క్యాజువల్ లుక్‌లో మెరిసిన నిత్యామీనన్.. క్యూట్‌గా ఉందంటున్న ఫ్యాన్స్
ప్రస్తుతం నిత్యామీనన్ ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాల్లోనే నటిస్తుంది. తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కనిపించింది ఈ చిన్నది ఆతర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు. ఇటీవలే తిరుచిత్రంబలం సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా జాతీయ ఫిల్మ్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే.
Updated on: Jan 21, 2025 | 1:42 PM

సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న భామల్లో నిత్యామీనన్ ఒకరు. తన నటనతో నిత్యా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అలా ఎలా సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.

గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు..

ప్రస్తుతం నిత్యామీనన్ ఎక్కువగా తమిళ్, మలయాళ సినిమాల్లోనే నటిస్తుంది. తెలుగులో చివరిగా పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాలో కనిపించింది ఈ చిన్నది ఆతర్వాత మరో తెలుగు సినిమాలో కనిపించలేదు.

ఇటీవలే తిరుచిత్రంబలం సినిమాలో తన నటనకు ఉత్తమ నటిగా జాతీయ ఫిల్మ్ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే.తిరుచిత్రంబలం సినిమా 2022లో థియేటర్లలో విడుదలైంది. ఇందులో ధనుష్, నిత్యా మీనన్, ప్రకాష్ రాజ్, భారతీరాజా, రాశి ఖన్నా, ప్రియా భవానీ శంకర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నిత్యామీనన్ రెగ్యులర్ గా ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఎలాంటి గ్లామర్ షో లేకుండా బ్యూటీ ఫుల్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది ఈ చిన్నది.




