ఘోర ప్రమాదం.. రోడ్డు దాటుతుండగా ఢీకొట్టిన కారు.. ఏడాది పాపతో సహా నలుగురు మృతి
తమిళనాడులోని మధురై జిల్లా ఉసిలంపట్టిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న 7 మందిని వేగంగా దూసుకువచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు వ్యక్తులు తీవ్ర గాయాలతో మధురై ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నారు.

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరగింది. మధురై జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడాది వయసున్న బాలికతో సహా నలుగురు మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. ఉసిలంపట్టి సమీపంలో రోడ్డు దాటుతుండగా జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. వారంతా ఆలయాన్ని సందర్శించిన తర్వాత ఇంటికి తిరిగి వస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కంజంపాటికి చెందిన లక్ష్మి, కరుప్పాయి, పాండిసెల్వి, జ్యోతికతో సహా ఏడుగురు వ్యక్తులు ఉసిలంపాటిలోని ఆలయాన్ని సందర్శించి ఇంటికి తిరిగి వస్తున్నారు. బస్సు దిగి రోడ్డు దాటుతుండగా, వేగంగా వస్తున్న కారు వారిని ఢీకొట్టింది. రోడ్డు దాటుతున్నవారిపై వేగంగా దూసుకువచ్చిన కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడాది వయసున్న బాలిక సహా నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పాండిసెల్వి, జ్యోతిక, లక్ష్మి, ఒక సంవత్సరం వయసున్న బాలిక అక్కడికక్కడే మరణించగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సహాయంతో, గాయపడిన వారిని ఉసిలంపట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే, ఉసిలంపట్టి పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చనిపోయిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన తర్వాత పారిపోయిన కారు డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




