Nokia 5710: గత వైభవం కోసం పావులు కదుపుతోన్న నోకియా.. లేటెస్ట్‌ టెక్నాలజీతో కొత్త ఫోన్‌ లాంచ్‌.. ప్రత్యేకత తెలిస్తే..

Nokia 5710 xpressmusic: ఇప్పుడంటే మార్కెట్లో రకరకాల బ్రాండ్ల ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకప్పుడు మాత్రం ఫోన్‌ అంటే నోకియా, నోకియా అంటే ఫోన్‌ అన్నంతలా క్రేజ్‌ ఉండేది. మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌ను ఏలిన నోకియా...

Nokia 5710: గత వైభవం కోసం పావులు కదుపుతోన్న నోకియా.. లేటెస్ట్‌ టెక్నాలజీతో కొత్త ఫోన్‌ లాంచ్‌.. ప్రత్యేకత తెలిస్తే..
Follow us
Narender Vaitla

|

Updated on: Jul 15, 2022 | 8:18 AM

Nokia 5710 xpressmusic: ఇప్పుడంటే మార్కెట్లో రకరకాల బ్రాండ్ల ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకప్పుడు మాత్రం ఫోన్‌ అంటే నోకియా, నోకియా అంటే ఫోన్‌ అన్నంతలా క్రేజ్‌ ఉండేది. మొబైల్‌ ఫోన్‌ మార్కెట్‌ను ఏలిన నోకియా ఆ తర్వాత స్మార్ట్‌ ఫోన్ల రంగంలో పెద్దగా రాణించలేదు. ఆండ్రాయిడ్‌ ఫోన్‌ల హవా నడుస్తోన్న సమయంలో విండోస్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఫోన్లను విడుదల చేసిన నోకియా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. దీంతో ప్రస్తుతం ఆండ్రాయిడ్‌ ఆధారిత ఫోన్‌లను విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే నోకియా మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే మళ్లీ ఫీచర్‌ ఫోన్‌లను పరిచయం చేస్తోంది.

అయితే ఈ ఫీచర్‌ ఫోన్లకు సరికొత్త టెక్నాలజీని జోడిస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా నోకియా 5710 ఎక్స్‌ప్రెస్‌ మ్యూజిక్‌ పేరుతో సరికొత్త ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ వెనకాల వైర్‌ లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను స్టోర్ చేసుకునేందుకు వీలుగా కేస్‌ను అందించింది. అంతేకాదు ఇయర్‌ బడ్స్‌ను ఛార్జింగ్‌ చేయడానికి ప్రత్యేకంగా కేస్‌ అవసరం లేకుండా, ఫోన్‌ వెనకాలే బిల్ట్‌-ఇన్‌ ఛార్జింగ్ కేస్‌ను అందించడం విశేషం. ఇందుకోసం ఫోన్‌ వెనకాల ఒక స్లైడ్‌ను అందించారు. దానిని కిందికి లాగితే ఇయర్‌బడ్స్‌ స్లాట్‌ కనిపిస్తుంది. అవసరం తీరాక ఇయర్‌ బడ్స్‌ను అందులో ఉంచితే ఛార్జింగ్‌ అవుతాయి.

ఇక ఈ ఫోన్‌లో ఉన్న ఇతర ఫీచర్ల విషయానికొస్తే 2.75 వాట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 1450 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించారు. 2.4 ఇంచెస్‌ స్క్రీన్‌, టీ9 కీబోర్డ్‌ను అందించారు. ఈ ఫోన్‌ 4జీ నెట్‌వర్క్‌కు సపోర్ట్‌ చేయడం విశేషం. ఎస్‌30+ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేసే ఈ స్మార్ట్‌ ఫోన్‌లో 48 ఎంబీ ర్యామ్‌+128 ఎమ్‌బీ స్టోరేజ్‌ను అందించారు. ప్రస్తుతం యూరప్‌లో ఈ ఫోన్‌ను లాంచ్‌ చేశారు. త్వరలోనే భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ధర విషయానికొస్తే రూ. 7 వేలుగా ఉండనున్నట్లు అంచనా.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..