AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియాలోని మారుమూల పల్లెలో కూర్చోని.. అమెరికాలో నాసాకు చెమటలు పట్టించాడు! ఎవరీ యువరాజ్‌

కాన్పూర్‌కు చెందిన 16 ఏళ్ల యువరాజ్ గుప్తా, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (నాసా) వెబ్‌సైట్‌లోని తీవ్రమైన భద్రతా లోపాన్ని గుర్తించి, నాసా అధికారిక ఇమెయిల్ ఐడీ హ్యాక్ అయ్యే ప్రమాదాన్ని తెలియజేశాడు. యువరాజ్ యూట్యూబ్, ఆన్‌లైన్ కోర్సుల ద్వారా సైబర్ సెక్యూరిటీ నేర్చుకున్నాడు. అతని ప్రతిభను గుర్తించిన నాసా, అతనికి హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించింది.

ఇండియాలోని మారుమూల పల్లెలో కూర్చోని.. అమెరికాలో నాసాకు చెమటలు పట్టించాడు! ఎవరీ యువరాజ్‌
Yuvraj Gupta And Nasa
SN Pasha
|

Updated on: May 25, 2025 | 5:08 PM

Share

కాన్పూర్‌కు చెందిన 11వ తరగతి విద్యార్థి యువరాజ్ గుప్తా (16) నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (NASA)కు చెమటలు పట్టించాడు. ఏకంగా నాసా అధికారిక మెయిల్‌ ఐడీ హ్యాగ్‌ అయ్యే బగ్‌ కనిపెట్టి.. వాళ్లకు పంపించాడు. దీంతో నాసా తొలుత కంగారు పడినా.. ఆ కుర్రాడి మేథస్సుకు ఫిదా అయిపోయింది. యువరాజ్‌కు హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు కల్పించింది. చాలా మంది సైబర్ నిపుణులు గుర్తించలేని వాటిని గుర్తించినందుకు యువరాజ్‌ను నాసా ఈ విధంగా గౌరవించింది. ఈ కుర్రాడు NASA వెబ్‌సైట్‌లో తీవ్రమైన భద్రతా లోపాన్ని కనుగొన్నాడు . దీని ద్వారా NASA అధికారిక ఇమెయిల్ ID హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని, ఎవరైనా NASA ఇమెయిల్ చిరునామాను ఉపయోగించి నకిలీ సందేశాలను పంపవచ్చని తేల్చాడు.

ఎవరీ యువరాజ్ గుప్తా?

యువరాజ్ సరస్వతి విద్యా మందిర్ ఇంటర్ కాలేజీ (దామోదర్ నగర్)లో 11వ తరగతి చదువుతున్నాడు. పేద కుటుంబంలో జన్మించినప్పటికీ సైబర్‌ సెక్యూరిటీలో మంచి నాలెడ్జ్‌ సంపాదించాడు. 10వ తరగతిలో 79.4 పాయింట్లు సాధించాడు. యూట్యూబ్, ఆన్‌లైన్ కోర్సులు, పుస్తకాల ద్వారా హ్యాకింగ్ నేర్చుకున్నాడు. అతను ఇటీవల NASA బగ్ బౌంటీ కార్యక్రమంలో పాల్గొన్నాడు. NASA పేరుతో నకిలీ ఇమెయిల్‌లను పంపడానికి అనుమతించే బగ్‌ను కనుగొన్నాడు. దాదాపు రెండు వారాల నిరంతర ప్రయత్నం తర్వాత యువరాజ్ పూర్తి నివేదికను తయారు చేసి, వీడియోతో పాటు నాసాకు పంపాడు. ఇది మాత్రమే కాదు, అతను నకిలీ ఈమెయిల్స్, గోప్య సమాచారాన్ని పొందిన లోపాల గురించి కూడా సమాచారం పొందాడు.

భారతదేశానికి చెందిన ఒక చిన్న పిల్లవాడు సాధించిన విజయానికి నాసా ఆశ్చర్యపోయింది. యువరాజ్ 6వ తరగతిలో ఉన్నప్పుడు వై-ఫై పాస్‌వర్డ్‌ను హ్యాక్ చేయడానికి ప్రయత్నించినప్పటి నుండి సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి పెంచుకున్నాడు. అలా అలా ఈ రంగంలో తనను తాను నిమగ్నం చేసుకున్నాడు. 2024లో అతను సోషల్ మీడియా ద్వారా సైబర్ సెక్యూరిటీ కంపెనీ వ్యవస్థాపకుడితో కనెక్ట్ అయ్యాడు. సైబర్ నేరాలను ఎదుర్కోవడంలో దేశవ్యాప్తంగా పోలీసు అధికారులకు శిక్షణ ఇచ్చే అవకాశం కూడా యువరాజ్‌కు లభించింది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యువరాజ్ కుటుంబం అతనికి అండగా నిలిచింది. తన సోదరి స్కాలర్‌షిప్, తండ్రి సహాయంతో అతను ఒక ల్యాప్‌టాప్ కొని దానితో తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు.

మరిన్ని  జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి