AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cyber Crime: ఇకపై సైబర్‌ నేరాలకు చెక్.. త్వరలో ట్రాయ్ కొత్త రూల్స్!

టెలికాం రంగాన్ని నియంత్రించే TRAI, ఇప్పుడు స్కామ్ సంఘటనలను ఆపడానికి స్పామ్ కాల్స్, సందేశాలను అరికట్టడానికి సిద్ధమైంది. టెలి మార్కెటింగ్ కంపెనీలు కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చేందుకుంది ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) త్వరలో ఒక సంప్రదింపు పత్రాన్ని తీసుకురానుంది. ఇది టెలి మార్కెటర్లను నియంత్రించడానికి ఒక చట్రం కావచ్చు.

Cyber Crime: ఇకపై సైబర్‌ నేరాలకు చెక్.. త్వరలో ట్రాయ్ కొత్త రూల్స్!
Trai On Spam
Balaraju Goud
|

Updated on: Feb 18, 2025 | 10:13 PM

Share

సైబర్‌ నేరాల కట్టడి ఇప్పుడో సవాల్‌గా మారింది. అమాయకులను మోసం చేసేందుకు.. ప్రతీ సందర్భాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. నేడు సామాన్యులకు అతిపెద్ద సమస్య ఆన్‌లైన్ స్కామ్, సైబర్ మోసం. తమ సౌలభ్యం కోసం ప్రతి చెల్లింపు, ప్రయాణ టికెట్ బుకింగ్ నుంచి ప్రతిదీ ఆన్‌లైన్‌లోకి వచ్చింది. క్రమంగా మోసాలకు కొత్త డిజిటల్ పద్ధతులు కనిపెడుతూనే ఉన్నారు. టెలిమార్కెటర్ల ముసుగులో అనేక మోసాలు జరిగాయి. నేటికీ స్కామర్లు ఈ పద్ధతిని ఎక్కువగా అమలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. కానీ ఇప్పుడు స్కామర్లకు చెక్ పెట్టేందుకు ట్రాయ్ సిద్ధమవుతోంది. సామాన్యులను కాపాడటానికి, స్పామ్ కాల్స్, మెసేజ్‌లను నియంత్రించడానికి TRAI కొత్త ప్రణాళికను సిద్ధం చేసింది.

టెలికాం రంగాన్ని నియంత్రించే TRAI, ఇప్పుడు స్కామ్ సంఘటనలను ఆపడానికి స్పామ్ కాల్స్, సందేశాలను అరికట్టడానికి సిద్ధమైంది. టెలి మార్కెటింగ్ కంపెనీలు కూడా దీని పరిధిలోకి తీసుకువచ్చేందుకుంది ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) త్వరలో ఒక సంప్రదింపు పత్రాన్ని తీసుకురానుంది. ఇది టెలి మార్కెటర్లను నియంత్రించడానికి ఒక చట్రం కావచ్చు. స్కామర్లు స్కామ్ చేయడానికి సాధారణంగా అత్యంత ప్రజాదరణ పొందిన పద్ధతి అయిన టెలిమార్కెటింగ్ కాల్స్, SMS లను పర్యవేక్షించడానికి నిబంధనలు ఉండవచ్చు. స్పామ్ కాల్స్, సందేశాలను నియంత్రించడానికి ఇప్పటికే ఉన్న నియమాలు ఇంకా వాటి ప్రభావాన్ని చూపించడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త రూల్స్ తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది.

మరోవైపు, TRAIప్రణాళికను టెలికాం కంపెనీలు చాలా విమర్శిస్తున్నాయి. స్పామ్‌ను నియంత్రించడానికి ప్రస్తుతం రూపొందించిన నియమాలు OTT ప్లేయర్‌లు, టెలి మార్కెటర్‌ల వంటి ప్రధాన వాటాదారులను మినహాయించాయని రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్ మరియు వొడాఫోన్ ఐడియా వంటి కంపెనీలు చెబుతున్నాయి. అదే సమయంలో, దీనిపై కొత్త నిబంధనలు ఎప్పుడు తీసుకువస్తామో, అప్పుడు అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామని ట్రాయ్ తెలిపింది. వారి ఆందోళనలను తొలగించడానికి కృషి చేస్తామని TRAI చెబుతోంది.

టెలికాం కంపెనీల అతిపెద్ద ఆందోళన ఏమిటంటే వారు టెలి మార్కెటింగ్, OTT ప్లాట్‌ఫామ్‌లకు మౌలిక సదుపాయాల ప్రదాత మాత్రమే. కానీ స్పామ్‌ను ఆపడానికి, అదనపు నియమాలు, నిబంధనలు, నిర్వహణ ఖర్చులను వాటిపై విధించడం జరుగుతుంది. ఇదిలావుంటే, భారతదేశంలో ప్రతిరోజూ 1.5 నుండి 1.7 బిలియన్ల వాణిజ్య సందేశాలు పంపడం జరుగుతుంది. ఈ విధంగా, ప్రతి నెలా దేశంలోని అన్ని టెలికాం వినియోగదారులకు మొత్తం 55 బిలియన్ వాణిజ్య సందేశాలు పంపడం జరుగుతుంది. అటువంటి పరిస్థితిలో, వీటిలో స్పామ్‌ను గుర్తించడం సంక్లిష్టమైన, ఖరీదైన పని. ఈ నేపథ్యంలో ఆందోళన వ్యక్తమవుతోంది. చూడాలి మరీ ట్రాయ్ తీసుకువచ్చే కొత్త నిబంధనలు ఏమేరకు సామాన్యులకు సైబర్ క్రైమ్ నుంచి రక్షణగా ఉంటాయో..!

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..