- Telugu News Photo Gallery Cinema photos Actress Sadha Has Become a Proffessional Wild Life Photographer, Check Her Photos
Tollywood: తెలుగు ఇండస్ట్రీని ఏలేసింది.. ఇప్పుడు వైల్డ్ ఫోటోగ్రాఫర్.. ఎవరో గుర్తుపట్టారా..?
ఒకప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆమె టాప్ హీరోయిన్. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. అలాగే అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్ల హృదయాలను దొచేసింది. తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుని తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?
Updated on: Jan 21, 2025 | 5:26 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకున్న హీరోయిన్. దశాబ్దకాలంపాటు తెలుగు చిత్రపరిశ్రమను ఏలేసింది. ఎన్టీఆర్, ఉదయ్ కిరణ్, బాలకృష్ణ, నితిన్ వంటి స్టార్ హీరోలతో కలిసి నటించింది. కట్ చేస్తే ఇప్పుడు వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారింది. ఇంతకీ ఆమె ఎవరంటే..

ఆ హీరోయిన్ మరెవరో కాదు.. సదా. 2003లో నితిన్ హీరోగా పరిచయమైన జయం సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే కథానాయికగా మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత తెలుగు, తమిళంలో వరుస ఆఫర్స్ అందుకుంది.

తెలుగుతోపాటు కన్నడ, తమిళంలో అనేక చిత్రాల్లో నటించి మెప్పించిన సదా.. అప్పట్లో కుర్రవాళ్ల ఫేవరేట్ హీరోయిన్. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో విక్రమ్ చియాన్ నటించిన అపరిచితుడు సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. అప్పట్లో ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో సదాకు మరింత పాపులారిటీ వచ్చింది.

అయితే కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే సదా నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో ఈ బ్యూటీకీ ఆఫర్స్ తగ్గిపోయాయి. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న సదా.. బుల్లితెరపై పలు షోలలో పాల్గొంటుంది.

ఇక ఇప్పుడు వైల్డ్ ఫోటోగ్రాఫర్ గా మారింది. అడవిలో సింహాలు, పులులు, ఏనుగులు, పక్షులను అందంగా ఫోటోస్, వీడియోస్ తీస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి.




