Smart Phones Under 40,000: మరింత చౌకగా టాప్ ఎండ్ స్మార్ట్ ఫోన్లు.. క్యాష్‌బ్యాక్‌లు, ఈఎంఐ ఆఫర్లు ఇవే..!
చాలా మంది హై ఎండ్ ఫోన్లు కంటే మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో ఉండే ఫోన్లను వాడుతున్నారు. అయితే ఫోన్ కొనుగోలుకు కోసం పెట్టే సొమ్ముపై కొంతమేర ఎక్కువ పెడితే హైఎండ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా క్యాష్‌బ్యాక్‌లు, ఈఎంఐలపై మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్ల వాడకం బాగా పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలో ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు ఫోన్లు ఉంటాయి. కరోనా మహమ్మారి తర్వాత వీటి వాడకం మరింత పెరిగింది. అయితే చాలా మంది హై ఎండ్ ఫోన్లు కంటే మధ్యతరగతి వారికి అందుబాటు ధరల్లో ఉండే ఫోన్లను వాడుతున్నారు. అయితే ఫోన్ కొనుగోలుకు కోసం పెట్టే సొమ్ముపై కొంతమేర ఎక్కువ పెడితే హైఎండ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా క్యాష్‌బ్యాక్‌లు, ఈఎంఐలపై మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం బజాజ్‌లో ఉన్న అధునాతన ఆఫర్లతో ఈ స్మార్ట్‌ఫోన్లను తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారతదేశంలో తక్కువ ధరకు వచ్చే హైఎండ్ స్మార్ట్‌ఫోన్లపై ఓ లుక్కేద్దాం.
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 70 ఎస్
6.7 అంగుళాల డిస్‌ప్లేతో వచ్చే ఈ స్మార్ట్‌ఫోన్ 1080X2400 పిక్సెల్స్ రిజుల్యూషన్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్‌తో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9పైతో పని చేస్తుంది. 6 జీబీ+128 జీబీ వేరియంట్లో అందుబాటులో ఉండే ఈ ఫోన్‌లో 64 ఎంపీ ప్రైమరీ కెమెరా, 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 52
నలుపు, నీలం, తెలుపు రంగుల్లో అందుబాటులో ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 750 జీ ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 6.5 అంగుళా డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్లో వెనుక వైపు 64 ఎంపీ కెమెరా, ముందువైపు 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఐపీ 68 రేటింగ్‌తో వాటర్ రెసిస్టెంట్‌తో వచ్చే ఈ ఫోన్ యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. 6 జీబీ + 128 జీబీ వేరియంట్లో వచ్చే ఈ ఫోన్‌లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో ద్వారా ఎక్కువ వినియోగించే అవకాశం ఉంది.
సామ్‌సంగ్ గెలాక్సీ ఏ 71
ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆధారంగా వన్ యూఐ 2.0 ద్వారా పని చేస్తుంది. 8 జీబీ +128 జీబీ వేరియంట్లో వచ్చే ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ ఎస్‌ఎం 7150 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 64 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్‌లో 32 ఎంపీ సెల్ఫీ కెమెరాతో మంచి ఫొటో ఎక్స్‌పీరియన్స్ పొందవచ్చు. 6.7 అంగుళాల డిస్ ప్లేతో వచ్చే ఈ ఫోన్‌లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చింది.
వివో వై 33
స్మార్ట్‌ఫోన్లో మంచి కెమెరాను కోరుకునే వారు ఈ ఫోన్‌ను ట్రై చేయవచ్చు. 6.58 అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో వచ్చే ఈ ఫోన్లో అంతర్నిర్మిత బ్లూ లైట్ ఫిల్టర్లతో వచ్చే ఈ ఫోన్ మీడియా టెక హీలియో జీ 80 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 16 ఎంపీ సెల్ఫీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్‌లో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఆండ్రాయిడ్ 11తో పని చేసే ఈ ఫోన్ 8 జీబీ + 128 జీబీ వేరియంట్లో అందుబాటులో ఉంది.
వివో వై 21
సూపర్ స్లిమ్‌గా వచ్చే ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 182 గ్రాముల బరువు ఉంటుంది. ఆక్టాకోర్ మీడియా టెక్ హీలియో పీ 35 ప్రాసెసర్‌తో పని చేసే ఈ ఫోన్ మిడ్‌నైట్ బ్లూ, డైమండ్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటాయి. 13 ఎంపీ ప్రైమరీ కెమెరాతో వచ్చే ఈ ఫోన్‌లో 8 ఎంపీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన ఆండ్రాయిడ్ 11తో పని చేస్తుంది.