Smart Phone: మార్కెట్‌ను షేక్ చేస్తున్న నయా ఒప్పో ఫోన్.. ఫీచర్స్ తెలిస్తే మతిపోతుందంతే..!
భారతదేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ రోజురోజుకూ విస్తరిస్తుంది. ముఖ్యంగా తక్కువ ధరతో అదిరిపోయే ఫీచర్స్‌తో వచ్చే స్మార్ట్ ఫోన్స్‌ను వాడేందుకు యువత ఉత్సాహం చూపడంతో అన్ని కంపెనీలు నూతన స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ ఒప్పో అదిరే ఫీచర్స్‌తో కొత్త స్మార్ట్ ఫోన్ రిలీజ్ చేసింది. తక్కువ ధరలో మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో ఫోన్ రిలీజ్ చేయడంతో యువతను ఆకర్షిస్తుంది. ఒప్పో రిలీజ్ చేసిన ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.

ఒప్పో కంపెనీ ఏ5 ఎక్స్ పేరుతో తన ఏ-సిరీస్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను ఇటీవల విస్తరించింది. సరసమైన ధరకు లభించే ఒప్పో ఏ-5 ఎక్స్ స్మార్ట్‌ఫోన్ ఐపీ 65 రేటింగ్‌తో పాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌తో ఆకట్టుకుంటుంది. 15 వేల కంటే తక్కువ ధరకు లభించే ఈ ఈ స్మార్ట్‌ఫోన్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ముఖ్యంగా ఈ స్మార్ట్‌ఫోన్ 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఆకట్టుకుంటుంది. అలాగే మీడియా టెక్ డైమెన్సిటీ చిప్ సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఒప్పో ఏ-5 ఎక్స్ స్మార్ట్ ఫోన్ 4 జీబీ+128 జీబీ వేరియంట్‌లో లభిస్తుంది. ఈ వేరియంట్ ధర రూ. 13,999గా ఉంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్ మిడ్నైట్ బ్లూ, లేజర్ వైట్ కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.
ఒప్పో ఏ-5ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఆదివారం నుంచే కస్టమర్లకు కొనుగోలుకు అందుబాటులోకి తీసుకొచ్చారు. వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్‌ను అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యాప్స్‌తో పాటు ఒప్పో అధికారిక ఈ-స్టోర్ నుంచి కొనుగోలు చేయవచ్చు. అలాగే దేశంలోని అధీకృత రిటైల్ స్టోర్ల నుంచి ఆఫ్‌లైన్‌లో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. ఒప్పో ఏ-5 ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై కంపెనీ రూ. 1,000 క్యాష్ బ్యాక్ అందిస్తుంది. అలాగే ఎస్‌బీఐ కార్డ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్, డీబీఎస్ బ్యాంక్ నుంచి 3 నెలల నో-కాస్ట్ ఈఎంఐను కూడా అందిస్తోంది. ఒప్పో ఏ-5ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఎంఐఎల్ ఎస్‌టీడీ సర్టిఫికేషన్‌తో వస్తుంది
ఒప్పో ఏ-5ఎక్స్ స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 720×1604 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.67 అంగుళాల హెచ్‌డీ ప్లస్ డిస్ప్లే ఉంది. ఈ డిస్ ప్లే 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, 1000 నిట్స్ వరకు గరిష్ట బ్రైట్‌నెస్ అందిస్తుంది. ఈ స్మార్ట్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఈ స్మార్ట్ ఫోన్‌కు మైక్రో ఎస్‌డీ కార్డును జోడించడం ద్వారా 1 టీబీ స్టోరేజ్‌ను విస్తరించుకోవచ్చు. ఒప్పో ఏ-5ఎక్స్ స్మార్ట్ ఫోన్ స్మార్ట్ఫోన్ డ్యూయల్ సిమ్ సపోర్ట్ నడుస్తుంది. అలాగే ఒప్పో సొంత కలర ఓస్-15తో ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్‌లో 32 ఎంపీ ప్రైమరీ కెమెరా, సెల్ఫీల కోసం 5 ఎంపీ ఫ్రంట్ కెమేరా ఆకట్టుకుంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. అలాగే 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ రావడంతో కేవలం 20 నిమిషాల్లో 30 శాతం వరకు ఛార్జ్ చేయగలదని కంపెనీ పేర్కొంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








