ఆ ప్రత్యేక సమయాన్ని బృహస్పతీ సూర్యచంద్రుల కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. వీటి ఆధారంగానే కుంభమేళాను రెండు రకాలుగా జరుపుతారు. అవే అర్ధ కుంభమేళా, మహాకుంభమేళా. అర్ధ కుంభమేళాని ఆరేళ్లకోసారి చేస్తారు. మహా కుంభమేళా పన్నెండేళ్లకోసారి వస్తుంది. ఈ పన్నెండేళ్లకోసారి వచ్చే మహా కుంభమేళాను మాత్రం దేవతల గురువైన బృహస్పతి కదలికల్ని బట్టి నిర్ణయిస్తారు. బృహస్పతి తన రాశి చక్రాన్ని పూర్తి చేయడానికి 12 సంవత్సరాలు పడుతుంది. గనుక ఆ సమయాన్ని ఆధారంగా చేసుకునే తేదీలను ప్రకటిస్తారు. ఇప్పుడు జరుగుతోంది మహా కుంభమేళానే.

4 / 6
ఈ మహా కుంభమేళాలో పాల్గొనేందుకు దేశం నుండి మాత్రమే కాకుండా విదేశాల నుండి కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే మహా కుంభమేళాకు సంబంధించిన రాత్రిపూట దృశ్యాలు ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. రాత్రివేళ మహాకుంభం మేళా ఏర్పాట్లు చూసేందుకు అందంగా ముస్తాభైన నవ వధువులా కనిపిస్తోంది.

5 / 6
రాత్రిపూట ఆకాశం నుండి తీసిన మహా కుంభమేళ ఫోటోలు నిజంగా హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. ఆ దృశ్యం ఎంత అందంగా, మనోహరంగా ఉందో మాటల్లో చెప్పలేం. కళ్లతో చూడాల్సిందే..మహాకుంభమేళా ఏర్పాట్లు పగటిపూట మాత్రమే కాదు.. రాత్రిపూట కూడా ప్రజల్లో సెంటరాఫ్ అట్రాక్షన్‌గా మిగిలిపోతుందనే చెప్పాలి. ప్రయాగ్‌రాజ్‌లోని ఈ కుంభమేళ ప్రాంతంలోని ఈ మైదానం తనలో దాచిపెట్టిన ఒక అద్భుతమైన, అందమైన కథను చెబుతున్నట్లుగా ఉంది. ఈ చిత్రాలను చూస్తుంటే.. మీ గుండెల్లోనూ 'హర్ హర్ గంగే' అనే నామం జపిస్తుంటుంది..

6 / 6