Nokia Smartphones: నోకియా రీ స్టార్ట్.. ఏకంగా 17 ఫోన్లతో మార్కెట్లోకి.. లాంచింగ్ ఎప్పుడంటే..

నోకియా 17 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఐఎంఈఐ డేటాబేస్‌లో టీఏ-1603 నుంచి టీఏ-1628 వరకు 17 కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్‌లను జీఎస్ఎం చైనా గుర్తించింది . ఈ మోడల్‌లు ప్రాథమిక ఫోన్‌లలోనే విభిన్న ర్యామ్/స్టోరేజ్ వేరియంట్‌లు లేదా పూర్తిగా భిన్నమైన ఫోన్‌లు కావచ్చు. రాబోయే ఎండబ్ల్యూసీ (మొబైల్ వరల్డ్ కాంగ్రెస్)లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను కూడా ప్రారంభించవచ్చని తెలుస్తోంది.

Nokia Smartphones: నోకియా రీ స్టార్ట్.. ఏకంగా 17 ఫోన్లతో మార్కెట్లోకి.. లాంచింగ్ ఎప్పుడంటే..
Nokia Smartphones
Follow us
Madhu

|

Updated on: Feb 13, 2024 | 7:53 AM

నోకియా.. ఈ పేరు ఇప్పుడైతే ఎక్కడా పెద్దగా వినపడటం లేదు గానీ.. ఒకప్పుడు ఫోన్ అంటే నోకియానే. దీని తర్వాతనే ఏ బ్రాండ్ అయినా. అంతలా వెలిగిన ఆ బ్రాండ్ ఇప్పుడు మచ్చుకు కూడా కనిపించడం లేదు. ఎక్కడ కనిపించడం లేదు సరికదా.. ఆ పేరు కూడా వినిపడటం లేదు. అయితే ఇటీవల కొన్ని బేసిక్ మోడల్ ఫోన్లను తీసుకొచ్చినా జనాల్లోకి అవి అంతగా వెళ్లలేదు. ఈ క్రమంలో హెచ్ఎండీ గ్లోబల్ ఆధ్వర్యంలో నడిచే నోకియా 2024ని పెద్దగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు నోకియా ఫోన్లకు సంబంధించి నెట్టింట చోటుచేసుకుంటున్నాయి. అందులో మొదటిది హెచ్ఎండీ గ్లోబల్ ఇటీవల నోకియా సోషల్ హ్యాండిల్స్, వెబ్‌సైట్ పేర్లను హ్యూమన్ మొబైల్ డివైసెస్ (హెఎండీ)గా మార్చింది. అంతేకాక ఇప్పటికే మార్కెట్లో నిద్రావస్థలోకి వెళ్లిపోతున్న బ్రాండ్ ను మేల్కోలిపేలా నోకియా 17 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సన్నద్ధమవుతోందని సమాచారం. ఈ కొత్త లైనప్ లో ఏమేమి ఫోన్లు ఉంటాయి? అన్నీ స్మార్ట్ ఫోన్లేనా? ఏమైనా కొత్త వేరియంట్లు ఉంటాయా? పూర్తి సమాచారం ఇప్పుడు చూద్దాం..

జీఎస్ఎం చైనా నివేదిక ప్రకారం నోకియా 17 కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఐఎంఈఐ డేటాబేస్‌లో టీఏ-1603 నుంచి టీఏ-1628 వరకు 17 కొత్త స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్‌లను జీఎస్ఎం చైనా గుర్తించింది . ఈ మోడల్‌లు ప్రాథమిక ఫోన్‌లలోనే విభిన్న ర్యామ్/స్టోరేజ్ వేరియంట్‌లు లేదా పూర్తిగా భిన్నమైన ఫోన్‌లు కావచ్చు. రాబోయే ఎండబ్ల్యూసీ (మొబైల్ వరల్డ్ కాంగ్రెస్)లో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లను కూడా ప్రారంభించవచ్చని తెలుస్తోంది. స్మార్ట్‌ఫోన్‌లు నోకియా బ్రాండ్‌నే కలిగి ఉండే అవకాశం ఉంది. హెచ్ఎండీ బ్రాండ్ లోగో ఉంటుందో లేదో తెలియాల్సి ఉంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన ఇతర సమాచారం ఏమీ తెలియలేదు. టీఏ-1584, టీఏ-1594, టీఏ-1595, టీఏ-1588, టీఏ-1589, టీఏ-1592, టీఏ-1602, టీఏ-1605 మోడల్ నంబర్‌లను కలిగి ఉన్న ఐఎంఈఐ డేటాబేస్‌లో తొమ్మిది కొత్త హెచ్ఎండీ-బ్రాండెడ్ ఫోన్‌లు కూడా ఇటీవల గుర్తించారు. నోకియా ఆఫ్‌లైన్‌లో ఫోన్‌లను విక్రయిస్తుందని, హెచ్‌ఎండీ ఆన్‌లైన్ మార్కెట్‌ను అందజేస్తుందని సమాచారం.

నోకియా ఇంకా ఉనికిలోనే..

నోకియా బ్రాండ్ ఇప్పటికీ ఉనికిలో ఉందని .. ప్రస్తుతం కనిపిస్తున్న పరిణామాల ప్రకారం కొన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లతో మార్కెట్‌ను ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. హెచ్ఎండీ కూడా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి అడుగు పెట్టాలని యోచిస్తోంది. ఈ క్రమంలో వెనుక ప్యానెల్‌లో హెచ్ఎండీ బ్రాండింగ్ , 108ఎంపీ ఓఐఎస్ కెమెరాతో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానున్నట్లు ఇటీవల ప్రకటించింది. హెచ్ఎండీ గ్లోబల్ తన సొంత బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను ఏప్రిల్ 2024 నాటికి భారతీయ మార్కెట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..